హోంమంత్రి రాజీనామా..నేపాల్ లో ముదిరిన రాజకీయ సంక్షోభం

Publish Date:Apr 23, 2026

Advertisement

నేపాల్‌  రాజకీయాలు మరోసారి సంక్షోభంలో పడ్డాయి. ప్రధానమంత్రి బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం కొలువుదీరి   నెల రోజులు కూడా గడవక ముందే ఆయన కేబినెట్ లో కీలకమైన హోంమంత్రి ర రాజీనామా చేశారు. నేపాల్ హోంమంత్రి  సుదన్ గురుంగ్ బుధవారం (ఏప్రిల్ 22) తన పదవికి రాజీనామా చేస్తూ ప్రధానికి లేఖ సమర్పించారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఇలా ఆకస్మికంగా తప్పుకోవడం ఇప్పుడు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. 

ఇటీవల కొన్ని రోజులుగా  సుదన్ గురుంగ్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంతో పాటు, మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న  దీపక్ భట్టా సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టినట్లు ఆధారాలు బయటపడటంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  నిష్పాక్షిక విచారణకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో..  నైతిక బాధ్యత వహిస్తూ తాను తప్పుకుంటున్నట్లు గురుంగ్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  

ఇలా ఉండగా.. బాలెన్ షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. ముఖ్యంగా భారత్‌తో సరిహద్దు వాణిజ్య నిబంధనల్లో తీసుకొచ్చిన మార్పులు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. వంద నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన భారతీయ వస్తువులపై కస్టమ్స్ సుంకం విధించడం వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి నిరసనగా కాఠ్మండు సహా ప్రధాన నగరాల్లో విద్యార్థులు, రాజకీయ పక్షాలు భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.

అవినీతి రహిత పాలన  వాగ్దానంతో   పీఠమెక్కిన బాలెన్ షాకు, తన కేబినెట్ మంత్రిపైనే  తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది.  ఇటు టు సొంత పార్టీలో అసమ్మతి, అటు వీధుల్లో జనం నిరసనల మధ్య ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.  

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.