దేశ ప్రయోజనాలే పరమావధిగా గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక దౌత్యం

Publish Date:Apr 24, 2026

Advertisement

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక దౌత్యానికి పదును పెట్టింది. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది.  ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారు  అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు,  పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన  అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ  ఎనర్జీ-సెక్యూరిటీ  ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు. 

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద రవాణా ఇబ్బందులు, ఎర్రసముద్రం ప్రాంతంలో నౌకలపై దాడులు వంటి అంశాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. భారత్ తన అవసరాలకు కావాల్సిన చమురు,  సహజ వాయువులో 60 శాతానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో.. సరఫరా గొలుసు దెబ్బతింటే అది దేశీయంగా ద్రవ్యోల్బణానికి, ఆర్థిక మందగమనానికి దారితీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. అందుకే గల్ఫ్ దేశాలతో సంబంధాలను కేవలం వాణిజ్య పరంగానే కాకుండా, జాతీయ భద్రతా కోణంలోనూ  భారత్ పటిష్టం చేసుకుంటోంది.అజిత్ దోవల్ ఈ నెల సౌదీ అరేబియా పర్యటన ఈ కోవలోనిదే. ఈ పర్యటనలో భాగంగా ఆయన రియాద్ లో సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్, విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు ముసాయిద్ అల్-ఐబాన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు సముద్ర రవాణా భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఈ పర్యటనను భారత విదేశాంగ శాఖ  వ్యూహాత్మక) పర్యటనగా అభివర్ణించడమే దీని ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. 

సౌదీ అరేబియా భారత్‌కు మొదటి మూడు ప్రధాన చమురు సరఫరాదారుల్లో ఒకటి. అంతే కాకుండా ఇక్కడ దాదాపు 40 లక్షల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా  ఉద్రిక్తతలు, సౌదీ-పాకిస్థాన్ రక్షణ ఒప్పందాల వంటి అంశాల నేపథ్యంలో భారత్ కు చమురు ధరలతో పాటు, అక్కడి ప్రవాస భారతీయుల భద్రత అత్యంత ప్రాధానం. ఈ నేపథ్యంలోనే అజిత్ దోవల్ రియాద్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇక మరోవైపు, విదేశాంగ మంత్రి జైశంకర్ యూఏఈ పర్యటన కూడా ఇదే వ్యూహంలో భాగంగా  చెప్పాలి. గల్ఫ్ ప్రాంతంలో భారత్‌కు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన యూఏఈ, పెట్టుబడులు,  మౌలిక సదుపాయాల కల్పనలో కీలక భాగస్వామిగా ఉంది. అదేవి ధంగా, ఖతార్ పర్యటన ద్వారా ఎల్‌ఎన్‌జీ , ఎల్‌పీజీ ( సరఫరాపై పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టి సారించారు. గ్యాస్ ఒప్పందాలు దీర్ఘకాలం పాటు కొనసాగేలా, ధరల్లో స్థిరత్వం ఉండేలా చూడటం ద్వారా భారత పారిశ్రామిక రంగానికి భరోసా కల్పించడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం.భారత్ ఇప్పుడు  ప్రాక్టికల్ డిప్లొమసీ ని అవలంబిస్తోంది. భావోద్వేగాలకు తావులేకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేస్తోంది. ఏ ఒక్క దేశంపైనో ఆధారపడకుండా విభిన్న వనరుల నుంచి ఇంధనాన్ని సేకరించడం ద్వారా ముప్పును తగ్గించుకోవాలని చూస్తోంది. 

సముద్ర మార్గాల్లో నౌకల ప్రయాణం సురక్షితంగా సాగడం, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగకుండా చూడటం వంటి అంశాలపై దోవల్ చర్చలు కేంద్రీకృతమయ్యాయి.మొత్తానికి, భారత్ చేపట్టిన ఈ గల్ఫ్ దౌత్యం కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం చేస్తున్న ప్రయత్నం కాదు..   భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేలా ఒక పటిష్టమైన  ఇంధన భద్రత వ్యవస్థను నిర్మించే దిశగా వేసిన అడుగుగా చెప్పాలి.  ఇంధన భద్రతే జాతీయ భద్రతగా  భావిస్తున్నకేంద్రం పశ్చిమ ఆసియాలోని కీలక దేశాలతో తన దౌత్య సంబంధాలను  కొత్త శిఖరాలకు తీసుకెళ్లే వ్యూహంతో అడుగులు వేస్తున్నది.  రానున్న రోజుల్లో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి మరింత ఊతమిచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 -సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
భర్త హత్యకు ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను రంగంలోకి దింపిన భార్య ఘటన వైయస్సార్ కడప జిల్లాలో సంచలనం రేపింది.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.