హర్మూజ్ లో ఇరాన్ దాడులు.. ఇండియన్ మృతి.!
Publish Date:Jul 14, 2026
Advertisement
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ముఖ్యంగా హర్మూజ్ ఒక యుద్ధ భూమిగా మారింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. యూఏఈ కి చెందిన రెండు చమురు నౌకలపై ఇరాన్ జరిపిన దాడిలో ఒక మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఆరుగురు ఇండియన్స్ కాగా, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారు. కాగా ఈ దాడి పట్ల ప్రపంచ దేశాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఒమన్ ప్రాంతీయ జలాల పరిధిలో మొంబాసా , అల్ బహియా అనే రెండు యూఏఈ చమురు నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను, నౌకాయాన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఈ దాడికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది.ఈ క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే రంగంలోకి దిగిన అమెరికా సేనలు ఇరాన్‌పై వైమానిక దాడులను ఉధృతం చేశాయి. ఇరాన్ దాడుల సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా దెబ్బతీసేందుకు తాము సరికొత్త ఆపరేషన్ ప్రారంభించినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకుని, దిగ్బంధాన్ని కఠినతరం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకల రక్షణ బాధ్యతను అమెరికా చూసుకుంటున్నందున, దానికి ప్రతిఫలంగా ఆయా నౌకల నుంచి ప్రొటెక్షన్ ఫీజు వసూలు చేయబోతున్నట్లు ట్రంప్ చెప్పారు.ఈ ఉద్రిక్తతల ప్రభావం గ్లోబల్ మార్కెట్‌పై చూపింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర7.8శాతం పెరిగి.. బ్యారెల్‌కు 81.92 డాలర్లకు చేరుకుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరింత పెరిగి ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. Iran missile attack Hormuz, UAE oil tankers attacked, Indian crew member killed, US Iran tensions 2026, Brent crude oil price hike, Strait of Hormuz blockade
http://www.teluguone.com/news/content/-iran-attack-uae-ships-36-225913.html





