గురుగ్రామ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు గ్యాంగ్ స్టర్లు హతం.!

Publish Date:Jul 10, 2026

Advertisement

దేశ రాజధాని ప్రాంత (NCR)  పరిధిలోని   పారిశ్రామిక నగరం గురుగ్రామ్‌లో  గురువారం (జులై 9) అర్ధరాత్రి జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్ స్టర్లు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.  సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో  నేరగాళ్లను పట్టుకునే క్రమంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. నివాస ప్రాంతాల మధ్య జరిగిన ఘటన  స్థానికులను  భయాందోళనలకు గురిచేసింది. వివరాలిలా ఉన్నాయి.  

ఎస్‌జీటీ (ఎస్జీటీ) యూనివర్సిటీ వ్యవస్థాపకుడి కుమారుడు, ఒక ప్రముఖ వ్యాపారవేత్తను టార్గెట్ చేస్తూ కొంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటూ అంతర్జాతీయ క్రైమ్ నెట్‌వర్క్ నడుపుతున్న గ్యాంగ్‌స్టర్ దీపక్ నందల్ పేరుతో ఈ ముఠా భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే.. గురువారం (జులై9)  రాత్రి ఒక  ఎస్‌యూవీ  వాహనంలో అత్యాధునిక మారణాయుధాలతో వచ్చిన సాయుధ దుండగులు సదరు వ్యాపారవేత్త నివాస సమీపంలోకి చేరుకున్నారు.వ్యాపారిని భయభ్రాంతులకు గురిచేసేలా దుండగుల ముఠా ఒక్కసారిగా ఆయన ఇంటిపై కాల్పులు జరపడం ప్రారంభించింది. 

అయితే..  ఈ ముఠా కదలికలపై ముందే నిఘా ఉంచిన గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల వాహనాలను చూసిన గ్యాంగ్‌స్టర్లు లొంగిపోవడానికి బదులుగా, తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపై   కాల్పులు జరిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు గ్యాంగ్‌స్టర్లు అక్కడికక్కడే మరణించగా, మరో  గ్యాంగ్ స్టర్ తీవ్రంగా గాయపడ్డాడు.   ముగ్గురు పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.  

Gurugram encounter, gangsters killed, Deepak Nandal gang, police firing

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.