వాడేసి వదిలేశారు.. బోరుగడ్డ దుస్థితిపై జడ్జి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం..!
Publish Date:Aug 6, 2026
Advertisement
తాడేపల్లి ప్యాలెస్ ముందు, కాలిపోయే ఎండలో, రోడ్డు పక్కన ప్లాట్‌ఫారమ్‌పై కట్టుకున్న పెళ్లాన్ని పక్కన కూర్చోబెట్టుకుని, నాయకుల దర్శనం కోసం దేహి అని వేడుకుంటున్న ఆ దృశ్యం... ఏ ఒక్కరి గుండెనైనా పిండేసేలా ఉంది. నిన్నటిదాకా అధికార పార్టీ ప్రాపకం చూసుకుని విర్రవీగిన ఒక వ్యక్తి, ఈరోజు అదే నాయకుల ఇంటి ముందర నిలబడేందుకు నీడ కూడా లేక అల్లాడిపోతున్న తీరు రాజకీయాల్లోని క్రూరత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. బోరుగడ్డ అనిల్ కుమార్ ఉదంతంపై జడ్జి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పలు అంశాలపై టోన్ న్యూస్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నిన్నటివరకు పార్టీ కోసం, అగ్రనాయకుల మెప్పు కోసం ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించి, ప్రతిపక్ష నాయకుల కుటుంబాలను సైతం నీచంగా దూషించిన అనిల్... నేడు అదే పార్టీ నాయకుల కంటికి కనీసం మనిషిలా కూడా కనిపించకపోవడం రాజకీయాల్లో ఉన్న 'యూజ్ అండ్ త్రో' సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యం.వాడుకోవడం ముగిసింది... మురికి కాలవలే గతి..ప్రభుత్వం ఇచ్చిన విదేశీ విద్యా దీవెన స్కాలర్‌షిప్‌తో లండన్ వెళ్ళి ఎల్ఎల్ఎమ్ చదివిన ఒక విద్యావంతుడు, సమాజానికి, తన కమ్యూనిటీకి ఆదర్శంగా నిలబడాల్సింది పోయి, రాజకీయ నాయకుల పెంపుడు కూలీగా మారడం ఎంతటి విషాదం.. నాయకుల ఆజ్ఞల మేరకు ఆవేశంతో ఊగిపోతూ, కేసులు మెడకు చుట్టుకుని, ఆరు నెలల పాటు జైలు జీవితం గడిపి, వ్యాపారాలన్నీ కోల్పోయిన తర్వాత... అదే నాయకుడి తలుపు తడితే లభించిన సమాధానం.. "ఎవరు నువ్వు?"నాలుగున్నర గంటల పాటు తాడేపల్లి వీధిలో వేచి చూసినా కనీసం లోపలికి రానివ్వకుండా, "నువ్వెవరివి?" అని విసిరేసిన ఒకే ఒక్క ప్రశ్నతో అనిల్ జీవితంలోని భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. కష్టకాలంలో అండగా ఉంటారనుకున్న నాయకులు ముఖం చాటేయడమే కాకుండా, కనీసం పరిచయం లేనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న అసలు నైజం బయటపడింది.సామాజిక ఆవేదన – కుటుంబాల రోదనఈ ఉదంతం కేవలం ఒక్క బోరుగడ్డ అనిల్ సమస్య మాత్రమే కాదు. రాజకీయ నాయకుల అబద్ధపు మాటలు, తాత్కాలిక ప్రయోజనాలు నమ్మి తమ జీవితాలను, కుటుంబ గౌరవాన్ని పణంగా పెడుతున్న వేలాది మంది కార్యకర్తల భవిష్యత్తుకు ఇదొక హెచ్చరిక.కట్టుకున్న భార్యను నడిరోడ్డుపై ఎండలో కూర్చోబెట్టి, ఆత్మగౌరవాన్ని చంపుకుని అడుక్కునే దుస్థితికి రావడం కంటే ఒక కుటుంబానికి అంతకంటే పెద్ద అవమానం ఇంకేముంటుంది? అధికారంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి బూతులు తిట్టించిన నాయకులు, కేసులు పడి రోడ్డున పడ్డప్పుడు ముఖం చాటేయడం ఎంతోమంది సామాన్యుల జీవితాలను నాశనం చేస్తోంది. ఆత్మగౌరవమే అసలైన ఆయుధంనాయకుల మెప్పు కోసం సొంత జాతినీ, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే వారికి ఈ ఘటన ఒక కనువిప్పు కావాలి. అధికారంలో ఉన్నంత కాలం వాడుకుని, అవసరం తీరాక కరివేపాకులా తీసిపారేసే రాజకీయ వ్యాపారంలో నలిగిపోతున్నది సామాన్యులే. ఆత్మగౌరవాన్ని చంపుకుని ప్యాలెస్ గడపల ముందు కుక్కల్లా పేచీలు పడటం కంటే, స్వశక్తితో, నేరుగా కష్టపడి బతకడమే మిన్న అని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. ఇలాంటి అంశాలపై పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి. Borugadda Anil Kumar, Judge Ramakrishna comments, Tadepalli Palace Borugadda Anil, Sajjala Ramakrishna Reddy, Borugadda Anil, YSRCP Dalit politics, AP Political, CM Chandrababu, Naralokesh
http://www.teluguone.com/news/content/-borugadda-anil-kumar-36-228223.html





