యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధింపుకు లోక్‌సభ ఆమోదం..!

Publish Date:Aug 6, 2026

Advertisement

 

దేశంలో విస్తృతంగా ఉపయోగిస్తున్న యూపీఐ  డిజిటల్ లావాదేవీల వినియోగానికి సంబంధించి పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు విధించేందుకు వీలు కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కు సవరణలు చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ప్రత్యక్ష పన్నులు, సంబంధిత చట్టాల సవరణ బిల్లుకు దిగువ సభలో ఆమోదం లభించింది. ఈ చట్టసవరణ ద్వారా నిర్దిష్ట డిజిటల్ లావాదేవీల ఉచిత వినియోగ నిబంధనను తొలగించారు.

గతంలో ఉన్న చట్ట ప్రకారం డిజిటల్ లావాదేవీలపై ఎలాంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధన ఉండేది. తాజాగా తీసుకొచ్చిన మార్పుతో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ఎంపిక చేసిన డిజిటల్ పేమెంట్ విధానాలపై ఛార్జీలు విధిచేందుకు బ్యాంకులకు, చెల్లింపు సంస్థలకు వీలు కలుగుతుంది. డిజిటల్ చెల్లింపులకు అవసరమైన భారీ సాంకేతిక నిధులు, సైబర్ భద్రత ప్రాసెస్ నిర్వహణ వ్యయాన్ని భరించేందుకు ప్రాఫిట్ మోడల్ అవసరమని బ్యాంకింగ్ వర్గాలు, ఫిన్‌టెక్ రంగాలు చాలాకాలంగా కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మౌలిక వసతుల నిర్వహణ కోసం ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే సాధారణ పౌరులు రోజువారీగా జరిపే చిన్న చిన్న లావాదేవీలు లేదా ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు పంపే వ్యక్తగత (P2P) ట్రాన్సాక్షన్లపై తక్షణమే ఎటువంటి భారం పడదని తెలుస్తోంది. కేవలం పెద్ద వ్యాపార సంస్థలు, అధిక మొత్తంలో జరిగే నోటిఫైడ్ వ్యాపార లావాదేవీలకే ఇవి వర్తించే అవకాశముంది. ఈ పరిణామంపై ఆర్థిక నిపుణులు స్పందిస్తూ.. పేమెంట్ ఆపరేటర్లకు ఇది ఊరటనిచ్చే విషయమైనప్పటికీ, సాధారణ వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపు మళ్లకుండా ఉండేలా ప్రభుత్వ నిబంధనలుండాలని పేర్కొంటున్నారు. కేంద్రం నుంచి రాబోయే అధికారిక నోటిఫికేషన్ ద్వారానే ఏ రకమైన డిజిటల్ చెల్లింపులకు, ఎంత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తాయనే దానిపై పూర్తి స్పష్టత రానుంది.

UPI Charges, Lok Sabha Bill, MDR Charges Digital Payments, Payment and Settlement Systems Act, Indian Economy News Telugu
 

By
en-us Political News

  
మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు,  సోషల్ మీడియా యూజర్లు ఎవరైనా సరే ఈ వైరల్ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం, అప్‌లోడ్ చేయడం,  షేర్ చేయడం తక్షణమే ఆపాలని సురేఖ వాణి  పేర్కొన్నారు.
అమెరికాలో వైద్యులను సంప్రదించకుండా చాట్‌జీపీటీ సలహా మేరకు మూర్ఛ మందుల మోతాదును తగ్గించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోవెన్ వాన్ ఆకస్మిక మృతి చెందింది. ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు OpenAIపై వేసిన సంచలన దావా వివరాలు.
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వారిరువురూ బేగంపేటలో  ఐటీసీ కాకతీయ హోటల్‌లో సోమవారం (నవంబర్ 2)న కలిశారు.  ఈ సందర్భంగా వారు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న  సైబర్ సవాళ్ల ను వివరించారు. ప్రధానంగా ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, డీప్ ఫేక్, మార్ఫింగ్ ద్వారా సినీ ప్రముఖుల ఫొటోలు, వీడియోలను అసభ్యకరంగా, అనుచిత రీతిలో అభ్యంతరకరంగా సామాజిక మాధ్యమంలో ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా చిరంజీవి అమిత్ షాకు తెలిపారు.
భారతదేశానికి జంబుద్వీపం అనే పేరు ఎలా వచ్చింది? పూజల సంకల్పంలో జంబుద్వీపం అని ఎందుకు అంటారు? పురాణాలు మరియు చరిత్ర తెలిపే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి.
Before choosing a group health insurance plan, you should consider the eligibility criteria and check whether the insurer has a smooth claim processing. Let us explore what are the group health insurance benefits in more detail.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వనరులు, లావాదేవీలపై ఐటీ   ప్రత్యేక దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా పెద్ద మొత్తంలో జరిగిన నగదు లావాదేవీలకు సరైన లెక్కలు లేకపోవడం, పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలు ఉండటమే ఈ దాడులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అలాంటి అరుదైన, విలక్షణమైన వన్యప్రాణుల జాబితాలో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపానికి చెందిన  మ్యాక్రోసెఫాలోన్ మెలియో పక్షి  జాతి ఒకటి. సాధారణ పక్షుల వలె చెట్లపై గూళ్లు కట్టుకుని, గుడ్లను పొదిగే సంప్రదాయ పద్ధతికి ఇది పూర్తి భిన్నం. ఈ పక్షి జీవన శైలి  అడవి కోడిని పోలి ఉంటుంది.
ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణ రాడార్లు అందుబాటులోకి రాకముందే..   పూర్వీకులు చెట్లను, జంతువులను, కీటకాలను గమనించి రానున్న విపత్తులను అంచనా వేశారు. ఆ అంచనాలు దాదాపు కచ్చితంగా ఉండేవి. పర్యావరణంలో వచ్చే చిన్న చిన్న మార్పులను,  భూగర్భంలో జరిగే అలజడిని మనుషుల కంటే ముందుగా వృక్షజాలం పశుపక్ష్యాదులు పసిగడతాయని శాస్త్రీయ అధ్యయనాలుచెబుతున్నాయి.
ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావు జీవిత విశేషాలు, ఆయన అవలంబించిన వ్యాపార విధానాలు మరియు ఎదుర్కొన్న రాజకీయ సవాళ్లపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డి.ఎన్. ప్రసాద్  తెలుగువన్ ది జర్నలిస్ట్ మూడో  ఎపిసోడ్‌లో  తెలుగువన్ ఎండీ  రవిశంకర్ తో పంచుకున్నారు.  
ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు కుంటకు వెళ్లిన ముగ్గురు నీటిలో మునిగి దుర్మరణం చెందారు. ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
న్యూయార్క్ సమీపంలోని ఆల్బనీ ప్రాంతంలో  నివాసముంటున్న ఆమె అమెరికా కాల మానం ప్రకారం గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో ఖమ్మంలో ఉన్న తన తండ్రి నల్లమల్ల ఆనంద్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతుండగానే  గుండె నొప్పితో కుప్పకూలిపోయారు.
జామో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలంపూర్ గ్రామంలో ఉన్న ఒక బాణసంచా తయారీ యూనిట్లో  భారీ పేలుడు సంభవించింది.   శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు  
తెలంగాణలో కూడా వచ్చేమూడు రోజులూ పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాలు కురిసే సమయాల్లో పిడుగుపాటుకు అవకాశాలున్నందున విద్యుత్ స్తంభాలు, చెట్లకింద నిలబడవద్దని హెచ్చరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.