నీట్ కోచింగ్ కోసం వెళ్లిన విద్యార్థిని ఆత్మహత్య..!
Publish Date:Aug 6, 2026
Advertisement
ఉండలేకపోతున్నా అమ్మా అని ఫోన్ చేసి సూసైడ్..! చదువు కోసం ఇంటికి దూరంగా వెళ్లిన ఓ విద్యార్థిని.. తన మనసులోని బాధను తల్లిదండ్రులతో పంచుకుంది. కానీ ఆ సంభాషణ ముగిసిన కొద్దిసేపటికే ఊహించని విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ బేగంపేటకు చెందిన 19 ఏళ్ల కంతేటి వైష్ణవి, నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం మూడు వారాల క్రితం కానూరులోని శ్రీ భారతి ఇన్స్టిట్యూట్లో చేరింది. ఇటీవల ఇంటికి వెళ్లి వచ్చిన ఆమె.. రెండు రోజుల క్రితమే తిరిగి కోచింగ్ సెంటర్‌కు చేరుకుంది. కుటుంబానికి దూరంగా ఉండటం తనకు చాలా కష్టంగా ఉందని వైష్ణవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపింది. కూతురు భవిష్యత్తు కోసం ధైర్యంగా ఉండాలని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు ఆమెకు సూచించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత పరిస్థితులు విషాదకరంగా మారాయి. ఆరోగ్యం బాగోలేదని చెప్పి వైష్ణవి కోచింగ్‌కు వెళ్లకుండా హాస్టల్ గదిలోనే ఉంది. అనంతరం ఆమె హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించింది. హాస్టల్ సిబ్బంది సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువు కోసం పంపిన తమ కుమార్తె ఇక తిరిగి రాదనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వైష్ణవి మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి దూరంగా ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందా? లేక మరేదైనా వ్యక్తిగత లేదా ఇతర కారణాలు ఉన్నాయా? అనే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. NEET Student, NEET Coaching, NEET Aspirant, Vaishnavi, Kantaeti Vaishnavi, Student Death,
Student Found Dead, Hostel Incident, Coaching Centre, Kanuru, Hyderabad Student, Begumpet
http://www.teluguone.com/news/content/neet-student-36-228190.html





