ఆషాడం బోనాల జాతర షురూ.!

Publish Date:Jul 15, 2026

Advertisement

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు సజీవ ప్రతీకగా నిలిచే  ఆషాఢ బోనాల జాతర గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  పరిధిలో అత్యంత  ప్రారంభమైంది. గురువారం (జులై 16) భాగ్యనగరంలో ఈ వేడుకలకు ఘనంగా అంకురార్పణ చేసుకున్నాయి. మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే ఈ బోనాల ఉత్సవాల శుభ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు, భక్తులకు  శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల పండుగ   ఒక ఉత్సవం మాత్రమే కాదనీ, అది సమాజంలో విభిన్న వర్గాల మధ్య   ఐక్యతను, సహోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

బోనాల జాతర సందర్భంగా భక్తులకు  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఉత్సవాలను   సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  20 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి..  దేవాదాయ శాఖ పరిధిలోని 3 వేలకు పైగా ఆలయాల్లో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేలా అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు.

 ఆలయ ప్రాంగణాల్లో పారిశుధ్యం, నిరంతర తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా,   వైద్య సేవలు  వంటి కీలక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అలాగే  శాంతిభద్రతల పరిరక్షణ కోసం పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 

Ashada Bonalu Hyderabad, Revanth Reddy Bonalu Greetings, Greater Hyderabad Festivals, Bonalu Festival Budget, Telangana Culture

By
en-us Political News

  
ముద్రగడ పద్మనాభం మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకానికి ముగింపు పలికింది.
నువ్వు ముస్లిమేనా? అంటూ దుండగడు 15 కత్తి పోట్లు పొడిచాడు..
రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజకీయ పోరు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు కుటుంబం ఉదారత.. !
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.