ఆధ్యాత్మికత ఒక్కటే ఒత్తిడి తగ్గించే మంత్రం : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 16, 2026

Advertisement

 

అమరావతిలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. 

రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు మన దేవాలయాలని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. ఈ కారణంగా కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు, చిన్నారులపై అఘాయిత్యాల లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. అందరి జీవితాల్లో ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత చేకూరేందుకు ఆధ్యాత్మికతే మార్గమని ఆయన వివరించారు. 

 

 

అందుకే రాష్ట్రంలో 5 వేల శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అమరావతి రాజధానిలోని వెంకటపాలెం నుంచి ఆయన జగన్నాథుడి రథయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. పూరీ క్షేత్రంలో నిర్వహించే సంప్రదాయ క్రతువులను అనుసరిస్తూ జగన్నాథ, బలభద్ర, సుభద్రలతో కూడిన రథం ముందు సీఎం బంగారు చీపురుతో ఊడ్చి శుభ్రం చేసి స్వామివారి రథ యాత్రను తాడుతో లాగి ప్రారంభించారు. 

అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్ర పటాన్ని శిరస్సుపై ధరించి విశ్వ నగరిగా అమరావతి ఎదగాలని ముఖ్యమంత్రి జగన్నాథ స్వామిని కోరుకున్నారు. అంతకు ముందు అక్కడే ఏర్పాటు చేసిన రథయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని సీఎం ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఉమ్మడి కుటుంబాలు రావాలని మైక్రో ఫ్యామిలీలు కాదని సీఎం అన్నారు. 

 

 

పూరీ క్షేత్రంలో నిర్వహించే జగన్నాథ రథ యాత్రకు ఎంతో ప్రత్యేకత ఉందని.. అలాంటి రథ యాత్రను అమరావతిలో తొలిసారి నిర్వహించటంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ప్రతీ ఏటా జగన్నాథ రథ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇస్కాన్ సంస్థ ప్రకటించిందని అన్నారు. ఆధ్యాత్మికత, ప్రజా సేవలో ఇస్కాన్, అక్షయపాత్ర ఫౌండేషన్ లు పనిచేస్తున్నాయని తెలిపారు. 

 

 

దేశంలోని 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25 వేల పాఠశాలల్లో ఆహారం అందిస్తున్నాయన్నారు. ఏపీలోని 10 సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా 1.80 లక్షల మంది విద్యార్ధులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఆహారం అందిస్తోందన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడేందుకు ఇస్కాన్ లాంటి సంస్థలతో కలిసి పని చేస్తామన్నారు. జగన్నాథ రథ యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి.నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
 

By
en-us Political News

  
ముద్రగడ పద్మనాభం మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకానికి ముగింపు పలికింది.
నువ్వు ముస్లిమేనా? అంటూ దుండగడు 15 కత్తి పోట్లు పొడిచాడు..
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజకీయ పోరు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు కుటుంబం ఉదారత.. !
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.