జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అరవ శ్రీధర్ ఇటీవల తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.
ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ భేటీ అనంతరం వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా చేశారు. అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఆ కమిటీ అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిందా, ఒక వేళ పూర్తి చేస్తే.. పార్టీ హైకమాండ్ కు ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. అయితే.. అరవ శ్రీధర్ జనసేనానితో భేటీ అనంతరం విఫ్ పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఆమోదం పొందటం జరిగిపోయాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/--arava-sridhar--resignation-accepted-25-221524.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.