లోకేష్ సీఎం ఐతే నేను పాలిటిక్స్ నుండి తప్పుకుంటా: వైసిపి ఎమ్మెల్యే

 

 

ఏపీ మాజీ మంత్రి, టీడీపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతున్నపుడు కొన్ని సార్లు తడబడటం పై నెటిజన్లు, వైసిపి నాయకులు అయన పై విపరీతంగా సెటైర్లు వేయటం మనకు తెలిసిందే. తాజాగా తాటికొండ వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను పోటీ చేసిన  నియోజకవర్గంలోనే  గెలవలేని వ్యక్తి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీని ఎలా గెలిపిస్తాడని  ఆమె ప్రశ్నించారు. ఈరోజు  ఆమె మీడియాతో మాట్లాడుతూ, నారా లోకేశ్ కాబోయే సీఎం అంటూ టీడీపీ వర్గాలు చేస్తున్న ప్రచారం ఓ జోక్ అంటూ ఆమె కొట్టిపారేశారు. నారా లోకేశ్ కనుక ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని శ్రీదేవి సవాల్ విసిరారు. సరిగా మాట్లాడడమే రాని లోకేష్ ఏ విధంగా ముఖ్యమంత్రి కాగలడో టీడీపీ నేతలే చెప్పాలని ఆమె అన్నారు. ఇదే సందర్భంలో, హామీలు ఇవ్వడం, వాటిని గాలికొదిలేయడం చంద్రబాబు నైజం అని ఆమె ఆరోపించారు. కానీ, ప్రస్తుత సీఎం జగన్ అలా కాదని, ఓసారి మాట ఇస్తే మాట తప్పరని, మడమ తిప్పరని శ్రీదేవి పేర్కొన్నారు.