ఇంకా నియమించని గ్రామ వాలంటీర్లకు అప్పుడే జగన్ వార్నింగ్!!

 

 

ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తానని గత ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసిన జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి రాగానే ఆ దిశగా అడుగులు వేస్తూ గ్రామ వాలంటీర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఆ ప్రక్రియ అలా కొనసాగుతూ ఉండగా ఈ రోజు కడప జిల్లా జమ్ములమడుగు లో జరిగిన రైతు దినోత్సవ సభలో మాట్లాడుతూ  వచ్చే సెప్టెంబర్ 1 నుంచి గ్రామవాలంటీర్ల వ్యవస్థ అందుబాటులోకి రానుందని,  కులం, మతం, ప్రాంతం, వర్గాలు, రాజకీయాలకు ఆస్కారం లేకుండా గ్రామ వాలంటీర్లను నియమిస్తామని. వారు లబ్ధిదారుల ఇంటికే సరుకులు, పెన్షన్లు తీసుకొచ్చి అందజేస్తారని పేర్కొన్నారు. అందు కోసం వారికి నెలకు రూ.5వేలు ప్రభుత్వం జీతంగా ఇస్తుందని, గత ప్రభుత్వ హయం లో జన్మభూమి కమిటీల మాదిరి మాఫియా ఉండదని అయన తెలిపారు. పెన్షన్లు మంజూరు చేయాలన్నా, ఇవ్వాలన్నా లంచం అడగడం లాంటివి ఉండవు. ఒకవేళ ఎవరైనా గ్రామ వాలంటీర్లు లంచం అడిగితే వారిపై ఫిర్యాదు చేయడానికి సీఎం ఆఫీసు టెలిఫోన్ నెంబర్ ఇస్తామని. లంచం అడిగితే గ్రామ వాలంటీర్లను పీకి పడేస్తా అని సీఎం జగన్ పేర్కొన్నారు. అవినీతి అనే పదానికి తన ప్రభుత్వంలో తావు ఉండదని ప్రజలకు పూర్తీ భరోసా ఇచ్చేందుకు జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు దీనితో అర్ధమౌతోందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.