టీటీడీలో అన్యమతస్థులకు నో కొలువులు.. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు.. చంద్రబాబు

తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని ఆయన టీటీడీ అధికారులను ఆదేశించారు.  టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమ‌ల‌లో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమ‌ల‌పై టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.  

తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా ఉపేక్షించేది లేదని  సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. ముంతాజ్ హోటల్ కు ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఇలాంటి వాటికి వేరే చోట స్థలం కేటాయిస్తామన్నారు. తిరుమల ఆలయంలో కేవలం హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు. అన్య మతస్తులను తిరుమలలో కాకుండా ఇతర చోట్ల వారిని షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా ఇతర మత ప్రార్థనా స్థలాల్లో హిందువులు లేకుండా చూస్తామన్నారు.