నిజం దాచి గొప్పలు పోతున్న సీఎం జగన్

 

 

రాజకీయాలలో ఏ నాయకుడైనా మంచి పని చేసి దాని గురించి ప్రజలకు తెలిసేలా చేసి మళ్ళీ గెలిచే ప్రయత్నం చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విషయంలో చంద్రబాబు నాలుగు ఆకులు ఎక్కువే చదివారని ప్రత్యర్ధులు ఆరోపిస్తుంటారు. అలాగే తాను చేయని పనికి కూడా క్రెడిట్ కొట్టేసే నాయకులను మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు లాగే తన గొప్పలు చెప్పుకోవటానికి కొన్ని వాస్తవాలను దాచి మాట్లాడుతున్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిరోజునే ఫించన్లు రూ 2250  కు పెంచి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ పెంచిన పింఛన్లను ఈ రోజు నుండి ఇవ్వటం మొదలు పెట్టారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం అవ్వ తాతలని మీకు పింఛన్లు  వస్తున్నాయంటే రావటం లేదని చేప్పేవాళ్లు ఎక్కువ అని , కొద్ది మంది మాత్రమే మాకు రూ 1000 మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. కానీ నేను సీఎం అయిన మొదటి నెలలోనే దానిని రూ 2250 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నానని సీఎం చెప్పారు. కానీ వాస్తవాన్ని గమనిస్తే 2019 జనవరిలోనే చంద్రబాబు నాయుడు 1000 రూపాయాల పెన్షన్ ను రూ 2000 కి పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ఆ విషయాన్ని దాచిపెట్టి జగన్ తానే  డైరెక్ట్ గా 1000 నుండి 2250 కి పింఛను పెంచినట్లు చెప్ప్పుకుంటున్నారు. అలాగే 2014 ముందు 200 ఉన్న ఇదే పింఛన్ ను ఐదు రెట్లు పెంచి ఒకే సారి రూ 1000   చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇలాంటివి ఎవరు చెప్పిన చెప్పకపోయిన ప్రజలకి అన్ని గుర్తువుంటాయి. వేరే వాళ్ళ ఘనతలను నావే అని చెప్పుకుంటే నమ్మే పరిస్థుతులలో ప్రస్తుతం ప్రజలు లేరు.