పక్కలో పాముపెట్టుకుంటే ఎప్పటికైనా కరవక మానదు
posted on Mar 21, 2025 3:41PM
ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి నాలుుగు మూల స్థంభాలలో ఒకటైన న్యాయవ్యవస్థ మీద ప్రజల్లో అపార విశ్వాసం ఉంది. చట్టంలో అందరూ సమానమే. డబ్బు, అధికారం, ఇతర హోదా చూడదు అనే సందేశమిచ్చే న్యాయదేవత కళ్లకు గంతలు తొలగించి న్యాయదేవత గుడ్డిది కాదు అనే సంకేతంగా విగ్రహంలో ఇటీవల మార్పులు చేర్పులు చేశారు. పరులు సొమ్ము పాపిష్టి సొమ్ము అంటారు పెద్దలు. న్యాయమూర్తుల ఇళ్లలో పాపిష్టి సొమ్ము ఉండదు. కానీ లెక్కా పత్రం లేని నోట్ల కట్టలు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో పెద్ద ఎత్తున బయటపడ్డాయి. డిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో ఈ నోట్ల కట్టలు వెలుగు చూసాయి. న్యాయమూర్తి ఇంట్లో లేని సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు కాలి బూడిదయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు అగ్ని మాపక సిబ్బందికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం బయటకు పొక్కింది.పరద్రవ్యాణి లోష్ఠ వత్..అన్నారు. దారిలో రాయి పడి ఉంటే జేబులో వేసుకుంటామా? జడ్జిగారి నివాసంలో దొరికిన డబ్బు పరాయివారిదైనప్పుడు తన ఇంట్లో ఎందుకు దాచాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల వార్త తెలసి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వెంటనే స్పందించారు. ఆయన నేతృత్వంలోని కొలిజియం ఢిల్లీ కోర్టు న్యాయమూర్తిని వేరే చోటకు ( అలహాబాద్ ) కు బదిలీ చేసింది.
న్యాయమూర్తులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఒక విధానాన్ని రూపొందించింది. కంప్లయింట్ అందగానే ప్రధాన న్యాయమూర్తి కన్సల్ట్ న్యాయమూర్తిని క్లారిఫికేషన్ అడుగుతారు. ఒక వేళ సమాధానం సంతృప్తికరంగా లేకపోతే విచారణ కమిటీని ఏర్పాటు చేస్తారు.
మనది కర్మ భూమి. మనం మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది. పరుల సొమ్మును పాముగా భావిస్తారు. పక్కలో పాము పెట్టుకుంటే ఎప్పటికైనా కరవక మానదు.