కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంపు.. ట్రంప్ మరో సంచలనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అమెరికా ఫస్ట్ అంటూ వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచ దేశాలకు షాక్ లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా విదేశీ కార్ల దిగుమతిపై పాతిక శాతం సుంకం పెంచుతే నిర్ణయం తీసుకున్నరు. అమెరికాలో తయారు కాని అన్ని కార్లపై ఈ పాతిక శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు.

జఅయితే అమెరికాలో తయారైన కార్లపై మాత్రం ఎటువంటి సుంకం ఉండదు.  ఈ కొత్త దిగుమతి సుంకం ఏప్రిల్ 3 నుంచి అమలులోకి రానుంది.  దేశీయ పరిశ్రమను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా చెప్పారు.  అయితే ఈ తాజా సుంకం నిర్ణయం కారణంగా ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా, ఆటో మేకర్ సరఫరా చైన్ ను దెబ్బతీస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు.