మావోయిస్టులకు కోలుకోని దెబ్బ...బీజాపూర్ లో లొంగిపోయిన 50 మంది మావోలు
posted on Mar 30, 2025 7:23PM
చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్ పి జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు. సిఆర్ పిఎప్ అధికారుల ఎదుట లొంగిపోయారు. గత కొన్ని రోజులుగా బీజాపూర్ లో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చత్తీస్ గడ్ పోలీసులు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని చేపట్టారు. లొంగిపోయిన మావోయిస్టులకు పరిహారం ఇస్తామని ఆశచూపారు. ఆదివారం రోజే చెక్కులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామి ఇచ్చింది. మావోయిస్టులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.లింగిపోయిన వారిలో 10 మంది మహిళా మావోలున్నారు. లొంగిపోయిన 14 మంది తలలపై రూ 68 లక్షల రివార్డు ఉంది. తమ ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బతగిలినట్లయ్యింది.