యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‎కు తృటిలో  ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.  వివరాలిలా ఉన్నాయి.  

యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎనిమిదేళ్ల పాలనను పురస్కరించుకుని లక్నోలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు యోగి ఆదిత్యనాథ్ ఆగ్రా నుంచి ప్రత్యేక విమానంలో  బయలుదేశారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటిలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పైలెట్ వెంటనే విమానాన్ని ఆగ్రా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు.  ఆ తరువాత అధికారలు ఢిల్లీ నుంచి మరో విమానం రప్పించారు.  

విమానంలో సాంకేతిక లోపం కారణంగా లక్నోలో సీఎం యోగి పాల్గొనాల్సిన కార్యక్రమం రద్దు అయ్యింది. ఇలా ఉండగా యూపీ సీఎం యోగి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.   సాంకేతిక సమస్యకు కారణాలేమిటన్న దానిపై ఫ్లైట్ ఇంజినీర్లను ప్రశ్నించారు.