శ్రీ సత్యసాయి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మ హత్య 

పండుగ పూట  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం  చోటు చేసుకుంది. 
 ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు  ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి  గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.  పెద్ద కుమారుడు సంతోష్ పదో తరతి పరీక్షలు రాస్తున్నాడు. చిన్న కుమారుడు భువనేశ్ తొమ్మిదో తరగతి చువుతున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు