కడపలో వింత ఆచారం.. వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీగా ముస్లింల పూజలు 

మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో  పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి  దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. 
పురాణ ఇతిహాసాల ప్రకారం బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామిని పెళ్లి చేసుకున్నాడు. బీబీనాంచారమ్మ తమ ఇంటి ఆడపడుచు. శ్రీ వెంకటేశ్వరస్వామి తమ ఇంటి అల్లుడు. అని ముస్లింల నమ్మిక. తరతరాలుగా ఈ ఆచారం కొనసాగుతుంది.