హైకోర్టులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట
posted on Mar 27, 2025 10:29AM
.webp)
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది. ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.
కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ కేసు ఏపీ సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలుువడే వరకూ అంటే ఏప్రిల్ 3 వరకూ ఎంపీ మిథున్ నెడ్డిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దనీ, అరెస్టు చేయవద్దనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశాన్ని తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో లేవనెత్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో పోలస్తే డిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదన్న ఆయన ఈ విషయంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తునకు డిమాండ్ చేశారు.
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిధున్ రెడ్డిని పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఈ కుంభకోణంపై ఆరా తీశారు. హోంమంత్రితో భేటీ అనంతరం హుటాహుటిన అమరావతికి వచ్చిన ఎంపీ కృష్ణ దేవరాయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంబకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.