హైదరాబాద్ లో విషాదం ... లిప్ట్ లో ఇరుక్కుని నాలుగేళ్లబాలుడు మృతి

తెలంగాణలో వరుసగా లిప్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నాంపల్లిలోని ఓ అపార్ట్ మెంట్ లిప్ట్ గోడ మధ్యలో చిక్కుకుని  ఓ బాలుడు మృతి చెందాడు. జగిత్యాలలో సిరిసిల్లా 17వ బెటాలియన్  కమాండెంట్ గంగారాం (59)లిప్ట్ లో ఇరుక్కుని చనిపోయాడు. ఈ ఘటన జరిగిన రెండ్రోజులకే హైద్రాబాద్ అసిఫ్ నగర్ లో లిప్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ లిప్ట్ వైపు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి అందులో ఇరుక్కున్నాడు. పావు గంట సేపు లిప్ట్ మధ్యలో  ఇరుక్కున్న వాచ్ మెన్ కొడుకు సురేందర్ (4) రక్త స్రావంతో చనిపోయాడు.  నేపాల్ కు చెందిన శ్యామ్ బహదూర్  అసిఫ్ నగర్ సంతోష్ నగర్ కాలనీలోని ముజ్తాబా అపార్ట్ మెంట్ కు వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరయ్యింది.