యూట్యూబర్ సన్నీయాదవ్ పై కేసు 

బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
 బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నవారిపై తెలంగాణ పోలీసులు ఉక్కు పాదం మోపారు.   ఇందులో భాగంగా  సూర్యపేటకు చెందిన యూట్యూబర్ సన్నీ యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చని  తన యూట్యూబ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నసన్నీయాదవ్ పై కేసు నమోదైంది. ఒక ఎలక్ట్రానిక్ షాప్ లోకి వెళ్లి బైక్ రైడింగ్ కు సంబంధించి కెమెరాలను  సన్నీయాదవ్ కొనుగోలు  చేశాడు. బెట్టింగ్ యాప్ ల  ద్వారా సంపాదించిన సొమ్ముతోనే కెమెరెలాను కొనుగోలు చేసినట్టు సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన ఐపిఎస్ అధికారి సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని సూచించడంతో సూర్యపేట పోలీసులు కేసు నమోదు చేసి బన్నీ సన్నీయాదవ్ ను అరెస్ట్ చేయడానికి సిద్దమయ్యారు. 

 ⁠