దక్షిణాదిపై పగబట్టిన బీజేపీ.. రేవంత్

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీపగబట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరనుందని అన్నారు. తమకు అధికారం దక్కని దక్షిణాది రాష్ట్రాల పట్ల బీజేపీ కోపం పెంచుకుని వివక్ష చూపుతోందన్నారు. తమిళనాడు మంత్రి కేఎన్ నెహ్రూ, ఎంపీలు కనిమెళి, రాజాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం (మార్చి 13) సమావేశమయ్యారు. 

నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై ఈ నెల 22న డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ సమివేశానికి కావాల్సిందిగా రేవంత్ ను వారు ఆహ్వానించారు. డీ లిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లనుందన్న రేవంత్ రెడ్డి ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. డీమిలిటేషన్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించిన తమిళనాడు ముఖ్యంత్రి స్టాలిన్ ను ఈ సందర్భంగా రేవంత్ అభినందదించారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సంప్రపదించి చెన్నైలో ఈ నెల 22న స్టాలిన్ ఎర్పాటు చేసే సమావేశంలో పాల్గొంటానని రేవంత్ చెప్పారు.