చంద్రబాబుతో మాజీ మంత్రి నాగం భేటీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన నాగం జనార్ధన్ రెడ్డి  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజనకు ముందు తెలుగుదేశం పార్టీ కి దూరమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  చంద్రబాబు కేబినెట్ లో నాగం మంత్రిగా పని చేశారు.  తనను కలవడానికి వచ్చిన నాగం జనార్దన్ రెడ్డిని చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. బాగున్నారా నాగం గారూ అంటూ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.  

ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  ఓబులాపురం మైనింగ్ అంశంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై అప్పట్లో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.   ఆ కేసుల విచారణలో భాగంగా విజయ వాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు నాగం జనార్థన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. అలా వచ్చిన   జనార్థన్ రెడ్డి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.  

ఈ భేటీ సందర్భంగా ఇరువురు నేతల మధ్యా  ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చ జరిగింది. అప్పట్లో  నాగం ఫైర్ బ్రాండ్‌గా ఉండేవార చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా నాగం చంద్రబాబుతో  తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.