కారు దిగడానికి సిద్దమైన తలసాని ? 

బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే వారే సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందింది. హైదరాబాద్ లో గుర్తింపు ఉన్న నేతల్లో తలసాని ఒకరు. టిడిపి నుంచి బిఆర్ఎస్ లో జంప్ అయి ముఖ్య భూమిక వహించిన తలసాని  ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. పిసిసి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తలసానికి ఫోన్ చేసినట్లు పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఆపరేషన్ ఆక ర్ష్ లో భాగంగా బిఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు రంగం సిద్దం చేశారు. ఇప్పటికే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు కాంగ్రెస్ లో జంప్ అయ్యారు. గత వారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత తలసాని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్  మాత్రమే హైదరాబాద్ కు సంబంధించిన ఎమ్మెల్యేలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  తలసాని కూడా కాంగ్రెస్ లో చేరితే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి రేవంత్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతి పక్ష పార్టీల నుంచి అధికార పార్టీలో చేరే సాంప్రదాయాన్ని ప్రోత్సహించింది  మాత్రం కెసీఆర్ భాయంలోనే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా కెసీఆర్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక పద్దతి ప్రకారం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. రాజకీయ పునరేకీకరణ పేరిట కెసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్టు కెసీఆర్ ను దెబ్బకొట్టడానికి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ  ని బిఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీలో విలీనం చేసిన తరహాలోనే రేవంత్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు  రేవంత్తె రెడ్డికి టిడిపిలో  మంచి మిత్రుడైన  తలసాని   రేపో మాపో కారు దిగే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది.