జైలు దారిలో జగన్...!

జగన్ జైలు దారిలో వున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నారు. జగన్ నెల్లూరుకు హెలికాప్టర్లో వచ్చారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్తున్నారు. జగన్ నెల్లూరుకు హెలికాప్టర్లో వచ్చినప్పుడు హెలికాప్టర్ చుట్టూ కుర్రకారు చేరి సీఎం.. సీఎం.. అని అరిచారు. అదేవిధంగా, జగన్ రాకకోసం నెల్లూరు సెంట్రల్ జైల్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోపాటు మిగతా ఖైదీలు కూడా ఎదురుచూస్తున్నారు.