జగన్‌ది నోరా? చెత్తకుండీనా?

త్వరలో జైలుకు వెళ్ళబోతున్న జగన్, ప్రాక్టీసు కోసం అన్నట్టుగా నెల్లూరు సెంట్రల్ జైల్లో వున్న తన దండుపాళ్యం బ్యాచ్ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత బయటకి వచ్చి మీడియాతో మాట్లాడారు. జగన్ మాటలన్నీ విన్నాక అసలు జగన్‌ది నోరా, లేక చెత్తకుండీనా అనే సందేహం ఎవరికైనా సరే వచ్చి తీరుతుంది. నోరు తెరిచిన దగ్గర్నుంచి అబద్ధాలే అబద్ధాలు.. పచ్చి అబద్ధాలు.. నోటికొచ్చిన అబద్ధాలు. విన్నవాళ్ళు ఛీ అని ఊస్తారని కూడా సిగ్గుపడని అబద్ధాలు.. ఈ వీరుడు ముఖ్యమంత్రిగా వున్నంతకాలం రాష్ట్రం రామరాజ్యంలా వుందట.. ఈయన ముఖ్యమంత్రి పదవి ఊడిపోగానే రావణ కాష్టంలా మారిపోయింట. కేవలం వైసీపీకి ఓటు వేసినందుకే దాడులు చేస్తున్నారట. పిన్నెల్లికి సంబంధం లేకపోయినా అతని మీద హత్యాయత్నం కేసు పెట్టారట. ఎన్నికల సందర్భంగా అక్రమాలను చూసి భరించలేక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడట. ఇందులో రామకృష్ణారెడ్డి తప్పేమీ లేదని అర్థం చేసుకున్న కోర్టులు కూడా బెయిల్ ఇచ్చాయట. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శాంతిదూత పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారట. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, వైసీపీ వారిని హింసించడమే లక్ష్యంగా పెట్టుకుందట. చంద్రబాబు న్యాయంగా, ధర్మంగాపాలన చేయాలని ఈ సుద్దపూస సలహాల మీద సలహాలు ఇచ్చారు. ఇదే ధోరణి కొనసాగితే మర్యాదగా వుండదని చంద్రబాబుని హెచ్చరించారు. 

నిజంగా, ఈ జగన్‌ని అందరూ ‘సైకో’ అని ఎందుకు అంటారో నెల్లూరు జైలు దగ్గర జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే స్సష్టంగా అర్థమవుతోంది. మనిషి ముఖంలో ద్వేషం... క్రూరత్వం.. సిగ్గులేనితనం... తాను చెప్పిందే వేదం అనుకునే మూర్ఖత్వం.. దేనికైనా తెగించినతనం... నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా అడిగేది ఎవరనే ధీమా...  మైగాడ్.. ఇలాంటి మనిషిని ఐదేళ్ళు భరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హేట్సాఫ్. జగన్ తన ద్వేషమంతా మీడియా ముందు వెళ్ళగక్కి... తన మనసులో వున్న విషాన్నంతా మీడియా మైకుల ముందు వాంతి చేసుకుని చివర్లో ‘‘ప్రజలు అంటున్నారు’’ అని ఈ దరిద్రాన్నంతా ప్రజల అకౌంట్లో వేస్తున్నారు. జగన్ మైకుల ముందు ఈ దిక్కుమాలిన వాగుడు వాగుతూ వుంటే, ఆయన వెనుక, అటూ ఇటూ దేభ్యం ముఖాలతో, విలన్ వెనుక వుండే ‘‘ఎస్ బాస్’’ కేరెక్టర్ల టైపులో అంబటి రాంబాబు... అనిల్ కుమార్ యాదవ్.. మైకుల మీద జగన్ వాంతి చేసుకోవడం అయిపోయిన వెంటనే, మీడియావాళ్ళు ప్రశ్నిస్తుంటే, ఈ మహానటుడు విననట్టు యాక్టింగ్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగన్ సార్‌కి మీడియా ముందు నిల్చుని అడ్డమైన వాగుడు వాగడం తెలుసుగానీ, మీడియావాళ్ళు అడిగిన ఒక్క ప్రశ్నకి అయినా సమాధానం చెప్పే దమ్ము లేదు.. పైగా ఈ పిరికి నాయకుడికి మళ్ళీ ‘పులివెందుల పులి’ అనే సంబంధం లేదని భజన కార్యక్రమం..

మిస్టర్ జగన్.. జనం మీ అబద్ధాలను నమ్మే స్థితిలో లేరు. తమరు ఎంతైనా వాగండి.. అంతా వృధా. గతంలో తమరి మాటలను విని మోసపోయిన జనం ఐదేళ్ళపాటు నీలాంటి వాడిని ముఖ్యమంత్రిగా చేసినందుకు బాధపడుతూనే వున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. ఈ సైకోని ఎప్పుడు తరిమికొడదామా అని ఎదురు చూశారు. అందుకే మీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. ఇప్పటికైనా మారు.. ఇప్పటికైనా మనిషిలా ప్రవర్తించు.. అని మీకు చెప్పి ఉపయోగం లేదు.. ఎందుకంటే, మీలోగానీ, మీ దండుపాళ్యం బ్యాచ్‌లో గానీ ఎలాంటి మార్పు రాదు.. రాదు.. రాదు.! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకే ఒక్కదానికోసం ఎదురుచూస్తున్నారు.. అదే జగన్ జైలుకి వెళ్ళే శుభదినం కోసం.. ఈలోపుగా మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాగుడు కార్యక్రమాలు నిర్వహించుకోండి.