నటి జత్వాని వేధింపుల కేసులో ఐపిఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు
posted on Mar 12, 2025 6:50PM
ముంబై నటి కాదంబరీ జత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కోన్న ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడ గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ సస్పెన్షన్ ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది.
2025 సెప్టెంబరు 25 వరకూ వారి సస్పెన్షన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రివ్యూ కమిటీ సిఫార్సుల అనంతరం ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ అధికారులు ముగ్గురు అఖిలభారత సర్వీసు నిబంధనల్ని పూర్తిగా ఉల్లంఘించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వైకాపా హాయంలో ఈ ముగ్గురు ఐపిఎస్ అధికారుల చేసిన అరాచకాలు కూటమి ప్రభుత్వం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.