పోసాని లంచ్ మోషన్ పిటిషన్  కొట్టివేత

 సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి హైకోర్టులో చుక్కెదురైంది. గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ తో కర్నూలు జైలుకు రావడాన్ని పోసాని హైకోర్టులో సవాల్ చేశారు. బుధవారం( మార్చి 12)  నాడు పోసాని తన అడ్వకేట్ పొన్నవోలు చేత లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత కొట్టివేసింది. పోసాని అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.  కోర్టు నిర్ణయంతో పోసాని తీవ్ర నిరాశకు గురయ్యారు.