హైకోర్టులో పోసాని లంచ్ మోషన్ పిటిషన్
posted on Mar 12, 2025 2:45PM
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని గుంటూరు సిఐడి పోలీసులు కర్నూలుజైలులో అదుపులోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ లీగల్ వ్యవహారాల ఇన్ చార్జి పొన్నవోలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ లపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎపిలోని 17 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలో పోసానిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. తొలి రిమాండ్ రాజంపేట సబ్ జైలు కు తరలించారు. నరసారావుపేట పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. ఆదోని పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు. పోసానికి బెయిలు వచ్చినప్పటికీ గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ తో అడ్డుకున్నారు. దీంతో పోసాని తరపు న్యాయవాది అయిన పొన్నవోలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.