ఉత్తర కొరియాపై చైనా కోపం... మార్పు ఎందుకో..!

 

ఉత్తర కొరియాపై ఇప్పటికే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఇంకా ఇతర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. క్షిపణుల ప్రయోగాలను ఆపాలంటూ చెబుతున్నా ఉత్తర కొరియా మాత్రం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అయితే ఇన్నిరోజులు చైనాకు సపోర్ట్ గా ఉన్న ఉత్తర కొరియా తీరుపై చైనాకు కూడా విసుగొచ్చినట్టుంది. తాజాగా చైనా కూడా ఉత్తరకొరియాపై విమర్సలు చేసింది. వారానికోసారి క్షిపణి పరీక్షలు చేపడతామని, ఎవరైనా బెదిరిస్తే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి పేర్కొన్న నేపథ్యంలో చైనా ఈ విమర్శలు చేసింది. ఉత్తర కొరియా తాజాగా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి కార్యక్రమాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే.. ఉత్తర కొరియాపై విమర్శలు చేసిన చైనా అమెరికాను వెనకేసుకొచ్చింది. అణ్వాయుధ సమస్యను నివారించేందుకు సాధ్యమైనంతగా శాంతియుత మార్గాలను అన్వేషిస్తామన్న అమెరికా ప్రకటన సానుకూలమైనది, నిర్మాణాత్మకమైనది. ఇది సరైనదేనని మేం భావిస్తున్నాం. అందరూ దీనికి కట్టుబడి ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పింది. మరి చైనాలో ఇంత మార్పుకు కారణం ఏంటో..