Karthika Deepam2 : నాన్న గురించి గొప్పగా స్పీచ్ ఇచ్చిన శౌర్య!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -83 లో...స్కూల్ లో ఫాథర్స్ డే సెలెబ్రేషన్స్ కి శౌర్యని తీసుకొని దీప వస్తుంది. అమ్మ కార్తీక్ ని కూడా రమ్మని చెప్పానని శౌర్య అనగానే.. ఎందుకు రమ్మన్నావని దీప కోప్పడుతుంది. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఇకనుండి శౌర్య బాధ్యతలు నేనే తీసుకున్నాను కదా అందుకే వచ్చాను..‌ నువ్వు హ్యాపీగా లేవా నేను వస్తే అని జ్యోత్స్న అనగానే.. చాలా హ్యాపీగా ఉందని దీప అంటుంది.

మరొకవైపు నర్సింహా కూడా స్కూల్ కి వస్తాడు. ఈ రోజు ఫాథర్స్ డే కాబట్టి ఎలాగైనా శౌర్యకి నేనే నాన్న ని చెప్పాలి అనుకొని లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత దీప వాళ్ళకి కనిపించకుండా నరసింహా వెనకాలే కూర్చొని ఉంటాడు. కాసేపటికి కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న, నర్సింహాలని అక్కడ చూసి.. ఇక్కడ నన్ను చూస్తే జ్యోత్స్న తప్పుగా అర్ధం చేసుకుంటుంది.. వాడేమో ఇప్పుడు నన్ను చూస్తే గొడవ పడతాడని కార్తిక్ వెళ్లిపోతుంటే.. అప్పుడే శౌర్య స్పీచ్ ఇస్తుంటుంది. దాంతో కార్తీక్ చాటుగా శౌర్య స్పీచ్ వింటాడు. " నాకు నాన్న జోల పాడతాడు.. అన్నము తినిపిస్తాడు.. బుజ్జగిస్తాడు " అంటూ నాన్న గురించి శౌర్య గొప్పగా చెప్తుంది. శౌర్య ఏంటి ఇలా చెప్తుందని దీప అనుకుంటుంది. శౌర్యకి నాన్న ఎవరో తెలియదు కదా ఇలా మాట్లాడుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. ఏంటి ఇది ఇలా మాట్లాడుతుందని నర్సింహా అనుకుంటాడు. కార్తీక్ కి కూడా శౌర్య ఎందుకు అలా మాట్లాడుతుందో అర్థం కాదు.

ఇంత గొప్పగా నాన్న గురించి చెప్తున్నావ్.. ఇక్కడ మీ నాన్న ఉన్నారా అని ప్రిన్సిపల్ అడుగుతాడు. ఉన్నాడని శౌర్య అనగానే.. అందరు షాక్ అవుతారు. ఎవరిని తీసుకొని వస్తుంది ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడే శౌర్య దీప దగ్గరికి వచ్చి స్టేజ్ మీదకి తీసుకొని వెళ్తుంది. తనే మా నాన్న.. అన్నీ మా అమ్మే.. అన్ని పనులు చేస్తుందంటూ దీప గురించి శౌర్య గొప్పగా చెప్తుంది. ఇవన్నీ ఎవరు చెప్పారని దీప అనగానే.. కార్తీక్ అని శౌర్య చెప్తుంది. కార్తీక్ ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే స్టేజ్ పై కి రా అని శౌర్య పిలుస్తుంది కానీ కార్తీక్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీని సంగతి బయటకు వచ్చాక చూసుకుందామని నరసింహ అనుకుంటాడు. శౌర్య వల్లే బావ, దీప కలుస్తున్నారు. ముందు శౌర్యని బావకి దూరం చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.