వరల్డ్ కప్ ఫైనల్ కూడా 'కల్కి' స్పీడ్ కి బ్రేకులు వేయలేకపోయింది!

బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జూన్ 27న విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (Kalki 2898 AD Collections)

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.191.5 కోట్ల గ్రాస్ రాబట్టిన కల్కి.. రెండో రోజు రూ.107 కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది. ఇక మూడో రోజు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పటికీ రూ.116.5 కోట్ల గ్రాస్ తో జోరు చూపించింది. దీంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.415 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నాలుగో రోజు ఆదివారం కావడంతో మరో 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, కేవలం నాలుగు రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరే అవకాశముంది.

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు కీలక పాత్రలు పోషించారు.