తెలుగు సినిమాకి సిఎం రేవంత్ రెడ్డి ఆర్డర్.. చిరంజీవిలా చేస్తేనే  టికెట్స్ రేట్లు పెంచుతా 

ఇంతకు ముందు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇక నుంచి నేను చెప్పింది జరగాలి. అందరు మెగా స్టార్ చిరంజీవి గారిలా ఉండాల్సిందే. ఈ మాటలన్నీ తెలుగు సినిమా పరిశ్రమని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇంత సడన్ గా అలా ఎందుకు మాట్లాడుతున్నారో చూద్దాం.

సినిమాకి వెళ్ళాం.. షో స్టార్ట్ అయ్యే ముందు మద్యపానం ధూమపానం, పొగాకు నమలడం ఆరోగ్యానికి హానికరం అనే స్క్రోలింగ్ వస్తుంది. కొన్ని సార్లు యాడ్ రూపంలో కూడా ప్రదర్శితమవుతోంది. అది కూడా ధూమపానం, పొగాకు మీదే యాడ్ వస్తుంది. ఆల్కహాల్ గురించి రాదు. పెద్ద సినిమాల రిలీజ్ టైం లో అది కూడా ఉండటం లేదు. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చారు. దాని ప్రకారం మూవీ ప్రారంభం అయ్యే ముందు డ్రగ్స్, సైబర్ నేరాలు గురించి అవగాహన కలిగేలా ఒక వీడియోని ప్రదర్శించాలి. కనీసం మూడు నిమిషాలు పాటు అయినా ఆ వీడియో  ఉండాలి. మూవీ ప్రారంభానికి ముందు  కుదరకపోతే  కంప్లీట్ అయిన  తర్వాత  కూడా ప్రదర్శించవచ్చు. పైగా అందులో సదరు సినిమాలో చేసిన నటులే నటించాలి. చిన్న సినిమా అయినా,వందల కోట్ల బడ్జట్ తో నిర్మించిన సినిమా అయినా సరే ఆ రూల్ ని ఫాలో అవ్వాలి. 

అలాంటి  వాళ్ళకి  మాత్రమే రిలీజ్ రోజు టికెట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. రూల్ ని ఫాలో అవ్వని వాళ్ల  సినిమాలకి టికెట్లు పెంచే ప్రసక్తి లేదు. పైగా ఆ  నిర్మాత, డైరెక్టర్, నటీనటులకి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని సి ఎం రేవంత్  తేల్చి చెప్పారు. అలాగే వీడియోలు ప్రదర్శించే విషయంలో థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి.  డ్రగ్స్, సైబర్ నేరాలు పై ప్రసారం చెయ్యకపోతే  థియేటర్లకు అనుమతి ఉండదని కూడా చెప్పారు. ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో డ్రగ్స్, నేరాల్ని చూపించడం కామన్ అయిపోయింది. ఇంకో అడుగుముందుకేసి  హీరోలుగా కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అందుకే  రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇక డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో చిరంజీవి చాలా సార్లు ప్రజలని చైతన్య పరుస్తు వస్తున్నారు. అందుకే చిరులా  అందరు చెయ్యాల్సిందే రేవంత్ చెప్తున్నారు.