భారత్‌లో 933 పాజిటివ్ కేసులు..21 మంది మృతి!
posted on Mar 29, 2020 7:59AM
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. గత 24 గంటలలో 194 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 933కు చేరుకుంది. కరోనా వైరస్‌తో దేశంలో ఇప్పటివరకు 21 మంది మృతి చెందారు. .
కరోనా విజృంభిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా..తుమ్మినా... సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. గడిచిన 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయిన వారిని కలిసిన, తిరిగిన వారు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.
కరోనా చికిత్స కోసం డాక్టర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎయిమ్స్ ముందుకు వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొన్ని రైళ్లను ఆసుపత్రులుగా మార్చే అంశంపై కేంద్రం ఆలోచన చేస్తోంది.