లగచర్ల దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ పొడగింపు
posted on Nov 28, 2024 2:30PM
లగచర్ల దాడి కేసు దేశ వ్యాప్తంగా సంచలనమైంది. లగచర్ల కేసు లో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ ను కోర్టు పొడగించింది. నిన్నటితో పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ గడువు ముగిసిపోయింది. అయితే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు గురువారం కొడంగల్ కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతని రిమాండ్ ను డిసెంబర్ 11 వరకు పొడగిస్తూ జూనియర్ సివిల్ జడ్జీ ఉత్తర్వులను జారీ చేసారు.నవంబర్ 11న లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ పై రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్ పై లగచర్ల రైతులు, ప్రజలు దాడి చేసారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. పట్నం నరేందర్ రెడ్డిని ఎ 1 గా చేర్చారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కొడంగల్ మెజిస్ట్రేట్ లో హాజరు పరిచారు. దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు.