న్యూజిలాండ్ పార్లమెంట్ లో మహిళా ఎంపీ హాకా నృత్య ప్రదర్శన అదుర్స్
posted on Nov 28, 2024 6:34PM
రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ మహిళ కోపంతో అరుస్తూ కాగితాన్ని చించేసింది. ఆమె సూట్ వేసుకుని ఉంది. ఆమె న్యూజిలాండ్ కు చెందిన పార్ల మెంటు సభ్యురాలు. ఆమె పేరు హనా రావితి .న్యూజిలాండ్ పార్లమెంటు చరిత్రలో అతి పిన్న వయస్కురాలు. ఆమె అలా ఎందుకు అరుస్తుంది తెలుసుకునే ముందు.న్యూజిలాండ్ లో మావూరి గిరిజన తెగ గూర్చి తెలుసుకుందాం.
ఆమె న్యూజిలాండ్ మావూరి తెగకు ప్రాతినిద్యం వహిస్తున్నారు. 1320 కి పూర్వం న్యూజిలాండ్ లో ఎవరూ ఉండే వారు కాదు. అంటే ఆవాసిత ప్రాంతం కాదు. పోలినేషియా నుంచి ఆదివాసి తెగ అక్కడకు వచ్చేసింది.
కొద్ది కాలంలోనే ఆ తెగ న్యూజిలాండ్ విస్తరించింది. వారి జనసాంద్రత పెరగడంతో వారి సంస్కృతి విస్తరించింది. భాష, కళలు కూడా న్యూజిలాండ్ గడ్డపై పురుడు పోసుకున్నాయి. ప్రస్తుతం శ్వేత జాతీయులు 80 శాతం వరకు ఉన్నారు. మావూరి తెగ న్యూజిలాండ్ గడ్డపై అడుగు పెట్టినప్పటికీ కేవలం 20 శాతం జనాభాకే పరిమితమయ్యారు. న్యూజిలాండ్ లోకసభలో ఒక బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో స్పీకర్ ఆమె అభిప్రాయాన్ని అడిగినప్పుడు హాకా నృత్య ప్రదర్శన చేసింది. తన నిరసన వ్యక్తం చేసింది.14 నవంబర్ 2024లో జరిగిన సంఘటన ఇది. సంప్రదాయంగా వస్తున్న నృత్య ప్రదర్శన ఇది. కోపం, ఆనందం కలిగినప్పుడు వ్యక్తం చేసే నృత్యం అని చెప్పొచ్చు. అది వైరల్ అయ్యింది.