సిరిసిల్ల కలెక్టర్ పై కెటీఆర్ దురుసు ప్రవర్తన
posted on Nov 28, 2024 3:16PM
పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయి ఏడాది కావొస్తుంది. అయినా ఆ పార్టీకి అహంకారం ఏ మాత్రం తగ్గలేదు. తాను ప్రాతినిద్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనే కలెక్టర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాసి అని వ్యాఖ్యానించడం చూస్తుంటే తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉందా అన్న అనుమానం కలుగుతోంది బిఆర్ఎస్ నోరుపారేసుకోవడం పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం ఆక్షేపణ వ్యక్తం చేసింది. కెటీఆర్ పై కేసు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలని సంఘం భావిస్తుంది. ఒక ప్రజా ప్రతినిధి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి కంపల్సరీ. కాబట్టి కాంగ్రెస్ సర్కారు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో సూత్రధారి, పాత్రధారి రెండూ కెటీఆర్ అని నిర్ధారణ అయ్యింది. గవర్నర్ ఆమోదం తీసుకుని కెటీఆర్ ను అరెస్ట్ చేయాలని స్క్రిప్ట్ రెడీ అయినప్పటికీ యాక్షన్ మాత్రం స్టార్ట్ కాలేదు. తాజాగా సిరిసిల్ల కలెక్టర్ ను సన్నాసి అని, కాంగ్రెస్ కార్యకర్త అని బాహాటంగా విరుచుకుపడటం చూస్తుంటే కాంగ్రెస్ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నాయి. పదేళ్ళు అదికారంలో ఉన్నప్పుడు కలెక్టర్లు బిఆర్ఎస్ కార్యకర్తలుగా పని చేసారా? పచ్చకామెర్లు వచ్చిన వాడికి అందరూ పచ్చగా కనిపిస్తారు మరి. కెటీఆర్ ఇలా బరి తెగించడానికి కారణం కాంగ్రెస్ అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.