స్పెయిన్‌లో క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేస్తున్నారు!

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ తో వణికిపోతున్నాయి. స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 73,000 వేలకు చేరింది. క‌రోనా మరణాల్లో స్పెయిన్ సైతం చైనాను అధిగమించి, ప్రపంచంలోనే రెండో స్థానంలోనే నిలిచింది. ఇప్ప‌ట్టి వ‌ర‌కు అక్కడ మరో 800 మంది మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,938కి చేరింది. కొత్తగా మరో 8వేల మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో స్పెయిన్‌లో కోవిడ్-19 బాధితుల సంఖ్య 73,000 వేలకు చేరింది.

కరోనా మహమ్మారి కారణంగా అన్ని దేశాల్లో దాదాపుగా లాక్ డౌన్ అమ‌లులో వుంది. అయితే రోజు రోజుకే ప‌రిస్థితి చెయ్యిదాటిపోవ‌డంతో లాక్ డౌన్ చేయబడిన స్పెయిన్ లో పోలీస్‌లు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హైద‌రాబాద్‌లో బ‌ల్దియా అధికారులు కుక్క‌ల్ని ప‌ట్టుకుని వాహ‌నాల్లో త‌ర‌లించిన‌ట్లు స్పెయిన్‌లో లాక్‌డౌన్ సంద‌ర్భంగా రోడ్ల మీద క‌నిపిస్తే మ‌నుషుల్ని అలా త‌ర‌లిస్తున్నారు.

స్పెయిన్ రోడ్డు మీద క‌నిపించిన వారిని క‌నిపించిన‌ట్లుగా పోలీసులు త‌రిమివేస్తున్నారు. మేక‌ల్ని ప‌ట్టుకొని వాహ‌నాల్లో వేసిన‌ట్లు పోలీసు వాహ‌నాల్లో వేసి రోడ్ల మీద నుంచి త‌ర‌లించారు. మీడియా సాక్షిగా పోలీసులు రెచ్చిపోతున్నారు. కుటుంబ‌స‌మేతంగా రోడ్ల మీద‌కి వ‌చ్చిన వారి ప‌రిస్థితి దారుణంగా క‌నిపించింది. మ‌హిళ‌లు అరుస్తున్న పోలీసులు క‌ఠినంగా లాక్‌డౌన్ అమ‌లుచేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు స్పెయిన్ పోలీసులు. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.