ఓట్ అప్పీల్ పేరుతో‌ అర్జున్ కు చుక్కలు చూపించిన బిగ్ బాస్!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఫన్ గేమ్ అంటు రెండు బ్యాచ్ ల మధ్య చిచ్చుపెడుతున్నాడు బిగ్ బాస్. ఒక్కో టాస్క్ కి ఒక్కో గొడవ జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో రెండవ కంటెండర్ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు గాను ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో‌ హౌస్ లోని వారందరిని తోసుకొని వచ్చి గంట కొట్టి అర్హత సాధించాడు అర్జున్.

దీంతో తనని కన్ఫెషన్ రూమ్‌కి రమ్మన్నాడు బిగ్‌బాస్. తీరా వచ్చిన తర్వాత ఎదురుగా క్లాత్స్ కప్పేసిన రెండు ప్లేట్స్ ఉంచి, అందులో నీకు నచ్చినది ఎంచుకోమని బిగ్‌బాస్ కోరాడు. దీంతో ఒక క్లాత్ తీసి చూస్తే ఆ కప్పులో మూడు పచ్చి ఉల్లిపాయలు ఉన్నాయి. ఇదేంటి బిగ్‌బాస్ అని అర్జున్ అడుగగా.. ఓట్ అప్పీల్ చేసుకునేందుకు కంటెండర్ కావాలంటే ఆ మూడు పచ్చి ఉల్లిపాయలని పది నిమిషాల్లో తినాలని, లేకపోతే రెండో బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముంటే అది చేయాలనే కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక అది విని.. వద్దు బిగ్‌బాస్ ఇవే తినేస్తానని మొత్తానికి అర్జున్ ఎలాగోలా వాటిని తిన్నాడు. అయిన ఈ మధ్య ఫుడ్‌కి సంబంధించిన టాస్కులన్నీ మీకే వస్తున్నాయ్ ఎందుకని అనుకుంటున్నారు అర్జున్ అని బిగ్ బాస్ అడిగాడు. "చూడటానికి దున్నపోతులా ఉన్నాను కదా తింటానని మీ అభిప్రాయం బిగ్‌బాస్" అని అర్జున్ అన్నాడు. 

ఇక మరో మూసి ఉన్న క్లాత్ ని ఓపెన్ చేయమంటాడు. అందులో ఆరు ఉల్లిపాయలు‌ ఉంటాయి. వామ్మో అని దండం  పెడతాడు అర్జున్.  కాస్త స్వీట్ ఇప్పించండి బిగ్ బాస్ అని అర్జున్ అడుగగా.. స్వీట్ తినడానికి ఇష్టపడతారా? లేక  స్వీట్ లాంటి కేక్ పంపించమంటారా అని బిగ్ బాస్ అడుగుతాడు. అతిగా తింటే ఏదైనా దారుణమే బిగ్‌బాస్. నేను రెండు ఎంచుకోను అంటూ అర్జున్ సమాధానమిచ్చాడు. మొత్తానికి ఇచ్చిన టైమ్ లోపే టాస్క్ పూర్తి చేశాడు అర్జున్. దీంతో మీరు ఓట్ అప్పీల్ చేసుకునేందుకు ముందుకు వెళ్లారు.. కంగ్రాట్స్ అని బిగ్‌బాస్ అన్నాడు. వెళ్లేముందు పక్క బాక్స్‌లో ఏముందో చూడాలనుకుంటున్నారా అని బిగ్‌బాస్ అడగడంతో అవును అంటూ క్లాత్ తీశాడు అర్జున్. తీరా అందులో ఐదు ఉల్లిపాయలు చూసి వామ్మో అనుకున్నాడు అర్జున్. ఇక ఆ ఘాటుకి తట్టుకోలేక స్వీట్‌గా ఏమైనా ఇవ్వొచ్చుగా బిగ్‌బాస్.. అంటూ అర్జున్ అడిగాడు. కేకు పంపించమంటారా అని బిగ్ బాస్ అనగానే.. వామ్మో వద్దయ్యా.. ఇక్కడి నుంచి వెళ్లేవరకు ఇక స్వీట్ కూడా అడగను బిగ్‌బాస్ అంటూ దండం పెట్టేశాడు అర్జున్.