2014 లో బాలకృష్ణను సీఎం చేయాలి

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సీఎం అభ్యర్థిగా బాలకృష్ణను ప్రకటించాలని, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని టీడీపీ సీనియర్ నేత చెంగల వెంకట్రావు చెప్పారు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాల దారుణంగా ఉందని, ఇప్పటికే తెలంగాణాలో పార్టీ మొత్తం తుడిచి పెట్టుకు పోయిందన్నారు. చంద్రబాబు వైఖరి నచ్చకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోచేరుతున్నానని చెప్పారు. టిడిపిలో జరిగే అవమానాలు తట్టుకోలెకే తను బయటకు వచ్చేశానని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కులం కార్డును ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నారని, ఇపుడు బీసీ డిక్లరేషన్ పేరుతో తీర్మానం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అక్టోబరు 15వ తేదీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు.