బిజెపిలోనే ఉంటాను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.  తాను పార్టీ మారబోతున్నానంటూ సామాజిక  మాధ్యమంలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. బీజేపీలోనే ఉన్నాననీ, ఉంటాననీ పేర్కొన్న ఆయన   క్యాడర్ లో అయోమయం సృష్టించాలని కొందరు ఉద్దేశపూర్వకంగా ఇటువంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు.