ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ నుఎత్తివేయనుంది.  ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.  రాజాసింగ్ పై పార్టీ సస్పెన్షన్ ఎత్తివేతపై చర్చ జరగుతోందనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.  సస్పెన్షన్‌ ఉపసంహరణ సభలో తాను కూడా పాల్గొంటానని కిషన్ రెడ్డి అన్నారు.  గత ఏడాది ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రే పిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ హై కమాండ్ రాజాసింగ్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేసింది.