క్యాసినో నిర్వహించే ఆలోచన లేదు: చీకోటి ప్రవీణ్

ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు.   ఈడీ అధికారులు చీకోటి ప్రవీణ్ కుమార్ ను నిన్న దాదాపు ఏడు గంటల పాటు విచారించారు. ఈడీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన చీకోటి,  థాయ్‌లాండ్‌కు ఆటగాడిగానే వెళ్లాననీ, ఆర్గనైజర్ గా కాదని పేర్కొన్నారు.  తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నా  ఎప్పుడు పిలిచినా ఈడీ విచారణకు వెళతానని స్పష్టం చేశారు.