ఓటీటీలోకి యానిమల్.. ఎప్పుడు? ఎక్కడ?

ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన హిందీ సినిమా అంటే యానిమల్ అని చెప్పవచ్చు. దానికి ప్రధాన కారణం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నేడు(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి ఎక్కువ, స్లో నేరేషన్ వంటి మైనస్ లు ఉన్నప్పటికీ, సినిమా యాక్షన్ ప్రియులను మెప్పించేలా ఉందనే టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ అప్డేట్ ఆసక్తికరంగా మారింది.

యానిమల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టైటిల్ కార్డ్స్ లో అధికారికంగా తెలియజేశారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఓటీటీలో విడుదల చేసేలా మేకర్స్ నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం చేసుకున్నారట. అంటే జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో యానిమల్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక థియేటర్ వెర్షన్ తో పోలిస్తే ఓటీటీ వెర్షన్ నిడివి ఎక్కువగా ఉండనుందని అంటున్నారు. 3 గంటల 21 నిమిషాల నిడివితో థియేటర్లలో విడుదలైన యానిమల్, ఓటీటీకి వచ్చే సరికి డైరక్టర్'స్ కట్ పేరుతో 3 గంటల 49 నిమిషాల నిడివితో అందుబాటులోకి రానుందని టాక్.