ఈ లక్షణాలు కనిపిస్తే మీరు తప్పకుండా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాల్సిందే..!
ఈ లక్షణాలు కనిపిస్తే మీరు తప్పకుండా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవాల్సిందే..! మహిళల ఆరోగ్యం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులను, అనారోగ్య లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా పెద్ద ప్రమాదాల బారిన పడకుండా ముందుగానే అప్రమత్తం కావచ్చు. నేటి ఆధునిక బిజీ జీవితంలో చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వార సమస్యలను, క్యాన్సర్ వంటి తీవ్రమైన ముప్పులను ముందస్తుగా గుర్తించడంలో పాప్ స్మియర్ పరీక్ష చాలా ముఖ్యమైనది. అసలు ఈ పరీక్ష ఎందుకు అవసరం, ఏయే లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకూడదనే విషయాలను వివరంగా తెలుసుకుంటే.. 30ఏళ్లు నిండిన మహిళలు.. సాధారణంగా ముప్పై సంవత్సరాలు నిండిన ప్రతి మహిళా క్రమం తప్పకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. అయితే ఒకవేళ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ముప్పై ఏళ్ల వయసుతో సంబంధం లేకుండా అంతకంటే ముందే ఈ పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది. మహిళల్లో తెల్లబట్ట సమస్యతో పాటు రక్తం కారడం లేదా భిన్నమైన రంగులో స్రావాలు వెలువడడం వంటివి కనిపిస్తే దానిని తేలికగా తీసుకోకూడదు. అలాగే దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్ సమస్య ఉంటే అది ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు. శారీరక కలియిక తర్వాత కొద్దిగా రక్తం చుక్కలు పడడం లేదా కడుపులో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఇలాంటి లక్షణాలు గర్భాశయానికి సంబంధించిన సమస్యలను సూచించే అవకాశం ఉంది. చాలా మందిలో ఎప్పుడూ కడుపులో దిగువ భాగంలో లేదా పెల్విక్ ప్రాంతంలో దీర్ఘకాలికంగా నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన కడుపు నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మెనోపాజ్ దశ దాటిన తర్వాత ఒకవేళ మళ్ళీ రక్తస్రావం జరిగితే దానిని చాలా సీరియస్‌గా తీసుకోవాలి. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున వెంటనే గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లి పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ ప్రాధాన్యతగా భావించాలి. ఎలాంటి చిన్న లక్షణం కనిపించినా భయపడకుండా సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఏ సమస్యలనైనా మొదటి దశలోనే పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటిస్తూ, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని సకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. *రూపశ్రీ.
read moreరొమ్ములలో గడ్డలు లేకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా..నిజాలు తెలుసుకోండి..!
రొమ్ములలో గడ్డలు లేకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా..నిజాలు తెలుసుకోండి..! రొమ్ము క్యాన్సర్ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది రొమ్ములో ఏదైనా గడ్డ ఏర్పడటం. చాలామంది రొమ్ములో గడ్డ ఉంటేనే అది క్యాన్సర్ అని భావిస్తారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రొమ్ములో ఎలాంటి గడ్డ లేకపోయినా కొన్ని సందర్భాలలో క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది. ప్రాథమిక దశలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గడ్డ పస్తేనే రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. దీని గురించి ప్రతి మహిళ వివరంగా తెలుసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ గురించి మహిళలు తెలుసుకోవలసిన నిజాంలేంటో తెలుసుకుంటే.. ఇది కూడా చదవండి శీతాకాలంలో, గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: నిపుణుల సలహా రొమ్ములో ఎలాంటి గడ్డ లేకపోయినా క్యాన్సర్ వస్తుందా? రొమ్ములో ఎలాంటి గడ్డ లేకపోయినా రొమ్ము క్యాన్సర్ రావడం సాధ్యమేనా అనే ప్రశ్నకు వైద్యులు అవుననే సమాధానం ఇస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కొన్ని రకాల ప్రారంభ దశల్లో స్పష్టమైన గడ్డ ఏదీ తగలదు. కొన్నిసార్లు కణితి చాలా చిన్నదిగా ఉండటం వల్ల లేదా కణజాలం లోపల ఉండటం వల్ల అది చేతికి తగలదు. అయినప్పటికీ నిప్పల్ ఆకారంలో లేదా రొమ్ము ఉపరితలంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో సాధారణ స్క్రీనింగ్ లేదా మామోగ్రఫీ పరీక్షల ద్వారా మాత్రమే ఈ క్యాన్సర్ బయటపడుతుంది. అందువల్ల కేవలం గడ్డను మాత్రమే క్యాన్సర్‌కు ఏకైక లక్షణంగా పరిగణించడం సరైన పద్ధతి కాదు. రొమ్ము చర్మంలో గుంటలు లేదా చర్మం ముడతలు.. రొమ్ము చర్మంపై అకస్మాత్తుగా చిన్న గుంటలు, చర్మం లోపలికి లాగినట్లుగా ఉండటం లేదా కుంచించుకుపోయినట్లు కనిపిస్తే దానిని తేలికగా తీసుకోకూడదు. కొన్నిసార్లు క్యాన్సర్ కణాల ప్రభావం వల్ల లోపలి కణజాలంలో మార్పులు వచ్చి చర్మం లోపలికి లాగబడుతుంది. రొమ్ము చర్మం సరిగ్గా నారింజ పండు తొక్కలా మారడం కూడా ఒక రకమైన హెచ్చరిక సంకేతం కావచ్చు. ఇది కూడా చదవండి శీతాకాలంలో, గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: నిపుణుల సలహాలు నిప్పల్ లోపలి వైపునకు తిరిగిపోవడం.. సాధారణంగా ఉండే నిప్పల్ ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవడం లేదా ధూసుకుపోవడం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొంతమందిలో ఇది పుట్టుకతోనే ఉండవచ్చు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ లేదా అకస్మాత్తుగా ఇలాంటి మార్పు వస్తే అది క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. నిప్పల్ స్థానంలో లేదా దాని చుట్టూ వచ్చే ఇటువంటి మార్పులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. నిప్పల్ నుండి ద్రవాలు లేదా రక్తం కారడం.. నిప్పల్ ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయకపోయినా దానికదే ద్రవం వెలువడటం, ముఖ్యంగా అందులో రక్తం లేదా రక్తం లాంటి మరకలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అన్ని రకాల డిశ్చార్జ్‌లు క్యాన్సర్ కాకపోయినా, దీని వెనుక రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది. రొమ్ము చర్మం ఎర్రగా మారడం లేదా మందంగా తయారవడం.. రొమ్ము చర్మంపై ఎప్పుడూ ఎరుపుదనం, వాపు లేదా మందపాటి పొర ఏర్పడినట్లు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక రకాల క్యాన్సర్లలో రొమ్ము చర్మం ఎర్రగా, వెచ్చగా , ఉబ్బినట్లు మారుతుంది. దీనిలో కూడా ఎలాంటి గడ్డ స్పష్టంగా ఉన్నట్టు అనిపించదు. కేవలం చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ అనుకుని దీనిని నిర్లక్ష్యం చేయకూడదు. రొమ్ము పరిమాణంలో లేదా రూపంలో తేడాలు.. మహిళల్లో హార్మోన్ల మార్పులు, రుతుస్రావం లేదా గర్భధారణ సమయంలో స్వల్ప మార్పులు రావడం సాధారణం. కానీ ఒక రొమ్ము పరిమాణం అకస్మాత్తుగా వేగంగా మారుతుండటం, దానిలో అనూహ్యమైన వాపు రావడం లేదా రెండు రొమ్ముల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తే దానిని పరీక్షించుకోవాలి. ముఖ్యంగా ఈ మార్పులు చాలా కాలం పాటు అలానే ఉంటే లేదా దానితో పాటు నొప్పి ఉంటే వైద్య సలహా తప్పనిసరి. కొన్ని పరిశోధనల ప్రకారం, చాలామంది మహిళలు గడ్డ కాకుండా ఇతర లక్షణాల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తుంటారు. నిప్పల్ లో మార్పులు లేదా నొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు కొందరు డాక్టర్ వద్దకు వెళ్లడంలో ఆలస్యం చేస్తుంటారు. అందువల్ల మహిళలు అందరూ గడ్డలతో పాటు పైన పేర్కొన్న ఇతర సంకేతాల గురించి కూడా అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. రొమ్ములో ఎలాంటి అసాధారణ మార్పు కనిపించినా సొంతంగా ఎలాంటి అంచనాకు రాకుండా నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అందరికీ క్యాన్సర్ అని అర్థం కాదు, కొన్నిసార్లు సాధారణ ఇన్ఫెక్షన్లు లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. ఏదేమైనా ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స ద్వారా ఈ వ్యాధిని విజయవంతంగా ఎదుర్కోవచ్చు. మీకు నచ్చవచ్చు మహిళల వక్షోజాలను బిగుతుగా చేసే వ్యాయామాలు ఇవే..! *రూపశ్రీ
read moreశీతాకాలంలో, గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: నిపుణుల సలహాలు
చలికాలం వచ్చిందంటే చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. కానీ, వైద్య నిపుణుల హెచ్చరికల ప్రకారం ఈ శీతాకాలం గుండెకు సంబంధించిన ముప్పును గణనీయంగా పెంచుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు మన శరీరంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. చలిగాలుల ప్రభావం వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి, దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థపై అదనపు భారం పడుతుంది. రక్తం చిక్కబడే గుణం పెరగడం వల్ల రక్తం గడ్డకట్టే (Blood Clots) ప్రమాదం సాధారణ రోజుల కంటే ఎంతో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయపూట చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఉష్ణోగ్రత పడిపోవడం వల్ల శరీరంలోని హార్మోన్లు, ముఖ్యంగా స్ట్రెస్ హార్మోన్లు మరియు ఎడ్రినలిన్ స్థాయిలు వేగంగా మారుతాయి. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు ఒక్కసారిగా పెరిగి గుండెపై తీవ్రమైన ఒత్తిడికి దారితీస్తుంది. శీతాకాలంలో గుండెపోటు ముప్పు పెరగడానికి వాతావరణంలోని కాలుష్యం (Air Pollution), చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు శారీరక శ్రమ లేకపోవడం (Sedentary Lifestyle) వంటి అనేక అంశాలు తోడవుతాయి. మన దేశంలో, ముఖ్యంగా దక్షిణాసియా జాతి ప్రజలకు జన్యుపరంగానే గుండె జబ్బుల ముప్పు కొద్దిగా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కొద్దిపాటి రక్తనాళాల పూడికలు (Blockages) ఉన్నవారికి ఈ చలికాలపు వాతావరణ పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారుతాయి. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోవడం వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్ అందడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ కారణాల వల్లే శీతాకాలంలో ఉదయం వేళల్లో గుండెపోటు మరియు స్ట్రోక్ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం ఎంతో ముఖ్యం. చలికాలంలో ఉదయం పూట వాకింగ్ లేదా వ్యాయామాలు చేసేవారు నేరుగా చలిగాలికి గురికాకుండా తగినంతగా ఉన్ని బట్టలు ధరించాలి. అలాగే వ్యాయామానికి ముందు ఇంట్లోనే తగిన వార్మప్ (Warm up) వ్యాయామాలు చేయడం ద్వారా శరీరం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఆహారపు అలవాట్ల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు, ట్రాన్స్ ఫాట్స్ ఉండే పదార్థాలకు దూరంగా ఉంటూ, పూర్తిగా ఇంటివంటలకే ప్రాధాన్యత ఇవ్వడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, తగిన మోతాదులో ఆరోగ్యకరమైన పోషకాలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించవచ్చు. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో వచ్చే గుండె ముప్పును సమర్థవంతంగా అరికట్టవచ్చు. Winter Heart Attack Risks, Cold Weather Heart Health, Heart Attack Prevention Tips, Cardiovascular Care In Winter, Stay Heart Healthy Cold Season, Doctor Health Advice, Health Tips In Telugu.
read moreమహిళలలో అండాల విడుదల సక్రమంగా జరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి
మహిళలలో అండాల విడుదల సక్రమంగా జరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మహిళల ఆరోగ్యంలో సంతానోత్పత్తి వ్యవస్థ చాలా కీలకమైనది. నేటి ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం , హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలామంది మహిళల్లో అండాల విడుదల లేదా అండాశయం నుండి గుడ్డు సరిగ్గా విడుదల కాకపోవడమనే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే అండ్రోజెన్ లేదా అండాల విడుదల సమస్యలు అని అంటారు. గర్భధారణకు లేదా నెలసరి సక్రమంగా రావడానికి ప్రతి నెల అండం సరైన సమయానికి విడుదల కావడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ సహజంగా, సక్రమంగా జరగడానికి తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని రోజువారీ అలవాటుగా చేసుకుంటే హార్మోన్లు సమతుల్యంగా మారి, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మహిళల్లో అండాల విడుదల సక్రమంగా జరగడానికి సహాయపడే ముఖ్యమైన ఆహార పదార్థాలు , వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఆకుకూరలు , కూరగాయలు.. పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఫోలేట్ (విటమిన్ బి-9), ఐరన్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అండాశయాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, అండం నాణ్యతను పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. రోజువారీ భోజనంలో ఆకుకూరలను భాగం చేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది. పప్పుధాన్యాలు , శనగలు.. శాకాహారంలో ప్రోటీన్ లభించే పప్పులు, శనగలు, పెసలు , చిక్కుళ్ళు అండాల విడుదలకు చాలా మంచివి. జంతు సంబంధిత ప్రోటీన్ కంటే వృక్ష సంబంధిత ప్రోటీన్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచి హార్మోన్లను క్రమబద్ధీకరిస్తాయి. మొలకెత్తిన విత్తనాలు , గింజలు.. బాదం, వాల్నట్స్, గుమ్మడి విత్తనాలు, నువ్వులు , పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి అండాశయాలకు రక్తప్రసరణను పెంచి, హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా జరిగేలా చూస్తాయి. ముఖ్యంగా వాల్నట్స్ , గుమ్మడి విత్తనాలు అండం విడుదల కావడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. తాజా పండ్లు.. జామ, బత్తాయి, నారింజ, బెర్రీలు, వంటి పండ్లలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర కణాలను తగ్గించి, అండాల నాణ్యతను కాపాడుతాయి. దానిమ్మ పండు తినడం వల్ల గర్భాశయానికి రక్తప్రసరణ పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. తృణధాన్యాలు.. తెల్ల బియ్యం, మైదా వంటి రిఫైన్డ్ ఆహారాలకు దూరంగా ఉండి, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు , బ్రౌన్ రైస్, కొర్రలు, సమలు వంటి చిరు ధాన్యాలు తీసుకోవాలి. వీటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , ఫైబర్ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి అండాలు సరిగ్గా విడుదలవుతాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అవకాడో, ఆలివ్ నూనె , కొబ్బరి నూనె వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల హార్మోన్ల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. చేపలు.. మాంసాహారం తినేవారు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే శార్డైన్స్, సాల్మన్ వంటి చేపలను తీసుకోవచ్చు. ఇవి శరీరంలో మంటను లేదా వాపును తగ్గించి, అండాశయం పనితీరును మెరుగుపరుస్తాయి. తగినంత నీరు , ద్రవాహారం.. ఆహారంతో పాటు ప్రతిరోజూ తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కణాలకు పోషకాలు సరిగ్గా అందేలా చేస్తుంది. కొబ్బరినీళ్ళు, పల్చటి మజ్జిగ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తీసుకోకూడని ఆహారాలు.. అండాల విడుదల సక్రమంగా జరగాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కొన్నింటికి దూరంగా ఉండాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేపుళ్ళు, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు, మైదా, కూల్ డ్రింక్స్ , జంక్ ఫుడ్ తగ్గించాలి. అలాగే కెఫిన్ పానీయాలు అయిన టీ, కాఫీ పరిమితి దాటకుండా చూసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం.. మహిళలు తమ ఆహారంలో సహజమైన, తాజా పోషకాలు ఉండేలా చూసుకోవడం ద్వారా అండాల విడుదల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆహార అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం , ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల సంతానోత్పత్తి ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. *రూపశ్రీ.
read moreమహిళల వక్షోజాలను బిగుతుగా చేసే వ్యాయామాలు ఇవే..!
మహిళల వక్షోజాలను బిగుతుగా చేసే వ్యాయామాలు ఇవే..! స్త్రీల జీవితంలో వయస్సు పెరగడం, గర్భధారణ, తల్లిపాలు ఇవ్వడం, బరువులో వేగంగా మార్పులు రావడం వంటి అనేక కారణాల వల్ల ఛాతీ కండరాలు వదులుగా మారడం సహజం. అయితే క్రమశిక్షణతో కూడిన వ్యాయామాలు, సరైన జీవనశైలి ద్వారా ఛాతీ భాగంలోని కండరాలను బలంగా, బిగుతుగా మార్చుకోవడం ముమ్మాటికీ సాధ్యమే. ఇది కేవలం శారీరక రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, శరీర పట్టుత్వాన్ని కూడా పెంచుతుంది. మహిళల్లో వక్షోజాలను బిగుతుగా చేసే వ్యాయామాల గురించి తెలుసుకుంటే.. వక్షోజాల నిర్మాణం.. వక్షోజాలు కండరాలతో కాకుండా కొవ్వు, గ్రంథులతో నిర్మితమై ఉంటాయి. కానీ వాటి వెనుక ఉండే ఛాతీ కండరాలను పెక్టోరల్స్ అని అంటారు. ఈ లోపలి కండరాలను వ్యాయామాల ద్వారా దృఢంగా మార్చినప్పుడు, అవి ఛాతీకి మంచి సపోర్టును ఇస్తాయి. దీనివల్ల వక్షోజాలు పైకి లేచినట్లు, బిగుతుగా కనిపిస్తాయి. ఈ మార్పు కోసం ఇంట్లోనే సులభంగా చేయగలిగే కొన్ని ముఖ్యమైన వ్యాయామాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పుషప్స్.. పుషప్స్ అనేది ఛాతీ కండరాలను బిగుతుగా చేయడానికి అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. ఇది ఛాతీతో పాటు భుజాలు, చేతుల కండరాలకు కూడా మంచి శక్తిని ఇస్తుంది. మొదట నేలపై బోర్లా పడుకుని, చేతులను భుజాల వెడల్పులో నేలపై ఉంచాలి. కాళ్ళ వేళ్ళపై బరువు ఉంచి శరీరాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత నెమ్మదిగా శరీరాన్ని నేల వైపుకు వంచి, మళ్లీ పైకి లేవాలి. ప్రారంభంలో సాధారణ పుషప్స్ చేయడం కష్టంగా ఉంటే, మోకాళ్ళను నేలకు ఆనించి చేసే నీ పుషప్స్ లేదా గోడను ఆధారంగా చేసుకుని చేసే వాల్ పుషప్స్ తో ప్రారంభించవచ్చు. రోజుకు పది నుండి పన్నెండు సార్లు చొప్పున మూడు సెట్లు చేయడం మంచిది. చెట్ ప్రెస్.. చెట్ ప్రెస్ వ్యాయామం చేయడానికి చిన్న సైజు డంబెల్స్ లేదా వాటర్ బాటిల్స్ ఉపయోగించవచ్చు. వెల్లకిలా పడుకుని, రెండు చేతుల్లో డంబెల్స్ పట్టుకోవాలి. చేతులను మోచేతుల వద్ద మడిచి, ఛాతీకి ఇరువైపులా ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా చేతులను పైకి చాచి, కొద్దిసెకన్ల పాటు అలాగే ఉంచి, మళ్లీ పాత స్థితికి తీసుకురావాలి. ఈ క్రమంలో ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతున్నట్లు గమనించాలి. ఇది ఛాతీ కండరాల ఆకారాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఛెస్ ఫ్లై నేలపై లేదా బెంచ్ పై వెల్లకిలా పడుకుని ఈ వ్యాయామం చేయాలి. రెండు చేతుల్లో డంబెల్స్ పట్టుకుని, చేతులను పైకి చాచాలి. ఆ తర్వాత మోచేతులను కాస్త వంచి, రెండు చేతులను ఇరువైపులా పక్కలకు వెడల్పుగా తెరవాలి. చేతులు నేలకు తగలకుండా చూసుకుంటూ, మళ్లీ పాత స్థితికి తీసుకువచ్చి కలపాలి. ఈ వ్యాయామం వల్ల ఛాతీ కండరాలు సాగి, బిగుతుగా మారడానికి సహాయపడతాయి. ప్రాణాయామం , భుజంగాసనం.. యోగాసనాల్లో భుజంగాసనం ఛాతీ భాగాన్ని విస్తరించేందుకు బాగా ఉపయోగపడుతుంది. పొట్టపై పడుకుని, చేతులను ఛాతీకి ఇరువైపులా ఉంచి, నడుము పైభాగం వరకు పైకి లేపాలి. ఈ భంగిమలో ఛాతీ సాగి కండరాలు బలంగా మారతాయి. దీనితో పాటు ధనురాసనం, చక్ర ఆసనాలు కూడా ఛాతీ ప్రాంతంలో రక్తప్రసరణను పెంచి, కండరాలకు బిగుతును ఇస్తాయి. ప్లాంక్.. ప్లాంక్ వ్యాయామం శరీర బ్యాలెన్స్ ను పెంచడమే కాకుండా ఛాతీ, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుంది. మోచేతులు, కాళ్ళ వేళ్ళపై శరీరాన్ని నిటారుగా ఉంచి, వీలైనంత సమయం అదే భంగిమలో ఉండాలి. ఇది శరీరంలోని కండరాలన్నింటినీ ఒకేసారి క్రియాశీలకం చేస్తుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. వ్యాయామాలు చేసే సమయంలో సరైన స్పోర్ట్స్ బ్రా ధరించడం చాలా ముఖ్యం. ఇది వ్యాయామం చేస్తున్నప్పుడు వక్షోజాలు ఎక్కువగా కదలకుండా రక్షణ ఇస్తుంది. సరైన సపోర్ట్ లేకపోతే కండరాలు మరింత వదులుగా మారే ప్రమాదం ఉంది. వ్యాయామంతో పాటు పోషకాహారం కూడా చాలా ప్రధానమైనది. ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం సాగే గుణం పెరిగి, బిగుతుగా మారుతుంది. సరిపడా నీరు తాగడం వల్ల చర్మం తేమగా ఉండి ఆరోగ్యంగా కనిపిస్తుంది. రోజువారీ జీవితంలో సరిగ్గా కూర్చోవడం, నిలబడడం అలవాటు చేసుకోవాలి. వంగి కూర్చోవడం వల్ల ఛాతీ భాగం కిందకు వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. నడుము, భుజాలు నిటారుగా ఉంచి నడవడం , కూర్చోవడం వల్ల శారీరాకృతి మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా రోజుకు ఇరవై నుండి ముప్పై నిమిషాలు ఈ వ్యాయామాలు చేస్తూ, సరైన ఆహార నియమాలు పాటిస్తే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలను గమనించవచ్చు. *రూపశ్రీ.
read moreగర్భధారణలో ఉన్నప్పుడు మహిళల బిపి ఎంత ఉండాలి..ఎంత ఉంటే సేఫ్.!
గర్భధారణలో ఉన్నప్పుడు మహిళల బిపి ఎంత ఉండాలి..ఎంత ఉంటే సేఫ్.! గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైన, మధురమైన కాలం. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం ఎంత బాగుంటే, కడుపులో ఎదుగుతున్న బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే ప్రతి చిన్న మార్పునూ గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా రక్తపోటు అంటే బిపిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. బిపి పెరిగినా లేదా బాగా తగ్గిపోయినా తల్లికి, బిడ్డకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అసలు గర్భధారణ సమయంలో బిపి ఎంత ఉండాలి, బిపి ఏ స్థాయిలో ఉంటే సురక్షితం? గర్భం దాల్చాలనే ప్రతి మహిళ, గర్బంతో ఉన్న ప్రతి మహిళ తెలుసుకోవాలి. ఆ విషయాలేంటో తెలుసుకుంటే.. బిపి స్థాయి.. సాధారణంగా ఏ మనిషికైనా సరైన బిపి స్థాయి 120/80 గా ఉంటుంది. గర్భిణీలలో కూడా ఈ కొలత లేదా దీనికంటే కాస్త తక్కువగా ఉండటం సురక్షితమైనదిగా భావిస్తారు. సింపుల్ గా చెప్పాలంటే పైన ఉండే సంఖ్య 120, కింద ఉండే సంఖ్య 80 ఉంటే బిపి నార్మల్ గా ఉన్నట్లు లెక్క. పైన ఉండే సంఖ్య 110 నుంచి 120 మధ్య, కింద ఉండే సంఖ్య 70 నుంచి 80 మధ్య ఉంటే తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదు. బిడ్డకు రక్త ప్రసరణ , ఆక్సిజన్ సరఫరా చాలా చక్కగా జరుగుతాయి. అధిక బిపి.. ఒకవేళ రక్తపోటు 140/90 లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయితే దానిని అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. గర్భం దాల్చిన ఇరవై వారాల తర్వాత బిపి ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అధిక బిపి వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల మందగించడం, కాళ్ళు చేతులు వాపులు రావడం , ఉమ్మనీరు తగ్గడం వంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే కొందరిలో బిపి 90/60 కంటే తక్కువగా పడిపోవచ్చు. దీనివల్ల కళ్ళు తిరగడం, నీరసం , మూర్ఛ వచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా బిపి చెక్ చేయించుకోవడం చాలా అవసరం. గర్భవతులు బిపి కంట్రోల్ కోసం ఏం చేయాలి? గర్భధారణ సమయంలో బిపిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని పరిమితంగా ఉంచడం చాలా మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల బిపి హెచ్చుతగ్గులకు లోనుకాకుండా ఉంటుంది. వైద్యులు సూచించిన విధంగా రోజువారీ నడక లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయడం, శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల రక్తపోటును సేఫ్ స్థాయిలో ఉంచుకోవచ్చు. ఏ చిన్న తేడా అనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. *రూపశ్రీ.
read moreమీ మెదడు పవర్, 10 రెట్లు పెరగాలంటే. రోజూ ఇవి తినాల్సిందే!
మన శరీరాన్ని నియంత్రించే అత్యంత కీలకమైన అవయవం మెదడు. రోజంతా మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు, చివరకు మన భావోద్వేగాలు కూడా మెదడు ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటాయి. అయితే, నేటి ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల చాలామందిలో చిన్న వయసులోనే జ్ఞాపకశక్తి తగ్గడం, దృష్టి సారించలేకపోవడం, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ మన డైట్లో భాగం చేసుకోవడం ద్వారా మెదడు పనితీరును అద్భుతంగా మెరుగుపరచుకోవచ్చని ఆహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మెదడును చురుగ్గా ఉంచడంలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అత్యంత ప్రాధాన్యత వహిస్తాయి. ఇవి మెదడు కణాల నిర్మాణానికి, సమాచార మార్పిడికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా వాల్నట్స్, బాదం వంటి నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ (అవిస గింజలు), మరియు చేపలలో ఈ ఓమేగా 3 పుష్కలంగా లభిస్తుంది. ప్రతిరోజూ గుప్పెడు నట్స్ తినడం వల్ల మెదడులో రక్తం సరఫరా మెరుగై, ఆలోచనా శక్తి పెరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు లేదా ఆల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని ఇవి దాదాపు 20% నుండి 30% వరకు తగ్గిస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. అలాగే, నిత్యం మన వంటకాల్లో ఉపయోగించే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర, బ్రోకోలీ, తోటకూరల్లో ఫోలేట్, విటమిన్ K, అల్ఫా టోకోఫెరోల్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడులోని నాడీ వ్యవస్థను బలోపేతం చేసి, జ్ఞాపకశక్తి క్షీణించకుండా కాపాడుతాయి. నిపుణుల సర్వేల ప్రకారం, రోజూ ఒక కప్పు ఆకుకూరలు తినే వారి మెదడు వయస్సు, ఇతరులతో పోలిస్తే 11 సంవత్సరాలు చిన్నదిగా, చాలా చురుగ్గా ఉంటుందని తేలింది. దీనికి తోడు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీ పండ్లలో ఉండే ఆంటీఆక్సిడెంట్లు మరియు ఫ్లేవనాయిడ్లు మెదడులో వాపును తగ్గించి కణాల ఆయుష్షును పెంచుతాయి. వీటితో పాటు, మన నిత్య జీవితంలో డార్క్ చాక్లెట్, గ్రీన్ టీ మరియు గుడ్లు కూడా మెదడుకు గొప్ప శక్తినిస్తాయి. డార్క్ చాక్లెట్లో ఉండే ఫ్లేవనాల్స్ మెదడుకు రక్తప్రసరణను పెంచి, తక్షణ ఏకాగ్రతను అందిస్తాయి. గుడ్లలో లభించే కోలైన్ అనే పోషకం జ్ఞాపకశక్తికి బాధ్యత వహించే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రోజూ తగినంత నీరు తాగకపోతే మెదడు 2% డీహైడ్రేట్ అయినా దృష్టి లోపించడం, తలనొప్పి వంటివి వస్తాయి. కాబట్టి సరైన సమతుల్య ఆహారం, రోజూ 7 నుండి 8 గంటల నిద్ర, మరియు తగినంత సమయం వ్యాయామం తోడైతే మీ మెదడు ఎల్లప్పుడూ పదనుగా, పదునైన జ్ఞాపకశక్తితో పనిచేస్తుంది. Discover powerful brain boosting superfoods that naturally enhance memory, sharpen focus, and protect cognitive function. Uncover the key dietary secrets to a healthy, active mind.
read moreమహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తే ఆరోగ్యం నాశనమే..!
మహిళలు ఇలాంటి దుస్తులు ధరిస్తే ఆరోగ్యం నాశనమే..! మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే మంచి ఆహారం తినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మాత్రమే చాలని అనుకుంటారు. కానీ మహిళలు రోజూ ధరించే దుస్తులు కూడా మహిళల ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావం చూపుతాయి. ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. చాలామంది ఫ్యాషన్, ట్రెండ్స్ వెనుక పడి శరీరానికి ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామో గమనించరు. సరైన దుస్తులు ఎంచుకోకపోవడం వల్ల శరీరానికి తెలియకుండానే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహారం ఎంత ముఖ్యమో, మనం రోజూ వేసుకునే దుస్తులు కూడా అంతే ముఖ్యం. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని దుస్తుల ఎంపిక పొరపాట్లు , వాటి వల్ల కలిగే నష్టాల గురించి వివరంగా తెలుసుకుంటే.. బిగుతుగా ఉండే దుస్తులు.. నేటి కాలంలో చాలామంది శరీరాన్ని అతుక్కుని ఉండే విధంగా ఉండే బిగుతు దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. స్కిన్ టైట్ టీ-షర్టులు, టైట్ జీన్స్, బిగుతైన బెల్టులు , శరీరానికి గాయాలు లేదా గుర్తులు పడేలా ఉండే లోదుస్తులు వేసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. శరీరానికి బాగా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. నరాలు నొక్కివేసినట్టు అవుతాయి. దీనివలన శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. అంతేకాకుండా కణజాలాలకు అందాల్సిన ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ పరిమాణం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల కాళ్ళలో నొప్పులు, జీర్ణసంబంధమైన సమస్యలు, చర్మ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎప్పుడూ శరీరానికి గాలి ఆడేలా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ఎంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. సింథటిక్ వస్త్రాలు.. మార్కెట్లో లభించే అనేక దుస్తులలో సింథటిక్ ఫైబర్లు ఎక్కువగా వాడుతుంటారు. నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్, లైక్రా , రేయాన్ వంటివి సింథటిక్ దుస్తుల కిందకు వస్తాయి. ఈ సింథటిక్ ఫైబర్లను తయారు చేయడానికి పెట్రోలియం రసాయనాలను ఉపయోగిస్తారు. వీటితో చేసిన బట్టలను మనం రోజంతా వేసుకోవడం వల్ల, ఆ రసాయనాలు నెమ్మదిగా చర్మం ద్వారా శరీరంలోకి ఇంకిపోయే ప్రమాదం ఉంది. ఇవి చర్మానికి గాలి తగలకుండా చేసి చెమటను పట్టి ఉంచుతాయి, దానివల్ల చర్మ అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. వీటి స్థానంలో కాటన్, లినెన్, హెచ్ఎంపి , బాంబూ, , జనపనార వంటి సహజసిద్ధమైన పీచుతో చేసిన వస్త్రాలను ధరించడం చర్మానికి ఎంతో సురక్షితం. అండర్ వైర్ బ్రాలు.. మహిళలు ఉపయోగించే లో దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అండర్ వైర్ ఉండే బ్రాలను ఎక్కువగా వాడటం వల్ల రొమ్ము భాగంలో రక్తప్రసరణ తీవ్రంగా దెబ్బతింటుంది. అండర్ వైర్ లో ఉండే వైర్ల వల్ల ఒత్తిడి పెరిగి ఆ ప్రాంతంలో రక్తం గడ్డకట్టడం లేదా రక్తప్రసరణ నిలిచిపోవడం జరుగుతుంది. ఇది సుదీర్ఘ కాలంలో తీవ్ర అసౌకర్యానికి , ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మెటల్ లేదా ప్లాస్టిక్ వైర్లు లేని, సాధారణ కాటన్ మెటీరియల్‌తో చేసిన వైర్-ఫ్రీ బ్రాలను వాడటం వల్ల శరీరానికి సౌకర్యంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మహిళలు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.. మహిళలు ధరించే దుస్తులు కేవలం అందాన్ని పెంచడానికే కాకుండా, శరీరానికి హాయిని, ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలి. అనవసరమైన ట్రెండ్స్ వెనుక పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం కంటే, శరీరానికి సరిపడే సహజమైన, అనుకూలంగా ఉన్న దుస్తులను ఎంచుకోవడమే మంచిది. ఆరోగ్యకరమైన బట్టల వల్ల రోజంతా హుషారుగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. *రూపశ్రీ.
read moreజాగ్రత్త.. తలలో చుండ్రుతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్..!
జాగ్రత్త.. తలలో చుండ్రుతో పాటు ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్..! తలపై చుండ్రు ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా వర్షాకాలంలో చాలామంది చుండ్రు సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. చుండ్రు చాలా వరకు పొడి చర్మం ఉన్నవారికే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాతావరణ మార్పులు, తలపై అధిక నూనె, ఫంగస్ అధికంగా పెరగడం, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ సరైనవి వాడకపోవడం.. ఇలా చాలా రకాల సమస్యలు చుండ్రు రావడానికి కారణం అవుతూ ఉంటాయి. సాధారణంగా చుండ్రు తరచుగా తెల్లటి లేదా లేత పసుపు రంగు పొరలుగా కనిపిస్తుంది. లైట్ గా దురదను కలిగిస్తుంది. అయితే, ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే లేదా ఇతర తల చర్మ సమస్యలతో పాటుగా ఉంటే, అది మరొక చర్మ సమస్య కారణంగా అలా జరిగే అవకాశం ఉంటుంది. కొందరిలో తల చర్మ సమస్యలు ముఖం మీద, చెవుల చుట్టూ, లేదా శరీరంలోని ఇతర భాగాలపై కూడా కనిపిస్తూ ఉంటాయి. చుండ్రు తగ్గడానికి ఏదైనా వాడిన తర్వాత కూడా.. చుండ్రు మళ్లీ మళ్లీ వస్తుంటే.. అసలు చుండ్రు సమస్యకు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. చుండ్రుతో పాటు కొన్ని లక్షణాలు కనిపిస్తే అది చాలా డేంజర్ అని చెబుతారు. ఆ లక్షణాలేంటో తెలుసుకుంటే.. దురద ఎక్కువ ఉండటం.. చుండ్రుతో పాటు చాలామందికి లైట్ గా దురద ఉంటుంది. కానీ దురద తగ్గకుండా ఉంటే లేదా పదేపదే తల గోకవలసి వచ్చేంత తీవ్రంగా ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా గోకడం వల్ల తలపై చిన్న గాయాలు ఏర్పడి, చర్మపు చికాకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎరుపు లేదా వాపు.. చుండ్రుతో పాటు తల చర్మం ఎర్రబడటం, చికాకు లేదా వాపు వంటి లక్షణాలు ఉంటే, అది కేవలం సాధారణ చుండ్రు కాకపోవచ్చు. ముఖ్యంగా లక్షణాలు అలాగే కొనసాగితే.. డెర్మటాలజిస్ట్ ను కలవడం మంచిది. మందంగా, జిగటగా పొరలు రావడం.. కొన్నిసార్లు తలపై ఏర్పడే తెల్లటి లేదా పసుపు రంగు పొలుసులు మందంగా మారి చర్మానికి అంటుకుపోతాయి. వాటిని గోళ్లతో పదేపదే గీకడం మానుకోవాలి. ఈ పొలుసులు ఇలాగే ఏర్పడుతున్నా లేదా తలపై నొప్పి , చికాకు ఉంటే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. హెయిర్ ఫాల్.. చాలామంది చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని అనుకుంటారు. కానీ ఎప్పుడూ దురదగా ఉండటం, వాపు ఉండటం, తలను బలంగా గోకడం వంటివి జుట్టును ప్రభావితం చేస్తాయి. చుండ్రుతో పాటు అకస్మాత్తుగా లేదా సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలుతుంటే వైద్యుడి సంప్రదించాలి. ముఖం లేదా చెవులకు.. తలతో పాటు కనుబొమ్మల మీద, చెవుల చుట్టూ, ముక్కు పక్కన, లేదా ముఖం మీద కూడా ఎర్రదనం , పొలుసులు రాలడం కనిపిస్తే, అది వేరొక చర్మ సమస్యకు సంకేతం కావచ్చని అంటున్నారు. ఇలాంటప్పుడు సొంతంగా క్రీములు లేదా మందులు వాడటం కాకుండా చర్మ సంబంధ నిపుణులను సంప్రదించి మందులు వాడాలి. *రూపశ్రీ.
read moreమహిళల గర్భాశయ ఆరోగ్యం బాగుండాలి అంటే తినకూడని ఆహారాలు ఏమిటి.!
మహిళల గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత బాగుండటానికి పోషకాహారం ఎంత ముఖ్యమో, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తప్పుడు ఆహార అలవాట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్, ఈస్ట్రోజెన్ అసమతుల్యత , గర్భాశయ సమస్యలకు దారితీస్తాయి. గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగ్గించాల్సిన లేదా పూర్తిగా దూరంగా ఉండాల్సిన ముఖ్యమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ సమతుల్యంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. మహిళల గర్భాశయ ఆరోగ్యం కోసం తినకూడని ఆహారాలు ఏమిటో తెలుసుకుంటే.. రిఫైండ్ షుగర్, ఫ్లోర్.. అధికంగా శుద్ధి చేసిన చక్కెరలు మరియు పిండి పదార్థాలు మైదా, వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, బిస్కెట్లు , తీపి పదార్థాలలో శుద్ధి చేసిన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే.. పిసిఓడి/పిసిఓఎస్ వంటి సమస్యలు తీవ్రమవుతాయి. గర్భాశయంలో మంటను పెంచడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్యాకింగ్, ప్రాసెస్ ఫుడ్స్.. ప్యాక్ చేసిన , ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రాసెస్ చేసిన చిరుతిళ్ళు, రెడీ టు ఈట్ ఈటింగ్ ప్యాకెట్లు , జంక్ ఫుడ్‌లలో కృత్రిమ రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు , ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా, హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. ఈ రసాయనాలు గర్భాశయ కణజాలంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. రెడ్ మీట్.. అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం మేక, గొర్రె , పంది మాంసం వంటి రెడ్ మీట్‌ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల శరీరంలో ఆరాకిడోనిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది గర్భాశయంలో మంటను ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా రెడ్ మీట్ తినే మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కెఫీన్, కూల్ డ్రింక్స్. కెఫిన్ , శీతల పానీయాలు కాఫీ, టీ , ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ అధికంగా ఉంటుంది. అలాగే సోడాలు, శీతల పానీయాలలో కృత్రిమ చక్కెరలు ఎక్కువ. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. ఇది పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి , అసమతుల్యతకు కారణమవుతుంది. ధూమపానం, మద్యపానం.. ఆల్కహాల్ , ధూమపానం, మద్యపానం కాలేయం యొక్క పనితీరును దెబ్బతీస్తుంది. కాలేయం శరీరంలోని అదనపు హార్మోన్లను బయటకు పంపే పని చేస్తుంది. ఆల్కహాల్ వల్ల ఈ ప్రక్రియ మందగించి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగిపోతాయి. ఇది గర్భాశయ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎక్కువ నూనె, వేయించిన ఆహారాలు.. అధిక నూనె , వేయించిన ఆహారాలు , మళ్ళీ మళ్ళీ కాచిన నూనెల్లో వేయించిన బజ్జీలు, సమోసాలు, ఫాస్ట్ ఫుడ్ వంటివి శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరగడానికి కారణమవుతాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి, గర్భాశయ కణజాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కృత్రిమ తీపి పదార్థాలు.. ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ కు నేటి కాలంలో చాలా డిమాండ్ పెరిగింది. వీటిని తీసుకోవడం వల్ల మధుమేహం రాదని చెబుతారు. డైట్ సోడాలు లేదా చక్కెర లేని ఉత్పత్తులలో ఉపయోగించే కృత్రిమ తీపి పదార్థాలు పేగులలోని మంచి బాక్టీరియాను దెబ్బతీస్తాయి. పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే హార్మోన్ల నియంత్రణ కూడా దెబ్బతింటుంది. గర్భాశయ ఆరోగ్యం కోసం ఏం తినాలి? గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం శ్రేయస్కరం. అయితే గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడు కేవలం ఆహారంతో గర్భాశయ ఆరోగ్యాన్ని కాపాడాలని అనుకోవడం సరికాదు. వైద్యులను సంప్రదించడం మంచిది. *రూపశ్రీ.
read moreపిరుదుల భాగంలో కొవ్వు పెరిగిందా..తగ్గించడానికి ప్రభావవంతమైన వ్యాయామాలు ఇవే..!
పిరుదుల భాగంలో కొవ్వు పేరుకుపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రోజూ గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేయడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం వల్ల ఈ భాగంలో కొవ్వు సులభంగా పెరుగుతుంది. దీనివల్ల శరీర ఆకృతి దెబ్బతినడమే కాకుండా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం ద్వారా ఈ కొవ్వును కరిగించి, పిరుదులను దృఢంగా, మంచి ఆకృతిలోకి తీసుకురావచ్చు. ఆ వ్యాయామాలు ఏమిటో.. వాటిని ఎలా చేయాలో తెలుసుకుంటే.. స్క్వాట్స్ పిరుదుల కొవ్వును తగ్గించడానికి , అక్కడి కండరాలను దృఢపరచడానికి స్క్వాట్స్ అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం. ఈ వ్యాయామం చేయడానికి ముందుగా నిటారుగా నిలబడాలి. కాళ్ళను భుజాల వెడల్పులో ఉంచాలి. ఆ తర్వాత కుర్చీలో కూర్చుంటున్నట్లుగా నెమ్మదిగా కిందకు వంగాలి. ఈ సమయంలో మోకాళ్ళు కాళ్ళ వేళ్ళ కంటే ముందుకు వెళ్ళకూడదు. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండి, ఆ తర్వాత పాత స్థితికి రావాలి. దీనిని రోజూ 15 నుండి 20 సార్లు మూడు సెట్లుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. లంజెస్ ఈ వ్యాయామం పిరుదుల భాగంలోని కండరాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. మొదట నిటారుగా నిలబడి, ఒక కాలును ముందుకు వేయాలి. ముందుకి వేసిన కాలు మోకాలు వద్ద తొంబై డిగ్రీల కోణంలో వంగేలా శరీరాన్ని కిందకు దించాలి. వెనుక ఉన్న కాలు నేలకు కాస్త ఎత్తులో ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి వచ్చి, మరొక కాలుతో కూడా ఇదే విధంగా చేయాలి. ఇది పిరుదుల కొవ్వును కరిగించడమే కాకుండా కాళ్ళకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది. గ్లూట్ బ్రిడ్జ్.. నేలపై పడుకుని చేసే ఈ వ్యాయామం పిరుదుల కొవ్వును తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. మొదట వెల్లకిలా పడుకుని మోకాళ్ళను మడవాలి. పాదాలను నేలకు ఆనించి ఉంచాలి. చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. ఇప్పుడు పిరుదులు, నడుము భాగాలను పైకి లేపాలి. శరీరం మోకాళ్ళ నుండి భుజాల వరకు ఒకే వరుసలో ఉండేలా చూసుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండి, ఆ తర్వాత నెమ్మదిగా కిందకు రావాలి. దీనివల్ల పిరుదుల వద్ద ఉండే కండరాలు బలంగా మారతాయి. డాంకీ కిక్స్.. డాంకీ కిక్స్ చేయడానికి మొదట చేతులు, మోకాళ్ళను నేలపై ఆనించి నాలుగు కాళ్ళ జంతువులాగా నిలబడాలి. ఇప్పుడు ఒక కాలును మోకాలు వద్ద మడిచి ఉంచి, వెనుక వైపు పైకి లేపాలి. కాలు పిరుదుల కంటే కాస్త పైకి వెళ్ళేలా చూసుకోవాలి. కొన్ని సెకన్లు అలానే ఉంచి, తర్వాత కాలును కిందకు తీసుకురావాలి. ఇలా రెండు కాళ్ళతో మార్చి మార్చి చేయాలి. ఇది పిరుదుల రూపాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది. స్టెప్ అప్స్.. ఇంటి వద్ద ఉండే మెట్లు లేదా ఒక చిన్న స్టూల్ సహాయంతో ఈ వ్యాయామం చేయవచ్చు. ముందుగా స్టూల్ ముందుకు నిలబడాలి. ఒక కాలును స్టూల్ పై ఉంచి, దానిపై బరువు వేస్తూ శరీరాన్ని పైకి లేపాలి. ఆ తర్వాత రెండవ కాలును కూడా పైకి తీసుకురావాలి. మళ్ళీ నెమ్మదిగాకిందకు దిగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల తొడలు , పిరుదుల భాగంలో ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. పైన పేర్కొన్న వ్యాయామాలతో పాటు ప్రతిరోజూ తగినంత నీరు తాగడం, నూనె పదార్థాలు తగ్గించడం , సమతులాహారం తీసుకోవడం వల్ల వేగంగా ఫలితాలను పొందవచ్చు. అంతే కాదు.. పిరుదుల భాగంలో కొవ్వు తగ్గాలి అంటే.. ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడాన్ని వీలైనంత తగ్గించాలి. ఒకవేళ కూర్చుని పని చేయాల్సిన అవసరం ఉన్నా.. అరగంట ఒకసారి అయినా లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి. ఇలా చేస్తే పిరుదుల కొవ్వు క్రమంగా తగ్గుతుంది. *రూపశ్రీ.
read moreప్రసవం కోసం హాస్పిటల్ ను ఎంచుకునే ముందు ఈ విషయాలు తప్పక అడిగి తెలుసుకోవాలి..!
ప్రతి స్త్రీకి గర్భధారణ అనేది ఒక కీలకమైన సమయం. ప్రసవం అనేదిస్త్రీ కి మరో జన్మ లాంటిదని చెబుతారు. కానీ గర్బం మోయడం ఒక ఎత్తైతే.. ప్రసవం మరొక ఎత్తు. అందువల్ల ప్రసవం కోసం సరైన ఆసుపత్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రసవానికి ఏ ఆసుపత్రి మేలు అనే విషయం తెలుసుకోవడానికి చాలామంది కేవలం ఆసుపత్రి ఉన్న ప్రదేశాన్ని లేదా పేరును మాత్రమే చూస్తారు. గైనకాలజిస్టుల ప్రకారం, ప్రసవ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా , తల్లి, బిడ్డ ఇద్దరికీ సరైన సంరక్షణ అందేలా చూసుకోవడానికి, ప్రతి ఒక్కరూ ఆసుపత్రిని ఎంచుకునే ముందు ఏడు విషయాలు తప్పక తెలుసుకోవాలట. అవేంటో తెలుసుకుంటే.. మొట్టమొదటి చాలా ముఖ్యమైన విషయం.. ఆసుపత్రిలో 24 గంటలూ గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్నారా లేదా అని తెలుసుకోవాలి. ప్రసవం అనేది ఏ సమయానికి జరుగుతుందో చెప్పలేం.. డెలివరీ పెయిన్స్ అనేవి ఏ సమయంలోనైనా ప్రారంభం కావచ్చు. అందువల్ల డాక్టర్ కేవలం కొన్ని గంటలు మాత్రమే అందుబాటులో ఉంటే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి, రాత్రిపూట లేదా సెలవు దినాల్లో కూడా ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్ అందుబాటులో ఉంటారా లేదా అని తప్పకుండా తెలుసుకోవాలి. ధరల తేడా.. సాధారణ ప్రసవానికి, సి-సెక్షన్ ప్రసవాలకు ధరలు ఎలా ఉంటాయి? ఎంత సమయం పడుతుంది అనేది తప్పకుండా తెలుసుకోవాలి. ఈ రెండింటికి వాటి ప్రత్యేకమైన విధానాలు , వేర్వేరు సమయాలు ఉంటాయి. ప్రతి ప్రసవానికి ఎంత సమయం పడుతుందో ఆసుపత్రి నుండి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం, దీనివల్ల కుటుంబ సభ్యులు పూర్తి సమాచారంతో మానసికంగా సిద్ధంగా ఉండగలగడం జరుగుతుంది. మూడవ విషయం.. ఆర్థిక విషయాలకు సంబంధించింది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఆసుపత్రి వేర్వేరు డెలివరీ ప్యాకేజీలను అందిస్తుంది, కానీ ఆ ప్యాకేజీలలో ఖచ్చితంగా ఏమేమి చేర్చబడ్డాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటిలో గది ఛార్జీలు, డాక్టర్ విజిటింగ్స్, ఎమర్జెన్సీ ఛార్జీలు, అవసరమైన టెస్ట్ లు , మందుల ఛార్జీలు.. ఇలా అన్నీ ఉన్నాయో లేదో ముందుగానే చూసుకోవాలి. ఇది తరువాత హాస్పిటల్లో శిశువు భద్రత.. ఆసుపత్రిలో నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేదా NCU (నర్సరీ కేర్ యూనిట్) ఉందో లేదో నిర్ధరించుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు, శిశువులు నెలలు నిండకుండానే పుడతారు లేదా పుట్టిన తర్వాత వారికి స్పెషల్ కేర్ అవసరం అవుతుంది. ఆసుపత్రిలో ఈ సౌకర్యాలు ఇప్పటికే ఉంటే, శిశువుకు ఎమర్జెన్సీగా స్పెషల్ కేర్ అందించవచ్చు. పిల్లల డాక్టర్.. ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ అన్ని వేళలా అందుబాటులో ఉంటారా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే, పుట్టిన వెంటనే శిశువును పరీక్షించడానికి , సంరక్షించడానికి పిల్లల డాక్టర్ ఉండటం చాలా కీలకం. ఏ కారణం చేతనైనా బిడ్డకు వెంటనే వైద్య సహాయం అవసరమైతే, వైద్యుడు అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం. డెలివరీ పార్ట్నర్.. ప్రసవ సమయంలో భర్త లేదా కుటుంబ సభ్యుడు మహిళతో ఉండటానికి ఆసుపత్రి అనుమతిస్తుందా లేదా అని కనుక్కోవాలిి. వీరిని ప్రసవ భాగస్వామి అని పిలుస్తారు. చాలా మంది మహిళలకు, ప్రసవమనే ఈ కష్ట సమయంలో సన్నిహితంగా ఒకరు తోడు ఉండటం ఎంతో సహాయపడుతుంది, ఎందుకంటే ఈ సమయంలో వారికి శారీరక , మానసిక మద్దతు రెండూ అవసరం. అందువల్ల, ప్రసవానికి ముందే ఆసుపత్రి విధానం గురించి విచారించడం ముఖ్యం. మహిళల మూవ్మెంట్.. ప్రసవ సమయంలో మహిళ కదలడానికి లేదా పొజిషన్ మార్చుకోవడానికి అనుమతి ఉందా లేదా అనేది కనుక్కోవాలి. చాలా ఆసుపత్రులు మహిళను మంచానికే పరిమితం చేస్తాయి, అయితే మరికొన్ని హాస్పిటల్స్ అయితే లైట్ గా కదలడానికి అనుమతిస్తాయి, ఇది నొప్పిని తగ్గించి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి మహిళలు ప్రసవం కోసం హాస్పిటల్స్ ను ఎంచుకునే ముందు పైన పేర్కొన్న విషయాలను విచారించిన తర్వాతే ఎంచుకోవడం మంచిది. *రూపశ్రీ.
read moreప్రెగ్నెన్సీ గ్లో అంటే ఏంటి..ఇది నిజంగానే చర్మాన్ని కాంతివంతంగా చేస్తుందా.!
గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ మార్పులలో, తరచుగా వినబడే పదం "ప్రెగ్నెన్సీ గ్లో". గర్భధారణ సమయంలో మహిళ ముఖం మరింత ప్రకాశవంతంగా, కాంతివంతంగా కనిపిస్తుందని సాధారణంగా చెబుతుంటారు. వివాహానికి ముందు ఆడపిల్లలకు పెళ్లి కళ అని ఎలా అంటారో.. అలాగే గర్భాధారణ సమయంలో కూడా ముఖంలో కాంతి పెరుగుతుంది. చాలా మంది అలాంటిది ఏమీ ఉండదని కొట్టి పడేస్తుంటారు. కానీ శరీరంలో జరిగే వివిధ సహజ మార్పుల కారణంగా ఇది జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీ గ్లో అనుభవంలోకిరాదు. గర్భధారణ సమయంలో ప్రతి మహిళ శరీరం భిన్నంగా స్పందిస్తుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ప్రెగ్నెన్సీ గ్లో.. గర్భధారణ సమయంలో ఒక మహిళ చర్మం సాధారణం కంటే ప్రకాశవంతంగా, గులాబీ రంగులో , చాలా ఫ్రెష్ గా కనిపించడాన్ని ప్రెగ్నెన్సీ గ్లో అంటారు. చాలా మంది మహిళలు తమ బుగ్గలపై లేత ఎరుపుదనాన్ని , మరింత కాంతివంతమైన ఛాయను గమనిస్తారు. ఈ మార్పు తరచుగా రెండవ త్రైమాసికంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయానికి, తొలి నెలల్లో ఉండే అలసట, ఉదయం వచ్చే వికారం , నీరసం వంటి సమస్యలు కొంతవరకు తగ్గడం మొదలుపెడతాయి. ఈ కాంతి కొందరిలో గర్భధారణ అంతటా ఉండవచ్చు, మరికొందరిలో ఇది అస్సలు కనిపించకపోవచ్చు కూడా. గర్భధారణ సమయంలో, శరీరంలో ఈస్ట్రోజెన్ , hCG వంటి హార్మోన్ల స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఈ మార్పులు చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తాయి, దీని కారణంగా ముఖం మరింత ప్రకాశవంతంగా కనిపించవచ్చు. గర్భధారణ సమయంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల చర్మంలోని నూనె గ్రంథులు మరింత చురుకుగా మారతాయి, దీనివల్ల ముఖానికి సహజమైన కాంతి వస్తుంది. అయితే, కొంతమంది మహిళల్లో ఈ అదనపు నూనె మొటిమలకు కూడా కారణం అవుతుంది. గర్భధారణ సమయంలో తల్లి , బిడ్డ ఇద్దరి అవసరాలను తీర్చడానికి శరీరంలో రక్త పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. ఈ పెరిగిన రక్త ప్రసరణ వలన చర్మంలోని చిన్న రక్త కణాలు విస్తరిస్తాయి, దీనివల్ల బుగ్గలు గులాబీ రంగులోకి మారి, ముఖం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా, గర్భం పెరిగేకొద్దీ, పొత్తికడుపు , శరీరంలోని ఇతర భాగాల చర్మం సాగుతుంది. ఈ సాగడం వల్ల రక్త ప్రసరణ పెరిగి హార్మోన్ల మార్పులతో పాటు చర్మం కాంతివంతంగా మారడానికి కారణం అవుతుంది. గర్భధారణ సమయంలో చాలా మంది మహిళలకు సాధారణం కంటే వేడిగా అనిపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడం, రక్త ప్రసరణ ఎక్కువ కావడం వలన ముఖం కొద్దిగా ఎర్రబడటం , ఉబ్బడం జరగవచ్చు. గర్భధారణ సమయంలో, వైద్యులు సమతుల్య ఆహారం , గర్భధారణ సప్లిమెంట్లను సిఫార్సు చేస్తారు. పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు , అవసరమైన విటమిన్లు శరీర ఆరోగ్యంపై, అలాగే చర్మ ఆరోగ్యంపై పనిచేస్తాయి. వైద్యుల ప్రకారం, ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా స్పందిస్తుంది, గర్భధారణ లక్షణాలు స్త్రీని బట్టి ఎలా మారుతాయో, అలాగే ప్రెగ్నెన్సీ గ్లో కూడా అందరిలో కనిపించదు. అందువల్ల గర్భధారణ సమయంలో స్త్రీ ముఖంలో ఈ కాంతి కనిపించకపోతే, దానిని సమస్యగా పరిగణించకూడదు. *రూపశ్రీ.
read moreతెల్లగా మారాలని స్కిన్ క్రీములు వాడుతున్నారా..ఈ షాకింగ్ నిజాలు తెలుసా!
అందం అంటే చర్మం తెల్లగా ఉండటం అని చాలామంది అనుకుంటారు. అందుకే చర్మం తెల్లగా అవ్వడం కోసం చాలా రకాల స్కిన్ క్రీములు, స్కిన్ ట్రీట్మెంట్లు ట్రై చేస్తూ ఉంటారు. మార్కెట్లో కూడా చర్మాన్ని తెల్లబరిచే సోపులు, క్రీములు అంటూ చాలా రకాల ఉత్పత్తులు ఉంటాయి. ఇలాంటి క్రీములు, సోపులు వాడటం వల్ల చర్మంలో చాలా మార్పు వచ్చిందని సోషల్ మీడియాలో కూడా చాలా రివ్యూస్ వస్తూ ఉంటాయి. వీటిని చూసి మరెంతో మంది వీటిని వాడటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చర్మం తెల్లగా మారాలని స్కిన్ క్రీములు వాడేవారికి చర్మ సంరక్షణ నిపుణులు షాకింగ్ నిజాలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. క్రీముల వెనుక రహస్యం.. చర్మం చాలా తొందరగా తెల్లబడటం కోసం ఉపయోగించే క్రీములలో సాధారణం కంటే ఎక్కువ మోతాదులో పాదరసం, సీసం వంటివి కలుపుతారట. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీని ఫలితంగా 10 నుండి 15 రోజులలో చర్మం తెల్లగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ క్రీములు, సోపులు చాలా ప్రబావవంతంగా పని చేస్తాయని అందరూ అనుకుంటారు. అయితే పెద్ద మొత్తంలో సీసం, పాదరసం కలపడం చట్టవిరుద్ధం. ఇలాంటి క్రీములు, సోపులు ఎక్కువ కాలం లేదా రోజులో ఎక్కువ సార్లు వాడటం వల్ల మూత్రపిండాలు, మెదడు , ఇతర అవయవాలకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. అధిక స్థాయిలో ఉన్న పాదరసం 10 నుండి 12 రోజులలోనే మూత్రపిండాలపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుందని, అదే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, చాలా నెలల పాటు ప్రతిరోజూ వాడటం వల్ల క్రమంగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మం మాత్రమే కాదు.. చర్మం తెల్లబడటానికి ఉపయోగించే క్రీముల వల్ల కలిగే ప్రభావాలు చర్మానికి మాత్రమే పరిమితం కావు. పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు , ఎముక మజ్జలో పేరుకుపోతుంది. వైద్యుల ప్రకారం, ఇది క్రమంగా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇది తీవ్రంగా మారితే డయాలసిస్‌కు కూడా దారితీయవచ్చు. ఇది చేతులు వణకడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆందోళన, నిద్రలేమి, చిరాకు , ఏకాగ్రత తగ్గడం వంటి నాడీ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, వినికిడి సమస్యను, కంటిచూపును కూడా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి క్రీములు వాడకూడదు.. సీసం స్థాయిలు పరిమితికి మించి ఎక్కువగా ఉండే క్రీములు వాడకూడదు. చర్మాన్ని తెల్లగా చేయడంలో సీసానికి ప్రాధాన్యత లేదు. దీని వాడకం ఉపయోగం ఏమీ లేదని నిపుణులు అంటున్నారు. పాదరసం, సీసం.. లేదా వాటి ముడి పదార్థాలు ఉండే ఉత్పత్తులు అసురక్షితమైనవని చెబుతారు. సీసం శరీరంలో పేరుకుపోయి మెదడు, మూత్రపిండాలు, రక్తాన్ని ఉత్పత్తి చేసే అవయవాలు , పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగించగలదని చెబుతారు. ఏ కొంచెం సీసం కూడా సురక్షితం కాదని, అది పాదరసంతో కలిస్తే ఆరోగ్య ప్రమాదాలు మరింత పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కేవలం నిగారింపు కోసం ఎలాంటి క్రీమ్‌ను ఉపయోగించవద్దని చర్మ నిపుణులు సలహా ఇస్తున్నారు. ముఖంపై మచ్చలు లేదా పిగ్మెంటేషన్ సమస్యలు ఉంటే, ముందుగా చర్మ సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం మంచిది. *రూపశ్రీ.
read moreమీకు థైరాయిడ్ ఉందా.. ఇదిగో ఈ రెండూ చేస్తే చాలావరకు కంట్రోల్ ఉంటుంది..!
మీకు థైరాయిడ్ ఉందా.. ఇదిగో ఈ రెండూ చేస్తే చాలావరకు కంట్రోల్ ఉంటుంది..! ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న గ్రంథి. ఈ గ్రంథి శరీర జీవక్రియ, శక్తి, బరువు, హృదయ స్పందన రేటు, జీర్ణక్రియ , మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ గ్రంథి సరైన నిష్పత్తిలో హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో విఫలమైనప్పుడు, అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. థైరాయిడ్ వ్యాధిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి హైపోథైరాయిడిజం , రెండవది హైపర్‌థైరాయిడిజం. హైపోథైరాయిడిజం తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల బరువు పెరగడం, అలసట, మలబద్ధకం, జుట్టు రాలడం , పొడి చర్మం వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు, హైపర్‌థైరాయిడిజం ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల ఆందోళన, బరువు తగ్గడం, నిద్రలేమి , హృదయ స్పందన ఎక్కువగా ఉండటం వంటివి జరుగుతాయి. చాలామంది థైరాయిడ్ సమస్య వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందేమో అని అనుకుంటారు. కానీ కేవలం రెండు పనుల వల్ల థైరాయిడ్ ను కంట్రోల్ లో ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. థైరాయిడ్ ను నియంత్రించే పనులు.. సరైన లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైన ఆహారం , క్రమం తప్పని యోగా సాధన థైరాయిడ్ సమస్యలను చాలా వరకు నియంత్రణలో ఉంచుతాయి. దీనివల్ల చాలా మంది ఎంతో ప్రయోజనం పొందారు. ఒకవేళ మందులు వాడేవారు వైద్య సలహా లేకుండా మందులు ఆపడం మంచిది కాదు.. థైరాయిడ్ నియంత్రణలో ఉంచుకోవడానికి సరైన లైఫ్ స్టైల్, ఆహారం, యోగా చేస్తూ ఆ తర్వాత వైద్యుల సలహాతో మందులు ఆపవచ్చు. థైరాయిడ్ కోసం యోగా.. యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని అంతర్గత గ్రంధుల పనితీరును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది , హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. నేటికాలంలో చాలా మందిలో థైరాయిడ్ సమస్యలకు ఒత్తిడి ఒక ప్రధాన కారణంగా మారింది. ఎప్పుడూ ఒత్తిడికి గురైనప్పుడు, శరీరంలోని హార్మోన్ల సమతుల్యతలో హెచ్చుతగ్గులు ఏర్పడుతాయి. యోగా మనసును ప్రశాంతపరిచి, శరీరం సహజంగా ఆరోగ్యంగా మారడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ కోసం యోగాసనాలు.. సర్వాంగాసనం థైరాయిడ్ సమస్యలకు ఇది ఉత్తమమైన ఆసనం. ఈ ఆసనంలో గడ్డం మెడను తాకుతుంది, దీనివల్ల థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరిగి, అది సరిగ్గా పనిచేయడానికి వీలవుతుంది. మత్స్యాసనం.. ఈ ఆసనం గొంతు , ఛాతీని సాగదీస్తుంది. సర్వాంగాసనం తర్వాత మత్స్యాసనం చేయడం చాలా ప్రయోజనకరం, ఇది థైరాయిడ్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. భుజంగాసనం.. భుజంగాసనం మెడ , వెన్నెముకను కుదురుగా, బలంగా చేసి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉష్ట్రాసనం.. ఉష్ట్రాసనంలో మెడ వెనుకకు వంగడం వల్ల గొంతు సాగి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, దీని ప్రత్యక్ష ప్రభావం థైరాయిడ్ గ్రంథిపై ఉంటుంది. సేతుబంధాసనం.. ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించడంలో మరియు హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతారు. ప్రాణాయామాలు.. అనులోమ-విలోమ.. ఇది శరీరంలో ఆక్సిజన్‌ను పెంచి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. భ్రమరి ప్రాణాయామం.. భ్రమరి చేయడం మనసుకు శాంతిని చేకూర్చి, ఒత్తిడి , ఆందోళనను తగ్గించగలదు. ఉజ్జయి ప్రాణాయామం.. ఇది థైరాయిడ్‌కు చాలా ముఖ్యమైనదిగా చెబుతారు, ఎందుకంటే ఇది గొంతు ప్రాంతంపై తేలికపాటి ప్రభావాన్ని చూపుతుంది, ఇది థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ 20 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే, శరీరం , మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి, ఇది చాలా ముఖ్యం. థైరాయిడ్ కు ఆహారం.. యోగాతో పాటు, సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. కేవలం మందులతో సమస్య పరిష్కారం కాదు. ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అయోడిన్ చాలా అవసరం. అయోడైజ్డ్ ఉప్పును మితంగా వాడాలి. అలాగే, కొంత సమయం ఎండలో గడపాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తప్పక తినాలి పప్పుధాన్యాలు, జున్ను, పాలు, పెరుగు, మజ్జిగ , మొలకెత్తిన ధాన్యాలు శరీరానికి ప్రోటీన్‌ను అందించి, హార్మోన్లను సరిచేయడంలో సహాయపడతాయి. తాజా పండ్లు , కూరగాయలు తప్పక తినాలి. కాలానికి అనుగుణంగా లభించే పండ్లు, ఆకుకూరలు, క్యారెట్లు, బీట్రూట్, టమాటాలు , దోసకాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు , పోషకాలను అందిస్తాయి. సెలీనియం , జింక్ తీసుకోవాలి. వాల్నట్లు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు , తృణధాన్యాలు థైరాయిడ్‌కు చాలా మేలు చేస్తాయి. నీరు బాగా తాగాలి. రోజంతా సరైన మోతాదులో నీరు త్రాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి , ఆరోగ్యకరమైన జీవక్రియ కొనసాగుతుంది. థైరాయిడ్ ఉన్నవారు ఈ పనులు అస్సలు చేయకూడదు.. థైరాయిడ్ సమస్య ఉన్నవారు జంక్ ఫుడ్, వేయించిన ఆహారం, శీతల పానీయాలు , తీపి పదార్థాలను ఎక్కువగా తినకూడదు. అధిక ఒత్తిడి, రాత్రి పొద్దుపోయే వరకు మేల్కొని ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అందువల్ల, ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించడం ముఖ్యం. థైరాయిడ్ కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు. ఇది జీవనశైలికి కూడా ముడిపడి ఉంటుంది. సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పాజిటివ్ గా ఉండటం వంటివన్నీ చికిత్సలో భాగమే. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల యోగా , 20 నుండి 30 నిమిషాల పాటు వేగంగా నడవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి అదనంగా, ఇవి మాత్రమే కాకుండా మొబైల్ ఫోన్ మరియు స్క్రీన్ సమయాన్ని తగ్గించడం ద్వారా మంచి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. *రూపశ్రీ.
read moreప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ ప్రమాదమా.. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి!
ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ ప్రమాదమా.. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన నిజాలివి! ప్రతి మహిళ వివాహం అయ్యాక గర్బం దాల్చాలని, సుఖంగా ప్రసవం కావాలని కోరుకుంటుంది. గర్బవతిగా ఉన్న మహిళ విషయంలో కుటుంబ సభ్యులు కూడా ఇదే కోరుకుంటారు. కానీ ప్రసవం వరకు ఉన్న పరిస్థితి వేరు.. ప్రసవం తర్వాత ప్రతి తల్లి ఎదుర్కునే పరిస్థితులు వేరు.. ప్రసవం తర్వాత గడిచే కాలం చాలామంది మహిళలకు చాలా క్లిష్టంగా ఉంటుంది. శారీరక పరంగా వచ్చే మార్పులు, హార్మోన్ మార్పులు, నిద్రలేమి, అలసట, అప్పుడే పుట్టిన బిడ్డను చూసుకోవడం.. ఇలా చాలా విషయాలు మహిళల మీద ప్రబావం చూపిస్తాయి. ఇవి కాస్తా చాలామంది మహిళలను డిప్రెషన్ లోకి నెట్టేస్తాయి. ప్రసవం తర్వాత వచ్చే ఈ డిప్రెషన్ ప్రమాదమా? తెలుసుకుంటే.. ప్రసవం తర్వాత డిప్రెషన్.. ప్రసవానంతర డిప్రెషన్ (PPD) అనేది ప్రసవం తర్వాత కొంతమంది మహిళల్లో ఏర్పడే ఒక మానసిక ఆరోగ్య సమస్య. ఇది సాధారణ "బేబీ బ్లూస్"కు భిన్నమైనది. బేబీ బ్లూస్ సాధారణంగా కొన్ని రోజుల్లోనే తగ్గిపోతాయి, అయితే ప్రసవానంతర డిప్రెషన్ లక్షణాలు వారాలు లేదా నెలల పాటు ఉండే అవకాశం ఉంటుంది, పైగా వీటికి చికిత్స కూడా అవసరం కావచ్చు. ప్రసవం తర్వాత డిప్రెషన్ లక్షణాలు.. బిడ్డను కన్న తర్వాత మహిళ కొన్ని రోజులు లేదా వారాల పాటు ఎప్పుడూ విచారంగా ఉన్నా, కారణం లేకుండా ఏడ్చినా, లేదా దేనిలోనూ ఆనందాన్ని పొందలేకపోయినా, అది ప్రసవానంతర డిప్రెషన్‌కు సంకేతం కావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి క్రమంగా రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బిడ్డ ఆరోగ్యం గురించి సాధారణంగా తల్లికి ఆందోళన సహజమే, కానీ ఎప్పుడూ భయపడుతూ, ఆందోళనగా, లేదా భయంగా ఉంటూ, కుదురుగా ఉండలేక, తన భయాన్ని, ఆందోళనను నియంత్రించుకోలేకపోతే, అలాంటి పరిస్థితి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లో భాగమే.. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రసవానంతర డిప్రెషన్‌తో బాధపడుతున్న మహిళ ఎక్కువగా నిద్రపోవచ్చు లేదా అసలు నిద్రపోకపోవచ్చు. అదేవిధంగా, నీరసంగా లేదా విపరీతమైన ఆకలిగా అనిపించడం వంటి సమస్య కూడా ఉండవచ్చు. కొంతమంది మహిళలు తమకు పుట్టిన బిడ్డతో ఎమోషనల్ గా ఉండలేకపోవడం, వారితో ప్రేమగా ఉండలేకపోవడం వంటి పరిస్థితిలో ఉంటారు. వారు బిడ్డను చూసుకోవడంలో తక్కువ ఆసక్తి చూపవచ్చు లేదా అపరాధ భావనతో బాధపడవచ్చు. ఇది కూడా ప్రసవానంతర డిప్రెషన్‌కు ఒక ముఖ్యమైన లక్షణమే. ప్రసవం తర్వాత మహిళ తనకు తాను హాని కలిగించుకోవడం, ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడం లేదా బిడ్డకు హాని కలిగించడం వంటి ఆలోచనలు చేస్తే అది తీవ్రమైన మానసిక ఆరోగ్య పరిస్థితి కావచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని లేదా మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఏ మహిళలకు ప్రసవం తర్వాత డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ? గతంలో డిప్రెషన్ లేదా ఆందోళన కలిగి ఉన్న మహిళలు, కుటుంబం నుండి తగినంత మానసిక మద్దతు లభించని మహిళలు, ఆర్థిక లేదా కుటుంబ ఒత్తిడిలో ఇబ్బంది పడే మహిళలు, నెలలు నిండకనే ముందుగా ప్రసవం జరగడం లేదా ప్రసవం చాలా కష్టంగా జరగడం వంటివి జరిగిన మహిళలు, కవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన మహిళలు, . చాలా రోజుల పాటు సరైన నిద్ర లేకుండా మానసికంగా తీవ్రంగా అలసిపోయిన మహిళలు.. ఇలాంటి వారికి ప్రసవం తర్వాత డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. *రూపశ్రీ.
read moreతల్లి కావాలని కోరుకునే మహిళలు తినాల్సిన ఆహారం ఇది!
తల్లి కావాలని కోరుకునే మహిళలు తినాల్సిన ఆహారం ఇది! ఈ ప్రపంచంలో మాతృత్వం అనేది చాలా ప్రత్యేకమైనది. వివాహం జరిగిన తర్వాత ప్రతి మహిళ తాము ఎప్పుడు గర్బం ధరిస్తామా అని ఎంతో ఆశతో ఎదురుచూచ్తుంది. అయితే తీసుకునే ఆహారం చాలా మంది మహిళలలో గర్బం ధరించడంలో ప్రభావితం చేస్తుందట. కేవలం ఆహారం వల్లే మహిళలు గర్బం ధరించడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం జరగదని అంటున్నా, సరైన డైట్ లేకపోతే గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుందని అంటున్నారు. అందుకే గర్బం దాల్చాలని అనుకునే అమ్మాయిలు, గర్బం కోసం ప్రయత్నాలు చేయడం, జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, సరైన డైట్ కూడా పాటించాలి. ఇందుకోసం మహిళలు ఏం తినాలో తెలుసుకుంటే.. ఆకుపచ్చ ఆకుకూరలు.. పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆకుపచ్చ ఆకు కూరలు సంతానోత్పత్తికి సహకరించే ఆహారాలలో ముఖ్యంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన అండాల అభివృద్ధికి , గర్భధారణ ప్రారంభ దశలకు అవసరమైన ఫోలేట్ వీటిలో పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఐరన్,, కాల్షియం , యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి , హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ధాన్యాలు.. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా . మిల్లెట్స్ వంటి సంపూర్ణ ధాన్యాలు శరీరంలో రక్తంలో చక్కెర సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉండటం ఇన్సులిన్ , పునరుత్పత్తి హార్మోన్లపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా PCOS లేదా నెలసరి సరిగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్న మహిళలకు పాలిష్ చేసిన ధాన్యాల కంటే పొట్టు తీయని ధాన్యాలు మంచి ప్రత్యామ్నాయంగా పరిగణించబడతాయి. బెర్రీలు, ఇతర ఫ్రూట్స్.. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, నారింజ, కివీ , దానిమ్మ, జామ వంటి పండ్లలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అండాలు , శుక్రకణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. దానిమ్మపండ్లు గర్భాశయంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని కూడా నమ్ముతారు, ఇది పిండం ఏర్పడటంలో చాలా సహాయపడుతుందట. చేపలు.. సాల్మన్ , సార్డిన్ల వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీరంలో వాపును తగ్గించడానికి, హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడటానికి, ప్రత్యుత్పత్తి అవయవాలకు మంచి రక్త ప్రసరణను జరగడానికి సహాయపడతాయి. పురుషులలో, ఇవి వీర్య కణాల నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మహిళలలో, ఇవి రుతుస్రావం , గర్భధారణకు తోడ్పడతాయి. సీడ్స్, నట్స్.. వాల్నట్లు, బాదం, అవిసె గింజలు, గుమ్మడి గింజలు , పొద్దుతిరుగుడు గింజల వంటి ఆహారాలలో విటమిన్ ఎ, జింక్, సెలీనియం , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మహిళల్లో అండాల ఆరోగ్యాన్ని , పురుషులలో వీర్య కణాల నాణ్యతను కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒక అధ్యయనంలో వాల్నట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వీర్య కణాల నాణ్యత , సంతానోత్పత్తి మెరుగుపడ్డాయని కూడా కనుగొన్నారట. *రూపశ్రీ.
read moreచిన్నవయసులోనే ఆడపిల్లలకు మెచ్యురిటీ.. దీని పర్యవసానాలు ఏంటి తెలుసా!
చిన్నవయసులోనే ఆడపిల్లలకు మెచ్యురిటీ.. దీని పర్యవసానాలు ఏంటి తెలుసా! ప్రతి ఆడపిల్ల ఒక వయసుకు వచ్చాక ఋతుచక్రంలోకి అడుగు పెట్టడం సహజం. ఆడపిల్లలలో ఒకసారి ఋతుచక్రం మొదలైతే మెనోపాజ్ దశకు చేరేవరకు ప్రతి నెలా నెలసరిని ఎదుర్కుంటుంది. కొన్నేళ్ళ కిందటితో పోలిస్తే నేటికాలంలో ఆడపిల్లలు చాలా చిన్న వయసులో మెచ్యురిటీ అవుతున్నారు. గతంలో 14, 15 ఏళ్ల వయసులో మెచ్యురిటీ అయ్యేవారు.. కానీ నేటికాలంలో చాలామంది ఆడపిల్లలు 10 ఏళ్లకే మెచ్యురిటీ అవుతున్నారు. చిన్న వయసులో మెచ్యురిటీ కావడం పెద్దగా సమస్య ఏముంటుందిలే అని తల్లిదండ్రులు కూడా అనుకుంటారు. పైగా ఇది ప్రకృతి సిద్దమైన చర్య కావడం వల్ల దీని గురించి ఎక్కువగా ఆలోచించరు కూడా. కానీ చిన్న వయసులోనే మెచ్యురిటీ అవ్వడం వల్ల ఆడపిల్లలలో ఎదురయ్యే సమస్యలు కొన్ని ఉన్నాయి. అలాగే పిల్లలు చిన్న వయసులోనే మెచ్యురిటీ కాకుండా.. ఒక నిర్ణీత వయసు వచ్చాక మెచ్యురిటీ కావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. చిన్న వయసులో మెచ్యురిటీ ఇందుకే.. చిన్న వయసులోనే పిల్లలు మెచ్యురిటీ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అధిక బరువు పిల్లలను చాలా ప్రభావితం చేస్తుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా పిల్లలు చిన్న వయసులో మెచ్యురిటీ కావడానికి కారణం అవుతుంది. మార్కులు, ర్యాంకుల వంటివి పిల్లలను ఒత్తిడికి గురి చేస్తాయి. ఇది ఆడపిల్లలలో చిన్నతనంలో మెచ్యురిటీ కావడానికి కారణం అవుతుంది. అలాగే నేటికాలంలో జంక్ ఫుడ్ కూడా చాలా దారుణంగా తింటుంటారు. పిల్లలు జంక్ ఫుడ్ తినడాన్నే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగా కూడా పిల్లలు చిన్నతనంలో మెచ్యురిటీ కావడానికి కారణం అవుతుంది. ఇవన్నీ కలిసి పిల్లలు చిన్న వయసులో మెచ్యురిటీ కావడానికి దారి తీస్తాయి. చిన్న వయసులో మెచ్యురిటీ అయితే ఎదురయ్యే సమస్యలు.. పిల్లలు చిన్న వయసులో మెచ్యురిటీ అవ్వడం వల్ల పిల్లల ఎదుగుదలలో సమస్యలు ఏర్పడతాయి. ప్రతి నెలా పీరియడ్స్ రావడం వల్ల పిల్లలలో ఎముకల ఎదుగుదల నెమ్మదించి, క్రమంగా తగ్గిపోతుంది. దీని వల్ల ఆడపిల్లలు ఎత్తు పెరగరు. తల్లిదండ్రులు బాగా ఎత్తు ఉన్న వారైనా సరే.. ఈ కారణాల వల్ల ఆడపిల్లల ఎత్తు పెరగరు. పీరియడ్స్ కారణంగా పిల్లలలో శారీరక, మానసిక మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి కారణంగా పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతారు. వారు తమ బాల్యాన్ని, తమ చదువును కూడా శ్రద్దగా అనుభూతి చెందలేరు. చిన్నతనంలో మెచ్యురిటీ కాకుండా ఉండటానికి జాగ్రత్తలు.. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హార్మోన్స్ ను డిస్టర్బ్ చేసే కెమికల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, కంటైనర్స్, కాస్మెటిక్ ప్రోడక్ట్స్, క్రీములు, ,పౌడర్లు, నెయిల్ పాలిష్ వంటివి ఆడపిల్లలకు ఒక వయసు వరకు దూరంగా ఉంచడం మంచిది. అలాగే పెస్టిసైడ్స్ ను ఉపయోగించి పండించిన ఆహారాలు కూడా పిల్లల హార్మోన్స్ ను చాలా డిస్టర్బ్ చేస్తాయ్. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి. రోజులో కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూడాలి. రోజూ కాసేపు వ్యాయామం చేయగలిగేలా పిల్లలను ప్రోత్సహించాలి. టీవీ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ వంటి వాటికి ఎక్కువ సమయం వెచ్చించకుండా పిల్లలకు టైమ్ సెట్ చేయాలి. ఇవన్నీ ఫాలో అయితే పిల్లలు చాలా చిన్న వయసులో మెచ్యురిటీ కావడాన్ని నివారించవచ్చు. *రూపశ్రీ.
read more




_large.png)

















