అశ్వగంధ ఆయుర్వేదంలో ఒక ముఖ్య ఔషధం.  ఇది మొక్క వేరు నుండి లభించే పదార్థం. అశ్వగంధ వేరు రూపంలో ఉంటుంది. దీన్ని సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషదంగా వాడతారు.  అశ్వగంధ కేవలం పొడి రూపంలోనే కాకుండా  టాబ్లెట్లు,  లేహ్యం రూపంలో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఆయుర్వేద వైద్యులు చాలా  రకాల జబ్బులకు అశ్వగంధను సిఫారసు చేస్తారు.  ముఖ్యంగా మానసిక ఒత్తిడి,  ఆందోళన,  నరాల సమస్యలు, నిద్రలేమి  వంటి సమస్యలకు అశ్వగంధను సిఫారసు చేస్తారు.  


అనారోగ్యంతో బాధపడే చాలామందికి అశ్వగంధను కూడా ఔషదంల బాగం చేస్తారు.   ఇది ఇతర ఔషధాలు సమర్థవంతంగా పని చేయడంలో సహకరిస్తుంది. అంటే మందులను కాంబినేషన్ రూపంలో ఇస్తారు.  కాబట్టి ఏవైనా మందులు వాడేవారు సొంతంగా అశ్వగంధ మాత్రలు లేదా పొడి తీసుకోకూడదు.

అశ్వగంద నేరుగా తీసుకోవడం కంటే పాలతో తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. లేకుంటే వేడి నీటితో అయినా తీసుకోవచ్చు.

అశ్వగందను ఏ రూపంలో తీసుకున్నా జ్ఞాపకశక్తి, శ్రద్ద,  ఆలోచనలు మెరుగుపడటం,  మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వంటి వాటిలో సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా అశ్వగంధ బాగా పనిచేస్తుంది.  అశ్వగంధను తీసకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. ఈ కారణంగా శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నవారికి, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మేలు చేస్తుంది.

అధిక బరువు ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రణలో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.  ఈ కారణంగా ఇది బరువు తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో కండరాలు బలంగా మారడంలో కూడా అశ్వగంధ సహాయపడుతుంది.


మహిళలకు కూడా అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. మహిళలు సాధారణంగా హార్మోన్ సమస్యలు ఎక్కువగా ఎదురుకుంటూ ఉంటారు.  అలాంటి వారికి అశ్వగంధ బాగా పనిచేస్తుంది.  హార్మోన్ సమస్యలు తగ్గిస్తుంది. నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. మహిళలలో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.  


పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కునే పురుషులలో పునరుత్పత్తి హార్మోన్లను మెరుగు పరచడంలో అశ్వగంధ సహాయపడుతుంది. స్పెర్మ్ కౌంట్ మెరుగ్గా ఉండేలా, స్పెర్మ్ క్వాలిటీని మెరుగుపరుస్తుంది.


                                           *రూపశ్రీ.