వర్షాకాలంలో ఈ 5 కూరగాయలు కొనకపోవడమే మంచిది..!
సీజన్ ను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటు కొన్ని రకాల కూరగాయలను కొత్తగా జత చేసుకోవడం లేదా కొన్ని తినకుండా వదిలిపెట్టడం వంటివి చేస్తారు. అదే విధంగా వర్షాకాలంలో 5 రకాల కూరగాయలు తినడం మంచిది కాదని, సాధ్యమైతే వీటిని ఈ వర్షాకాలంలో పూర్తీగా వదిలిపెట్టడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో వదిలిపెట్టాల్సిన కూరగాయలు ఏమిటి? వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకుంటే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది క్యాబేజీ తినడం తగ్గిస్తారు. దాని నుండి వచ్చే పురుగులు చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ క్యాబేజీ మాత్రమే కాకుండా పురుగులు ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి. అవి శుభ్రం చేసిన తర్వాత కూడా అందులో పురుగులు పూర్తిగా బయటకు రావు. అందుకే వర్షాకాలంలో కొన్ని కూరగాయలు అస్సలు తినకూడదని అంటారు. ఆకుకూరలు.. పాలకూర, మెంతికూ, ఆవాల చెట్టు ఆకులు .. ఇలా చాలా రకాల ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది. వాటిని ఎంత బాగా కడిగినా కొన్ని కంటికి కనిపించనంత సన్నని పురుగులు, సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. క్యాబేజీ, క్యాలిఫ్లవర్.. క్యాబేజీ, కాలీఫ్లవర్ లలో పొరలు, పువ్వులు ఉంటాయి. ఈ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా పెరుగుతాయి. వీటిని తినకపోవడమే మంచిది. ఒకవేళ వీటిని తినాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో వీటిని బాగా కడగాలి. పుట్టగొడుగు.. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది విటమిన్-డి కోసం అయినా పుట్టగొడుగులను తినాలని అనుకుంటారు. పైగా వర్షాల కారణంగా పుట్టగొడుగులు కూడా బాగా పండుతాయి. కానీ పుట్టగొడుగులు ఎంత ఆరోగ్యమూ.. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా కొద్దిగా కలుషితమైనా చాలా చెడ్డ చేస్తుంది. పుట్టగొడుగులు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. బంగాళదుంపలు.. ఆహార నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బంగాళాదుంపలు తినకపోవడం మంచిది. ఎందుకంటే బంగాళదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి బంగాళాదుంపలను ఇలా తినకూడదు. అయితే, సరిగ్గా నిల్వ చేస్తే బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తవు . వీటిని అయితే తినవచ్చు. జాగ్రత్త.. వర్షాకాలంలో కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా చాలా తాజాగా ఉండాలి. తాజాగా ఉన్నా సరే.. వీటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి. లేకపోతే వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పురుగులు, రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreజాగ్రత్త.. బెర్రీలు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదు..!
బెర్రీలు చాలా మంది ఇష్టంగా తినే పండ్లు. వీటిలో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ.. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. తియ్యగా, పుల్లగా ఉంటూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే బెర్రీలు అంటే అందరికీ ఇష్టమే.. వీటిని ఉపయోగించి చేసే జ్యూస్ లు, స్మూతీలు, ఐస్ క్రీమ్ లకు చాలా ఆదరణ ఉంది. వీటి ప్లేవర్ అంత బాగుంటుంది మరి. అయితే బెర్రీలు తినగానే కొన్ని రకాల ఆహారాలు, ద్రవ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంట. అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ బెర్రీలు తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. పాలు.. బెర్రీలు తిన్న తర్వాత పాలు తీసుకోవడం కానీ, లేక పాలు కలిపి బెర్రీలను తినడం కానీ ఆరోగ్యానికి మంచిది కాదట. ఇది జీర్ణక్రియకు ప్రమాదకరం. రెండూ కలిసి యాసిడ్-బేస్ రియాక్షన్‌కు కారణమవుతాయి. దీని వలన గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దోసకాయ.. దోసకాయ, బెర్రీలు రెండూ శరీరాన్ని చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో అవసరానికి మించి చల్లదనం పెరుగుతుంది. ఇది జలుబు, అజీర్ణానికి కారణమవుతుంది. నీరు.. బెర్రీలు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్లు, కొన్నిసార్లు వాంతులు కూడా వస్తాయి. బెర్రీలు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. ఊరగాయలు.. బెర్రీలు, ఊరగాయలు రెండూ పుల్లగా, ఆమ్లంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే బెర్రీలు తిన్న తర్వాత ఊరగాయల జోలికి పోకూడదు. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ వంటి పండ్లను సిట్రస్ పండ్లు అంటారు. బెర్రీలను తిన్న వెంటనే సిట్రస్ పండ్లను తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ పుల్లని పండ్లు. దీనివల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్స్.. బెర్రీలు తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే చక్కెర, కార్బన్ డయాక్సైడ్ బెర్రీలలో ఉండే సహజ ఆమ్లంతో కలిసిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreరోజూ పచ్చి టమోటాలు తింటే జరిగే మేలు ఏంటో తెలుసా?
భారతీయ వంటగదిలో టమోటా ఒక ముఖ్యమైన భాగం. అది కూరలో అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా టమోటా లేకుండా రుచి అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే టమోటాను ఇలా కూరలలో కాదు.. పచ్చిగా తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు. దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. పచ్చి టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ భాగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సలాడ్ లో పచ్చి టమోటా చేర్చుకోవడం చూస్తూంటాం. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుంటే.. చర్మానికి చేసే మేలు.. పచ్చి టమోటాలలో ఉండే లైకోపీన్, విటమిన్ సి చర్మానికి సహజమైన బూస్టర్‌గా పనిచేస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిస్తాయి. మొటిమలు లేదా జిడ్డుగల చర్మం సమస్యలు ఉంటే టమోటాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి.. టమోటాలలో లభించే లైకోపీన్, పొటాషియం, ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి టమోటాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీనిని సలాడ్, జ్యూస్ లేదా నేరుగా కోసి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో.. బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారికి టమోటా భలే సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. టమోటా జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును నెమ్మదిగా కాల్చడంలో సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యానికి.. టమోటాలలో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లతత్వం, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ టమోటా తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది, పేగు పనితీరు మెరుగుపడుతుంది. దీనితో పాటు, ఇది ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి.. టమాటాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, వైరల్, అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో శరీరం సులభంగా అనారోగ్యానికి గురవుతుంది. ఇలాంటి వాతావరణంలో టమోటా రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలు, వృద్ధులకు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి పోషకాలను పొందడానికి దీనిని తాజాగా తినడం మంచిది. డిటాక్స్ చేస్తుంది.. టమోటాలు శరీరం నుండి విషాన్ని తొలగించే సహజ నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాలేయం, మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నవారికి ప్రతిరోజూ టమోటాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా నిర్వహిస్తుంది, అలసటను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు టమోటాను తినడం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreఈ 5 ఆహారాలు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే చాలు.. ఎన్నేళ్లు గడిచినా యవ్వనంగా ఉంటారు..!
వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, జుట్టు నెరవడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా చాలా కాలం పాటు యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. కొన్ని ఆహారాలు (Foods for Anti-Aging) కూడా యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి. శరీరాన్ని లోపలి నుండి బలంగా చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుని వాటిని రెగ్యులర్ గా తీసుకుని, అవెలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. టమోటా. టమోటా ఆహార రుచిని పెంచడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది, ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే ఆహారంలో టమోటాను ఖచ్చితంగా చేర్చుకోవాలి. టమోటాలను ఆహారంలో అనేక విధాలుగా భాగం చేసుకోవచ్చు. పసుపు.. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కర్కుమిన్ ఉంటుంది. అందువల్ల దీనిని "గోల్డెన్ స్పైస్" అని పిలుస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఉదయం పసుపు కలిపిన పాలు తాగడం లేదా పసుపు నీరు త్రాగడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు.. పెరుగు ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మంచి జీర్ణక్రియ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది, వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. కాబట్టి ఆహారంలో పెరుగును ఖచ్చితంగా చేర్చుకోవాలి. రోజూ ఒక గిన్నె పెరుగు తినడం వల్ల మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి, జీవక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందువల్ల, ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాలేయం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం.. ఎముకలను దెబ్బ తీస్తుందా?
మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఇవి శరీరానికి మద్దతు ఇస్తాయి. శరీరంలో అవయవాలను రక్షిస్తాయి, అంతేకాదు.. శరీరం వివిధ రకాలుగా కదలడానికి సహాయపడతాయి. అందువల్ల ఎముకలు జీవితాంతం బలంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన ఎముకలు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. అస్టియోపోరోసిస్ సమస్య వస్తే ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి, అవి విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత కూడా ప్రభావితమవుతుంది. అవి మునుపటి కంటే బలహీనంగా మారుతాయి. కానీ చాలా మందిలో వయసు పెరిగే ముందే ఎముకలు బలహీనంగా మరడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఎముకలు బలహీనంగా మారడానికి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం కూడా ఒకటని వైద్యులు అంటున్నారు. చాలా షాకింగ్ కు గురిచేసే ఈ విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం.. రోజూ ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీటిని తాగితే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా ఎముకలకు చేతులారా సమస్య తెచ్చిపెట్టినట్టేనట. వాస్తవానికి ప్రతిరోజూ ఈ బాటిళ్లలో నీటిని నిల్వ చేసి వాటి నుండి నీటిని తీసుకుంటే ఎముకలు బలహీనపడతాయట. ఎందుకు హానికరం.. ప్లాస్టిక్ బాటిళ్లలో బిపిఎ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలోని విటమిన్ డి గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. విటమిన్-డి గ్రాహకాలు అంటే.. విటమిన్ డి గ్రాహకాలు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇవి శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడతాయి. కానీ BPA వాటితో జోక్యం చేసుకున్నప్పుడు, శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీని అర్థం పోషకాహారం ఎముకలకు చేరదు. అంటే శరీరానికి తగినంత కాల్షియం ఆహారం ద్వారా తీసుకున్నా అది శరీరం గ్రహించకుండా ఉంటుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం దీనికి ప్రధాన కారణం అవుతుంది. జరిగే ప్రమాదం? పోషకాహారం ఎముకలకు చేరకపోతే, అది అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు, పగుళ్లు (ఎముక విరిగిపోవడం) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మహిళలలో మెనోపాజ్ తర్వాత ఇప్పటికే కాల్షియం లోపం ఉంటోంది.ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ఎముకల సమస్యలు మరింత పెరుగుతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపొడపత్రి ఆకులతో డయాబెటిస్ కి చెక్!
డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. నేటికాలంలో దీని ప్రమాదం అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. జీవనశైలి, ఆహారపు సరిగా తీసుకోకపోవడం, మొదలైన తప్పుల వ్లల 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా డయాబెటిస్ రావడం జరుగుతోంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే లేదా సరిగ్గా చికిత్స చేయకపోతే, కాలక్రమేణా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉంటే, ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. మెరుగైన ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఇంటి నివారణలు, మందుల సహాయంతో, డయాబెటిస్‌ను నివారించడమే కాకుండా, దాని వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గించవచ్చు. అలాగే డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీని కోసం డయాబెటిస్ కిల్లర్ ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ డయాబెటిస్ కిల్లర్ ఆకులు ఏంటి? ఇవెలా పని చేస్తాయి? తెలుసుకుంటే.. పొడపత్రి.. డయాబెటిస్ ఉన్నవారికి వేప, తులసి, కరివేపాకు, మునగ వంటివి బాగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్య తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. కానీ పొడపత్రి ఆకులు మాత్రం చాలా ప్రత్యేకం. ఇవి టైప్-2 డయాబెటిస్ ను మాత్రమే కాకుండా టైప్ -1 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందట. పొడపత్రికి ఆయుర్వేదంలో చాలా ఆదరణ ఉంది. ఆయుర్వేదంలో పొడపత్రిని 2000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నట్టు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకు పొడి, సారం రెండూ డయాబెటిస్ చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది. జిమ్నెమిక్ ఆమ్లం.. పొడపత్రి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలి అంటే.. ఆ ఆకులో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి. ఈ మొక్కలో ఉండే ప్రధాన క్రియాశీల సమ్మేళనాలలో జిమ్నెమిక్ ఆమ్లం ఒకటి. ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. తీపి పదార్థాలను తినే ముందు దీనిని తీసుకుంటే.. జిమ్నెమిక్ ఆమ్లం రుచి మొగ్గలపై చక్కెర గ్రాహకాలను అడ్డుకుంటుంది. ఇది తీపిని రుచి చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తీపి ఆహారాన్ని రుచిపరంగా తక్కువ ఆకర్షణీయంగా చేస్తుందట. జిమ్నెమిక్ ఆమ్లం ప్రేగులలో ఈ గ్రాహకాలను కూడా నిరోధించగలదని, ఇది శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుందని కనుగొంది. దీని కారణంగా, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు లేదా పిల్లలు దీనిని ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యుడిని సంప్రదించకుండా దీనిని ఉపయోగించడం సరైనది కాదని అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు తీసుకుంటున్న వ్యక్తులు ఇలాంటి నివారణలు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని మీరే ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు మందులతో రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఎక్కువగా ఆవలింపులు వచ్చే వారికి ఉండే అసలు సమస్యలు ఇవీ..!
ఆవలింత అనేది మనమందరం అనుభవించే ఒక సాధారణ శారీరక ప్రక్రియ. తరచుగానిద్రపోవడం లేదా అధిక అలసటగా ఉన్నప్పుడు ఆవలింపులు వస్తుంటాయి. కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆవలింపులు తగ్గిపోతాయని అనుకుంటాం. కానీ తరచుగా ఆవలింతలు వస్తుంటే మాత్రం అది నిద్రకు సంబంధించిన సమస్య కానే కాదు అంటున్నారు వైద్యులు. కొన్నిసార్లు ఇది శరీరంలోని ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుందట. ఎవరైనా సాధారణం కంటే ఎక్కువగా ఆవలిస్తున్నారని అనిపిస్తే, తగినంత నిద్ర పోయిన తర్వాత కూడా పదే పదే ఆవలిస్తున్నారని భావిస్తే దానిని లైట్ గా తీసుకోకూడదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే.. మెదడుకు ఆక్సిజన్ లేకపోవడం.. ఆవలింతకు ప్రధాన కారణం మెదడుకు తగినంత ఆక్సిజన్ చేరకపోవడం. శరీరంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు లేదా కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరిగినప్పుడు, మెదడు ఆవలింత ద్వారా ఉష్ణోగ్రతను, ఆక్సిజన్ మొత్తాన్ని నియంత్రిస్తుందట. ఈ పరిస్థితి వేడి, తేమతో కూడిన వాతావరణంలో లేదా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం ద్వారా జరుగుతుందట. లోతైన శ్వాస తీసుకోవడం, స్వచ్ఛమైన గాలిలో నడవడం, వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉండటం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. శారీరక, మానసిక ఒత్తిడి.. ఒత్తిడి, ఆందోళన కూడా తరచుగా ఆవలించడానికి కారణమవుతాయి. మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన శ్వాస ప్రక్రియ సక్రమంగా ఉండదు. ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరాను ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు, ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి యోగా, ధ్యానం మరియు లోతైన శ్వాస వ్యాయామం వంటి పద్దతుల సహాయం తీసుకోవచ్చు మందుల దుష్ప్రభావాలు.. యాంటీ-డిప్రెసెంట్స్, యాంటిహిస్టామైన్లు లేదా నొప్పి నివారణ మందులు వంటి కొన్ని మందులు తరచుగా ఆవలింతకు కారణమవుతాయి. ఈ మందులు మెదడు రసాయనాలను ప్రభావితం చేస్తాయి. ఇవి నిద్ర లేదా మగత అనుభూతికి దారితీస్తాయి. మందులు ఆవలింతను పెంచుతున్నాయని అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది. వైద్యులు మందుల మోతాదును సర్దుబాటు చేయవచ్చు లేదా ప్రత్యామ్నాయ చికిత్సలను సూచించవచ్చు. ఆరోగ్య సమస్యలు.. తరచుగా ఆవలింతలు పడటం వల్ల స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లేదా థైరాయిడ్ సమస్యలు వంటి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. స్లీప్ అప్నియా అధిక నిద్రకు కారణమవుతుంది. రాత్రి నిద్రపోతున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని కారణంగా నిద్ర పూర్తిగా ఉండదు. మరుసటి రోజు చాలా అలసిపోయినట్లు అనిపించవచ్చు. దీని కారణంగా ఆవలింత పగటిపూట పదేపదే రావచ్చు. నార్కోలెప్సీ కూడా నిద్రకు సంబంధించిన సమస్య. ఇందులో, ఒక వ్యక్తి ఎప్పుడైనా, ఎక్కడైనా అకస్మాత్తుగా నిద్రపోవచ్చు. ఈ వ్యాధిలో రోగి పగటిపూట చాలాసార్లు నిద్రపోతాడు. దీని కారణంగా ఎక్కువగా ఆవలిస్తూ ఉంటారు. అలసట, తలనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఆవలింతతో పాటు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreగట్ మైక్రోబయెమ్ అంటే ఏంటి? దీనికి మానసిక స్థితి, రోగనిరోగధక స్థితికి మధ్య ఉన్న సంబంధం ఏంటి?
మన ప్రేగులలో, మన మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించే లెక్కలేనన్ని సూక్ష్మజీవులు మన శరీరంలో ఉంటాయి. 'గట్ మైక్రోబయోమ్' అని పిలువబడే చిన్న బ్యాక్టీరియా, వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవులు జీర్ణక్రియలో పాత్ర పోషిస్తాయి. ఇవి మన మానసిక స్థితి, రోగనిరోధక శక్తితో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన మరియు సమతుల్య గట్ మైక్రోబయోమ్ ఎంత ముఖ్యమో ఎప్పటికప్పుడు పరిశోధనల ద్వారా నిరూపిస్తున్నాయి. కంటికి కనిపించని ఈ జీవులు మన శరీరంలో ముఖ్యమైన విధులను ఎలా నియంత్రిస్తాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. గట్ మైక్రోబయోమ్ అంటే ఏమిటి? గట్ మైక్రోబయోమ్ అనేది మన ప్రేగులలో నివసించే ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవుల సమూహం. ఈ బ్యాక్టీరియా ఆహారాన్ని జీర్ణం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి మరియు హానికరమైన పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోని అనేక విధులను నియంత్రించే వ్యవస్థగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ మంచి మరియు చెడు బ్యాక్టీరియాల సమతుల్యతను కలిగి ఉంటుంది. ఈ గట్ మైక్రోబయోమ్ అసమతుల్యతగా ఉంటే.. జీర్ణ సమస్యలు, ఒత్తిడి లేదా తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది.. గట్ మైక్రోబయోమ్ జీర్ణవ్యవస్థకు ఆధారం. ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరియు పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థలో 70% ని ఇదే నియంత్రిస్తుంది . మంచి బ్యాక్టీరియా హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటం ద్వారా ఇన్ఫెక్షన్‌ను నివారిస్తుంది. మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే అది మలబద్ధకం, విరేచనాలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు కారణమవుతుంది. అందుకే నిపుణులు పెరుగు, పులియబెట్టిన ఆహారం వంటి ప్రోబయోటిక్స్ కలిగిన ఆహారాలను ఆహారంలో చేర్చాలని సూచిస్తుంటారు. ఎందుకంటే అవి గట్ మైక్రోబయోమ్‌ను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మానసిక స్థితి మరియు మానసిక ఆరోగ్యానికి సంబంధం.. గట్ మైక్రోబయోమ్ మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది గట్-మెదడు కు ప్రత్యేకంగా ఒక సిస్టమ్ ద్వారా మెదడుకు అనుసంధానించబడి ఉంటుంది. పేగు బాక్టీరియా సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మానసిక స్థితిని నియంత్రిస్తాయి. మైక్రోబయోమ్ అసమతుల్యంగా ఉంటే ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశకు కారణమవుతుంది. ఫైబర్ మరియు ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారం మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచే మార్గాలు.. గట్ మైక్రోబయోమ్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు గింజలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి . ప్రోబయోటిక్స్ (పెరుగు, మజ్జిగ), ప్రీబయోటిక్స్ (ఉల్లిపాయ, వెల్లుల్లి) మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, యాంటీబయాటిక్‌లను అధికంగా వాడకుండా ఉండాలి. ఎందుకంటే ఇవి మైక్రోబయోమ్‌కు హాని కలిగిస్తాయి. తగినంత నీరు, క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి నిద్ర కూడా పేగు ఆరోగ్యానికి చాలా అవసరం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఇన్సులిన్ తీసుకుంటున్నారా? ఈ 5 తప్పులు చేయకండి..!
డయాబెటిస్ అనేది తీవ్రమైన, పూర్తిగా నయం చేయలేని వ్యాధి. ఇందులో శరీరం రక్తంలో చక్కెరను నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. దీనికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్ లేకపోవడం లేదా దాని పనితీరు సరిగా లేకపోవడం. భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను సకాలంలో నియంత్రించకపోతే, అది శరీరానికి అనేక విధాలుగా హాని కలిగిస్తుంది. ఇది కళ్ళు, మూత్రపిండాలు, నరాలు, గుండె, రక్తపోటు, పాదాల సమస్యలు, లైంగిక సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది డయాబెటిస్‌ను మందులతో కూడా నియంత్రించలేరు. ఇలాంటి వారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి ఉంటుంది. కానీ ఇలా ఇన్సులిన్ తీసుకునే వారు సాధారణంగా చేసే 5 ప్రధాన తప్పులు ఉన్నాయి. ఈ తప్పుల వల్ల ఇన్సులిన్ తీసుకున్నా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గవు. ఇంతకూ ఇన్సులిన్ తీసుకునే వారు చేసే తప్పులేంటంటే.. అర్థం చేసుకోవడంలో పొరపాటు.. చాలా సార్లు రోగులు డాక్టర్ సలహాను సరిగ్గా అర్థం చేసుకోలేరు. చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ ఇన్సులిన్ తీసుకుంటారు. లేదా తప్పు సమయంలో ఇంజెక్ట్ చేస్తారు. దీనిని నివారించడానికి సులభమైన మార్గం డాక్టర్ ఇచ్చిన మోతాదు, సమయాన్ని పాటించడం. గ్లూకోజ్ మానిటర్‌తో చక్కెరను తనిఖీ చేస్తూ ఉండాలి . స్టోర్ చేయడంలో తప్పులు.. ఇన్సులిన్‌ను తీవ్రమైన వేడిలో లేదా చల్లగా ఉంచినా, లేదా గడువు తేదీ తర్వాత ఉపయోగించినా, దాని ప్రభావం తగ్గుతుంది. దీన్ని చేయడానికి ఉత్తమ మార్గం మూసి ఉన్న సీసాను రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం. తెరిచి ఉన్న సీసాను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద (25°C కంటే తక్కువ) 30 రోజుల వరకు ఉంచవచ్చు. ఇన్సులిన్‌ను ఎప్పుడూ ఫ్రీజ్ చేయకూడదు. లేదా చాలా వేడి ప్రదేశంలో ఉంచకూడదు. ఎక్స్‌పైరీ డేట్.. ఇన్సులిన్ కొనుగోలు చేసేటప్పుడు దాని గడువు తేదీని తనిఖీ చేయడం ముఖ్యం. చాలా సార్లు దాని తేదీని తనిఖీ చేయకుండా ఇన్సులిన్ కొని దాన్ని ఉపయోగిస్తారు. గడువు తేదీని తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇన్సులిన్ కొనాలి. ఇన్సులిన్ తెరిచిన 30 రోజుల్లోపు దాన్ని ఉపయోగించండి. సిరంజి రకం.. తప్పుడు రకం సిరంజితో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల అధిక లేదా తగినంత మోతాదు తీసుకోకపోవచ్చు. ఈ తప్పు చేస్తుంటే వెంటనే దాన్ని ఆపాలి. దీన్ని నివారించడానికి, 40 IU/ml ఇన్సులిన్ కోసం ఎరుపు రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. 100 IU/ml ఇన్సులిన్ కోసం నారింజ రంగు క్యాప్ ఉన్న సిరంజిని ఉపయోగించాలి. వైద్యుడి సలహాతో సరైన సిరంజిని ఎంచుకోవాలి. ఒకే ప్రదేశంలో ఇంజెక్షన్.. ఇన్సులిన్ ఒకే చోట పదే పదే ఇంజెక్ట్ చేస్తే, అక్కడ గడ్డలు లేదా గుంటలు (లిపోడిస్ట్రోఫీ) ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీనిని నివారించడానికి, ప్రతిసారీ ఇంజెక్షన్ సైట్‌ను మార్చాలి. ఉదాహరణకు కడుపు, తొడ, చేయి లేదా తుంటిపై. అంతకు ముందు ఇంజెక్షన్ చేసిన స్థానం నుండి కనీసం 1 సెం.మీ దూరంలో ఇంజెక్ట్ చేయాలి. గుర్తుంచుకోవలసిన విషయం.. ఇన్సులిన్ ఒక ముఖ్యమైన ఔషధం. కానీ దాని సరైన ఉపయోగం మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది. పైన పేర్కొన్న తప్పులను నివారిస్తూ, ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు ఇన్సులిన్ తీసుకోవాలి. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో, తీవ్రమైన సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreశరీరంలో ఈ 5 ప్రాంతాలలో నొప్పి అనిపిస్తే.. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టే..!
అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అధిక మోతాదు గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొవ్వు పదార్థం, ఇది వివిధ శారీరక విధులకు అవసరం. ఇది కొన్ని ఆహారాలలో కూడా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు: LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - దీనిని "చెడు" కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - "మంచి" కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది రక్తప్రవాహం నుండి అదనపు LDL ను తొలగించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అధిక మద్యం సేవించడం వంటివి అధిక చెడు కొలెస్ట్రాల్ కు కారణం. పెద్దలు 20 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కు కారణమేమిటి? అధిక కొలెస్ట్రాల్‌కు అనేక కారణాలు ఉన్నాయి.. సంతృప్త, ట్రాన్స్ కొవ్వులు (ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం. శారీరక శ్రమ లేకపోవడం అధిక శరీర బరువు. ధూమపానం, మద్యం వినియోగం జన్యుశాస్త్రం (కొంతమందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వారసత్వంగా వస్తాయి) అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారికి, జీవనశైలి మార్పులు మాత్రమే దానిని నియంత్రించడానికి సరిపోకపోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ పెరిగితే, అది రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది. శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి. చర్మంపై పసుపు రంగు మచ్చలు.. అధిక కొలెస్ట్రాల్ మొట్టమొదటి కనిపించే సంకేతాలలో ఒకటి పసుపు రంగు కొవ్వు నిల్వలు లేదా చర్మంపై, ముఖ్యంగా కళ్ళు, మోచేతులు మరియు మోకాళ్ల చుట్టూ గడ్డలు. వీటిని జాంతోమాస్ అని పిలుస్తారు. రక్తంలో అదనపు కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి.. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది, దీని వలన చేతులు, కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు లేదా సూదులు గుచ్చిన అనుభూతి కలుగుతుంది. చికిత్స చేయకపోతే ఇది నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు, పిత్తాశయ రాళ్లు.. అధిక కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది. పిత్తాశయ సమస్యలకు దారితీస్తుంది. పిత్తంలో అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయ రాళ్లకు కారణమవుతుంది. ఇది ఉదరం కుడి ఎగువ భాగంలో నొప్పి, వికారం, అజీర్ణానికి దారితీస్తుంది. ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం.. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన ఛాతీ నొప్పి (ఆంజినా), శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. తిమ్మిరి, మాట్లాడటంలో ఇబ్బంది.. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే, అది స్ట్రోక్‌కు దారితీస్తుంది. ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది, సమతుల్యత కోల్పోవడం వంటివి దీని లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తరచుగా సమస్యలు తలెత్తే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఈ టిప్స్ పాటిస్తే చాలు.. హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి..!
ఆరోగ్యంగా ఉండటానికి సంతోషంగా, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం చాలామంది తమకు ఇష్టమైన కార్యకలాపాలు చేయడానికి, తమకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి, సంగీతం వినడానికి, ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. కానీ ప్రతి ఒక్కరి ఆనందంలో హార్మోన్లు పెద్ద పాత్ర పోషిస్తాయని చాలామందికి తెలియదు. మన శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు విడుదలవుతాయి. వీటిని హ్యాపీ హార్మోన్స్ అంటారు. ఇవి వ్యక్తిని సానుకూలంగా, సంతోషకరమైన మూడ్‌లో ఉంచడానికి బ్యాలెన్స్డ్ గా ఉండటం చాలా ముఖ్యం. సంతోషకరమైన హార్మోన్లు ప్రధానంగా మెదడు, శరీరంలోని వివిధ భాగాలు (పిట్యూటరీ గ్రంథి, హైపోథాలమస్ మరియు న్యూరాన్లు) ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే, అది ఆ వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల విచారం, ఆందోళన, ఒత్తిడిని వంటివి అనుభవించవచ్చు. కానీ ఈ హార్మోన్లను కొన్ని విధాలుగా పెంచవచ్చు. ఇది ఆందోళనను తగ్గిస్తుంది, సంతోషంగా, ఒత్తిడి లేకుండా చేస్తుంది. సంతోషకరమైన హార్మోన్లను మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు అని కూడా అంటారు. అవి సంతోషకరమైన, ఉత్సాహభరితమైన భావాలను ఉత్పత్తి చేయడానికి పనిచేస్తాయి. వాటిలో ప్రధానంగా నాలుగు రకాలు ఉన్నాయి. డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్. హ్యాపీ హార్మోన్స్ పెంచే మార్గాలు.. వ్యాయామం.. వ్యాయామం చేయడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి విని ఉంటారు. కానీ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల, ముఖ్యంగా పరుగు వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది. సంగీతం.. సంగీతం వినడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా నిరూపించబడింది. సంగీతం శరీరంలో డోపమైన్‌ను పెంచడానికి కూడా పనిచేస్తుంది. ఈ హార్మోన్ ఆనందం, ప్రతిఫల భావనలలో పాత్ర పోషిస్తుంది. బయటకు వెళ్లడం.. శరీరంలో సెరోటోనిన్ హార్మోన్ పెంచుకోవాలనుకుంటే, బయటకు వెళ్లి కొంత ఎండలో ఉండాలి. సెరోటోనిన్ మానసిక స్థితిని నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీనిని "హ్యాపీ కెమికల్" అని కూడా పిలుస్తారు. ఫిజికల్ అఫెక్షన్.. శారీరక అనురాగం, కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివి శరీరంలో ఆక్సిటోసిన్‌ను పెంచుతాయి. ఇది సంతోషకరమైన హార్మోన్. దీనిని "ప్రేమ హార్మోన్" లేదా "బంధన హార్మోన్" అని కూడా పిలుస్తారు. సానుకూల సంబంధాలు, ప్రేమ శరీరంలో కార్టిసాల్ స్థాయిలను (ఒత్తిడి హార్మోన్) కూడా తగ్గిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవర్షాకాలం మొదలవుతున్న సమయంలో ఏ పండ్లు ఆరోగ్యానికి మంచివి?
వర్షాకాలం (Monsoon season)లో మన శరీర రోగ నిరోధక శక్తి కొంత తగ్గుతుంది. అలాగని పండ్లు తినడం మానేయడం కాదు. సరిగ్గా ఎంచుకుని తినడం చాలా ముఖ్యం. ఈ కాలంలో కొన్ని పండ్లు ప్రత్యేకంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి, అలాగే కొన్ని జాగ్రత్తలతో తినాలి. ఇప్పుడు వాటిని వివరంగా చూద్దాం. వర్షాకాలానికి అనుకూలమైన పండ్లు: యాపిల్ (Apple) లాభాలు: శరీరానికి ఫైబర్, విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. అయితే యాపిల్స్ ను శుభ్రంగా కడిగి తినాలి. పియర్.. (Pear) శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు, శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పియర్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. అరటిపండు (Banana) అరటిపండ్లు అందరికీ చాలా సులవుగా తక్కువ ధరలో దొరుకుతాయి. పైగా అన్ని వయసుల వారు తినదగిన పండు ఇది. అరటిపండు జీర్ణ సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. అరటిపండు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఇతర పళ్లతో కలిపి కాకుండా తినడం మంచిది. ఆరంజ్ (Orange) ఆరెంజ్ లేదా నారింజ పండులో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. సీజన్ మారుతున్న కాలంలో నారింజ తినడం మంచిదే కానీ.. వర్షాకాలంలో వీటిని పూర్తిగా శుభ్రంగా కడిగి తినాలి. ద్రాక్ష (Grapes) ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ద్రాక్ష పండ్లు తింటే శరీరం లోపల శుద్ది అవుతుంది. అయితే ద్రాక్షలో ధూళి, ఫంగస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వీటిని మంచి నీటితో బాగా కడిగి తినాలి. అనాసపండు (Pineapple) అనాస పండు రుచిలోనూ, వాసనలోనూ అందరినీ కట్టిపడేస్తుంది. ఈ సీజన్ మార్పులో అనాసపండు తీసుకుంటే శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వర్షాకాలంలో చల్లని వాతావరణం వల్ల ఎదురయ్యే కఫం, మలబద్ధకం వంటి సమస్యల నివారణకు మంచిది. తక్కువగా మగ్గిన మామిడిపండ్లు (Semi-ripe Mangoes) వర్షాకాలం ప్రారంభమయ్యి సీజన్ మారుతున్న కాలంలో అక్కడక్కడా ఇంకా మామిడి పండ్లు దొరుకుతూ ఉంటాయి. అయితే జాగ్రత్త, వర్షాల కారణంగా మామిడిపండ్లలో పురుగులు ఉంటాయి. అందుకే తక్కువగా మగ్గిన మామిడి పండ్లు తీసుకోవాలి. వీటిలో విటమిన్ A & C సమృద్ధిగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అయితే తక్కువగా మగ్గినవి అయినా ఎక్కువగా తింటే మంట, అజీర్ణం కలగవచ్చు. అందుకే మితంగా తినాలి. వర్షాకాలంలో ఏ పండ్లను జాగ్రత్తగా తినాలి? జామకాయ (Guava).. జామకాయలను బాగా కడిగి తినాలి. ఎందుకంటే వీటిలో ఫంగస్ ఉండే ప్రమాదం ఎక్కువ. నల్ల ద్రాక్ష (Black grapes).. నల్ల ద్రాక్ష చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండేదే.. అయితే వీటి శుభ్రతపై ఫోకస్ చేయాలి. శుభ్రంగా లేకుంటే అస్సలు తినకండి. నేరేడు (Jamun).. నేరేడు పండ్లు ఈ కాలంలో విరివిగా దొరుకుతాయి. అయితే ఇవి కొంతమందికి అలర్జీ కలిగించొచ్చు. అందుకే జాగ్రత్త తీసుకోవాలి పండ్లను తినేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు.. శుభ్రత: పండ్లను మంచి నీటితో బాగా కడగాలి. కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తినకూడదు. తాజాగా తినాలి: బయట నిల్వపెట్టిన పండ్లు ఫంగస్ పట్టే ప్రమాదం ఎక్కువ. అందులోనూ ఈ వర్షాకాలంలో మరీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మితంగా తినాలి: ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా మితంగా తనాలి. రాత్రి పూట జాగ్రత్త: పండ్లు ఎక్కువగా జీర్ణం కావాలంటే ఉదయం లేదా మద్యాహ్నం తినడం ఉత్తమం. రాత్రిపూట తింటే ఇవి జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలం అంటే జలుబు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉండే కాలం. అందుకే విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు తీసుకోవడం ద్వారా రోగ నిరోధకత పెరిగి ఆరోగ్యంగా ఉండవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreజిమ్ లేదా యోగ.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
జిమ్, యోగా రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వ్యాయామ పద్ధతులే. అయితే ఆరోగ్య లక్ష్యాలు , జీవనశైలి , శారీరక పరిస్థితి, మానసిక స్థితిని బట్టి ఏది బెస్ట్ అనే విషయంలో మార్పు ఉంటుంది. అంతేకాదు ఈ రెండింటి మధ్య తేడాలు ఉండటం వల్ల వీటి వల్ల లభించే ఫలితాల్లో కూడా తేడాలు ఉంటాయి. ఈ రెండు మధ్య తేడాలు, ఉపయోగాలు తెలుసుకుంటే.. జిమ్ (Gym) — లాభాలు: బలవర్ధక వ్యాయామం (Strength training): జిమ్‌లో వెయిట్లు, మిషన్లు వాడడం వల్ల కండరాలు (muscles) బలంగా తయారవుతాయి. శరీరాన్ని షేప్‌లోకి తేగలగడం (Body toning): శరీరంలో ఏదైనా ప్రాంతంలో కొవ్వు పేరుకుని ఉంటే.. ఆ ప్రాంతానికి సంబంధించి జిమ్ లో వ్యాయామాలు చేయడం ద్వారా కొవ్వు కరిగించి ఫిట్ బాడీని పొందవచ్చు. వెయిట్ లాస్ / వెయిట్ గెయిన్ (Weight control): బరువు ఎక్కువ ఉన్నవారు మాత్రమే జిమ్ కు వెళతారు అంటే అది పొరపాటు. జిమ్ చేయడం వల్ల బరువు పెరగవచ్చు కూడా. దీనికి తగిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఫిట్‌నెస్ నిపుణులు కూడా సజెస్ట్ చేస్తారు. దీని వల్ల ఆరోగ్యకరంగా బరువు తగ్గడం, లేదా పెరగడం చేయవచ్చు. ఎనర్జీ స్థాయి పెరుగుతుంది: జిమ్ కు వెళ్లడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. దీనివల్ల రోజువారీ జీవితం energetic గా ఉంటుంది. కార్డియో ఎక్సర్సైజులు (Cardio workouts): కార్డియో ఎక్సర్సైజులు గుండెకు చాలా మంచివి. జిమ్ లో చాలామంది చేసే ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండెను దృఢంగా మారుస్తాయి. యోగా (Yoga) — లాభాలు: మానసిక ప్రశాంతత (Mental peace): యోగా అంటే కేవలం శరీరానికి సంబంధించినది కాదు.. ఇది మనసుకు కూడా సంబంధించినది. కాబట్టి యోగా వల్ల మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. శ్వాస, చైతన్యం పెరుగుతుంది (Improved breathing & awareness): యోగాలో ధ్యానం, ప్రాణాయామం ముఖ్యమైనవి. ప్రాణాయామంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇవి lungs పనితీరును మెరుగుపరుస్తాయి. శరీర సౌలభ్యం (Flexibility): యోగాలో వివిధ ఆసనాలు, భంగిమలు ఉంటాయి. వీటి వల్ల శరీరంలో అన్ని ప్రాంతాలలోసాధారణంగా అందరూ చేసే వ్యాయామాలకంటే ఎక్కువగా బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్: యోగా వల్ల శరీరంలో గ్రంథుల పనితీరు మెరుగవుతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గి హార్మోన్లు సక్రమంగా విడుదల అవుతాయి. ఇది శరీర వ్యవస్థలను సవ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, నాడీవ్యవస్థ మొదలైన వాటికి మేలు చేస్తుంది. ఎవరికి ఏది బెటర్? వ్యక్తి లక్ష్యాన్ని బట్టి సరైన ఎంపిక.. దానికి గల కారణం.. బరువు తగ్గాలనుకునే వారు జిమ్ లేదా యోగా + డైట్ చేయడం మంచిది. అయితే జిమ్ వేగంగా ఫలితం ఇస్తుంది. యోగా మెల్లగా ఫలితాన్ని ఇస్తుంది. కానీ దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అనుకునేవారు యోగా మెడిటేషన్, ప్రాణాయామం చేయాలి. ఇవి మానసిక శాంతిని ఇస్తాయి. కండరాలు పెంచుకోవాలి అనుకునేవారికి జిమ్ బెటర్. ఎందుకంటే జిమ్ లో వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇది కండరాలు పెరగడానికి అవసరం. ఫ్లెక్సిబిలిటీ, అంతర్గత ఆరోగ్యం కోసం యోగా చేయాలి. నాడీవ్యూహం, శ్వాస వ్యవస్థ పైన యోగా ప్రభావితంగా ఉంటుంది. అందుకే యోగాఎంపిక మేలు. టైమ్ తక్కువగా ఉంటే జిమ్ కు వెళ్లడం కుదరదు. కాబట్టి అలాంటి వారికి యోగా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యోగాను ఇంట్లో కూడా 20-30 నిమిషాలు చేయవచ్చు. మోటివేషన్ తగ్గిపోతుంటే ఇంట్లో జిమ్ అయినా, యోగా అయినా చేయలేం. అందుకే జిమ్ లో ట్రైనర్, యోగా క్లాసులలో యోగా టీచర్ ఇంకా ఇతర అభ్యాసకులు ఉంటారు. కాబట్టి ఉత్సాహంగా ముందుకు వెళ్లవచ్చు. మిక్స్ చేయడం బెస్ట్.. అవకాశం ఉంటే వారంలో 3 రోజులు జిమ్ + 2 రోజులు యోగా చేయడం ఉత్తమ మార్గం. ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ బ్యాలన్సు అన్నీ కలుగుతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreచపాతీని ఇలా వండితే చాలా డేంజర్ అంట..!
చపాతీలు ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా గోధుమ పిండితో తయారు చేసే చపాతీలు చాలామంది డైట్ లో ఉంటాయి. అధిక శాతం మంది రాత్రి ఆహారంలో అన్నానికి బదులు చపాతీలు తింటారు. ముఖ్యంగా ఆరోగ్యం మీద స్పృహతో నూనె వేయకుండా చపాతీలు చేసే చపాతీలకు ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఎక్కువ శాతం మంది ఉంటున్నారు. ఇలా నూనె వేయకుండా చేసే చపాతీలను కొన్ని సెకెండ్లు పెనం మీద వేయించి ఆ తరువాత నేరుగా గ్యాస్ స్టవ్ మంట పైన పెడుతుంటారు. ఈ మంటకు చపాతీలు పొంగుతాయి. ఇవి బాగా మెత్తగా, నూనె లేకుండా ఉంటాయి కాబట్టి చాలా ఆరోగ్యం అనుకుంటారు. అయితే ఇలా చేసే చపాతీలు ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. అధిక ఉష్ణోగ్రతల వద్ద చపాతీని వండటం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే HCA (హెటెరోసైక్లిక్ అమైన్స్), PAH (పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్) వంటి కొన్ని హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. సహజ వాయువు పొయ్యిలు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, WHO ప్రమాణాలను మించిన సూక్ష్మ కణాలు వంటి ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఈ వాయువులు శ్వాసకోశ వ్యాధులు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలతో ముడిపడి ఉండవచ్చని వైద్యులు, పరిశోధనలు చెబుతున్నాయి. క్యాన్సర్ ప్రమాదం.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వంట చేయడం వల్ల క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి చపాతీలను నేరుగా గ్యాస్ మంట మీద వండటం కూడా ప్రమాదకరం అనే సందేహం చాలామందిలో ఉంది. నిపుణుల మాట.. నేరుగా మంట మీద వంట చేయడం వల్ల క్యాన్సర్‌కు నేరుగా సంబంధం ఉండదని కొందరు అంటున్నారు. అయితే ఇలా వంట చేయడం, నేరుగా చపాతీలు గ్యాస్ స్టవ్ పైన కాల్చడం వల్ల ఖచ్చితంగా కొన్ని రసాయనాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా శరీరంలో DNA దెబ్బ తింటుంది. కానీ శరీరం తనను తాను నయం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఎవరైనా అలాంటి ఆహారాన్ని అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కానీ.. ఎక్కువగా అదే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మాత్రం ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మంచి మార్గం ఏదంటే.. పోషకాహార నిపుణురాలు, డైటీషియన్ల ప్రకారం.. 'HCA, PAH, అక్రిలామైడ్ వంటి రసాయనాలు ముఖ్యంగా స్టార్చ్, మాంసం వండినప్పుడు ఏర్పడతాయి. అవి క్యాన్సర్‌తో నేరుగా సంబంధం కలిగి ఉండవు. కానీ ముందుజాగ్రత్తగా బొగ్గు లేదా ఓపెన్ స్టవ్‌పై వండకుండా ఉండటం మంచిదట. గతంలో చపాతీని ఒక గుడ్డ సహాయంతో పాన్‌పై నొక్కుతూ తక్కువ మంటపై నూనె వేయకుండా వండేవారు, తద్వారా అది అన్ని వైపుల నుండి సరిగ్గా ఉడికిపోతుంది. గ్యాస్ మంట మీద నేరుగా కాలదు కూడా. కానీ ఇప్పుడు చపాతీలను నేరుగా మంటపై కాల్చే అలవాటు చాలా చోట్ల పెరిగింది. దీని వల్ల సమయం ఆదా అవుతుందని అనుకుంటారు కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. అందుకే చపాతీలను ఎల్లప్పుడూ పాన్ మీద కాల్చడమే మంచిదట. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనిపుణుల సలహా లేకుండా ఈ 5 రకాల వ్యక్తులు యోగా అస్సలు చేయకూడదు..!
ఆరోగ్యకరమైన జీవితానికి, దీర్ఘాయువుకు యోగా కీలకం. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ యోగా చేయాలని సిఫార్సు చేస్తున్నారు. ఇది మాత్రమే కాదు, యోగా ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పడం, దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం అనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. సాధారణంగా యోగా అందరికీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది, కానీ కొంతమందికి యోగా హానికరం కూడా కావచ్చు. మీరు విన్నది నిజమే. యోగా చేయడం కొంతమందికి హానికరం. యోగా చేయకూడదని చెప్పిన వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల గురించి మీకు తెలుసుకుంటే.. అధిక రక్తపోటు లేదా గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు.. సాధరణంగా, యోగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. అయితే, భుజం నిలబడటం, తల నిలబడటం లేదా వెనుకకు ఎక్కువగా వంగడం వంటి కొన్ని యోగా భంగిమలు రక్త ప్రవాహాన్ని తిప్పికొట్టగలవు. ఛాతీపై ఒత్తిడి కారణంగా రక్తపోటును పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో, కూర్చునే భంగిమలు, ముందుకు వంగడం, నెమ్మదిగా శ్వాస తీసుకునే వ్యాయామాలు గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. తలతిరుగుడు లేదా సమతుల్య రుగ్మతలు ఉన్న వ్యక్తులు.. యోగా చేయడం వల్ల సమతుల్యత మెరుగుపడుతుంది, శరీర కోర్ బలపడుతుంది, కానీ మీకు ఏదైనా వ్యాధి, తల తిరగడం లేదా నాడీ అసమతుల్యతకు సంబంధించిన ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే, వాటిని చేసే ముందు కొన్ని యోగా ఆసనాలు చేయకుండా ఉండాలి. ఈ ఆసనాలలో వృక్ష భంగిమ, డేగ లేదా నిలబడి ఉన్న భంగిమలు మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ అలాంటి వారికి యోగా ఇప్పటికీ ఉపయోగకరంగా ఉంటుంది. కానీ దీని కోసం వారు సరైన యోగా ఆసనాలు చేయాలి. గర్భిణీ స్త్రీలు (ముఖ్యంగా మొదటి , చివరి త్రైమాసికంలో ఉన్నవారు).. తరచుగా గర్భిణీ స్త్రీలు ప్రసవాన్ని సులభతరం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి యోగా చేయమని సలహా ఇస్తారు. అయితే ఈ సమయంలో యోగా చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. అందువల్ల గర్భధారణ సమయంలో ట్విస్ట్‌లు, బ్యాక్‌బెండ్‌లు వంటి భంగిమలు ఎక్కువ హాని కలిగిస్తాయి . మొదటి త్రైమాసికంలో, అధిక తీవ్రత గల భంగిమలు ఆకస్మిక ఒత్తిడి లేదా పడిపోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది మూడవ త్రైమాసికంలో కూడా హాని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో, గర్భధారణ సమయంలో యోగా చేసే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వెన్నెముక లేదా డిస్క్ సమస్యలు ఉన్న వ్యక్తులు.. యోగా వెన్నునొప్పిని నయం చేస్తుంది, కానీ ఇది వెన్నెముక లేదా డిస్క్ సమస్యలతో బాధపడేవారికి హాని కలిగిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత హెర్నియేటెడ్ డిస్క్, సయాటికా లేదా వెన్నెముక సమస్యలతో బాధపడేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో వీల్ పోజ్, కోబ్రా లేదా నాగలి పోజ్ వంటి ఆసనాలు చేయకుండా ఉండండి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreయోగాలో శక్తివంతమైన ఆసనాలు ఏవంటే..!
యోగ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉంటాయి. వాటిలో కొన్ని చాలా శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. యోగాలో శక్తివంతమైన (Powerful) ఆసనాలు శరీరానికి శక్తిని, స్థిరతను, సౌష్టవాన్ని, ధైర్యాన్ని ఇచ్చే ఆసనాలు. ఇవి శారీరకంగా గట్టిగా ఉండటంతో పాటు మానసిక శాంతిని కూడా అందిస్తాయి. ఇవి శక్తి, సహనం, స్తైర్యం, ఫోకస్, ప్రాణశక్తి పెంచే విధంగా పనిచేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాసనాలు ఏవో తెలుసుకుంటే.. శక్తివంతమైన యోగాసనాలు.. వీరభద్రాసనాలు.. వీరభద్రాసనాలలో మూడు రకాలు ఉన్నాయి. ఇవి వేస్తుంటే శరీరానికి ధైర్యం, స్థైర్యం కలుగుతుంది. కాళ్ళు, చేతులు, వెన్నెముక బలపడతాయి. మనస్సు కేంద్రీకృతం అవుతుంది. నౌకాసన (Boat Pose).. నౌకాసనం వస్తుంటే శరీరంలో మధ్య భాగం (core) శక్తివంతంగా తయారవుతుంది. అబ్డోమినల్ మసిల్స్, స్పైన్ బలపడతాయి. మానసిక దృఢత పెరుగుతుంది. బకాసన (Crow Pose).. బలమైన చేతులు, మోకాలుకు సపోర్ట్ కావాలంటే బకాసన వేయడం చాలా మంచిది. ఈ ఆసనం వేయడం వల్ల ఫోకస్, సమతుల్యత అభివృద్ధి చేస్తుంది. ధైర్యాన్ని పెంచుతుంది. ఉర్ధ్వ ధనురాసనం (Upward Bow or Wheel Pose).. ఊర్థ్వ ధనురాసనం వేస్తే వెన్నెముక, గుండె, ఛాతీ తెరుచుకుంటాయి. ఇది శక్తిని పంచుతుంది, ఉత్సాహం పెంచుతుంది. పరివ్రుత్త పర్వతాసన (Revolved Triangle Pose ) పరివృత్త పర్వతాసన వేయడం ద్వారా శరీరానికి లవణత (flexibility), బలం ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయం చేస్తుంది. అధో ముఖ శ్వానాసన (Downward Facing Dog).. అధోముఖ శ్వానాస వేయడం వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ప్రభావం పడుతుంది. ఇది శక్తిని పునరుత్తేజితం చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చతురంగ దండాసన (Low Plank).. చేతులు, భుజాలు, మధ్య భాగం బలంగా తయారవుతాయి. శక్తిని కేంద్రీకరించేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రాణాయామం తో కలిపితే.. శక్తివంతమైన ఆసనాలకు ప్రాణాయామం (విశేషంగా కపాలభాతి, బస్ట్రికా) తోడైతే శక్తి స్థాయి మరింత పెరుగుతుంది. సూచనలు: ఆసనాలు సాధన చేయడానికి ముందుగా మైల్డ్ వార్మప్ చేయాలి. శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యం. మొదట్లో శిక్షణ పొందిన గురువు సూచనతో చేయడం ఉత్తమం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreకిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదు?
కిడ్నీలో రాళ్ల సమస్య చాలా మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. ఇవి సాధారణంగా యూరిన్‌లో ఉండే ఖనిజాలు, లవణాలు కలిసి కఠిన పదార్థాలుగా ఏర్పడటం వల్ల ఏర్పడతాయి. ఈ రాళ్ల రకాన్ని బట్టి (క్యాల్షియం ఆక్సలేట్, యూరిక్ ఆసిడ్, స్ట్రవైట్, సిస్టైన్ రాళ్లు) ఆహార నియమాలు మారవచ్చు. అయితే సాధారణంగా తీసుకోవాల్సిన, నివారించాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. తినాల్సినవి .. నీరు (Water) కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు రోజుకు 3-4 లీటర్లు నీరు తాగాలి. అధిక యూరిన్ ఉత్పత్తి ద్వారా రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. అందుకే కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు నీరు బాగా తాగాలని వైద్యులు కూడా చెబుతారు. పళ్లు (Fruits): నిమ్మకాయ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు బాగా తీసుకోవాలి. ఇవి సిట్రేట్ అనే పదార్థాన్ని ఇచ్చి రాళ్ల ఏర్పాటును అడ్డుకుంటాయి. అలాగే నీరు ఎక్కువగా ఉండే పళ్లు కర్భూజ, పుచ్చకాయ వంటివి కూడా చాలా మంచిది. కూరగాయలు.. తక్కువ ఆక్సలేట్ కలిగిన కూరగాయలైన దొండకాయ, దోసకాయ, బీరకాయ, కొబ్బరికాయ మొదలైనవి తీసుకోవడం మంచిది. ఆకుకూరలలో తోటకూర బాగా తినాలి కానీ ఎక్కువగా తినకూడదు. ధాన్యాలు.. బ్రౌన్ రైస్, గోదుమ రొట్టెలు, రాగి, జొన్న వంటి ఫైబర్ సమృద్ధిగా ఉండే ధాన్యాలు మంచివి. తక్కువగా తీసుకోవాల్సినవి.. తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు, పెరుగు.. తీసుకోవాలి. ముఖ్యంగా క్యాల్షియం బాగా తీసుకుంటే క్యాల్షియం ఆక్సలేట్ కారణంగా రాళ్లు తగ్గే అవకాశం ఉంటుంది. తినకూడని/నివారించాల్సినవి .. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు అయిన మెంతి, బీట్రూట్ , పాలకూర, శనగలు, మామిడికాయలు తీసుకోకూడదు. అలాగే నాచురల్ ఆక్సలేట్ అధికంగా ఉండే పళ్ళు, కూరగాయలకు దూరంగా ఉండటం మంచిది చెక్కెర, ఉప్పు: అధిక మోతాదులో సాధారణ ఉప్పు తీసుకుంటే అది కిడ్నీలో రాళ్లను ప్రోత్సహిస్తుంది. తీపి పదార్థాలు కూడా నివారించాలి. ముఖ్యంగా సోడాలు, క్యాండీలు, కేకులు మొదలైన తీపి ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసాహారం .. ఎక్కువ మోతాదులో మటన్, చికెన్, ఎగ్స్ తీసుకోవడం వలన యూరిక్ ఆసిడ్ స్థాయి పెరుగుతుంది. అలాగే మాంసాహారం వండటానికి ఉపయోగించే మసాలా దినుసులు తగ్గించాలి. సాఫ్ట్ డ్రింక్స్.. కోలా, సోడా, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ఫాస్ఫేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను ప్రోత్సహిస్తాయి. విటమిన్ C అధిక మోతాదు.. రోజు 500 mg కంటే ఎక్కువగా విటమిన్-సి ని తీసుకోవడం వల్ల ఆక్సలేట్ స్థాయిని పెరుగుతుంది. ఇతర చిట్కాలు.. మూత్రాన్ని నిర్ధారంగా రోజుకి 2 లీటర్లకు పైగా ఉత్పత్తి అయ్యేలా చూసుకోవాలి. ఆహారం బట్టే రాళ్ల రకాన్ని గుర్తించి ఆహార నియమాలు మార్చుకోవడం అవసరం. ఉదాహరణకు: క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉంటే ఆక్సలేట్ తగ్గించాలి. యూరిక్ ఆసిడ్ రాళ్లు ఉంటే ప్యూరిన్స్ తగ్గించాలి. మాంసం, కప్పు టీలో ఉండే పదార్థాలు యూరిక్ ఆసిడ్ రాళ్లకు కారణం అవుతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more


.webp)





.webp)
.webp)
.webp)





.webp)
.webp)
.webp)

.webp)

