సోయాతో ఆరోగ్య లాభాలు!
సోయాతో ఆరోగ్య లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు . సోయా శాఖాహారం తీసుకునే వారికి ప్రోటీన్ లా ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో పూర్తి పోషక ఆహారాన్ని అందించేది సోయా అని చెప్పవచ్చు. సోయా గింజలు లేదా చిక్కుళ్ళు తినడానికి చాలా గట్టిగా ఉంటాయి . అయితే అది మీ శరీరానికి ఇంధనం లా పని చేస్తుంది మీరు శాఖా హారులైతే మీరు క్రీడాకారులు , శరీర వ్యాయామం చేసేవారు అయితే సోయాబీన్ తినడం వల్ల చాలా చురుకుగా ఉంటారు. ప్లాంట్ ప్రోటీన్ గా చాలా ఉపయోగ పడుతుంది.మీకు తెలియని అసలు రహాస్యం ఏమిటి అంటేసోయాలో 9 రకాల ఇమ్యునో యాసిడ్స్ ఉన్నాయి .మీశారీరానికి ఆరోగ్యవంత మైన ఎముకలు కండరాలు కావాలంటే 9 రకాల ఎమ్యునో యాసిడ్లు ఉంటాయి. అయితే వాటిని మనం స్వయంగా తయారు చేయడం కష్టం. చాలామంది మాంసాహారము తీసుకుంటారు. గుండెకు ఆరోగ్యవంత మైన ఆహారం... సోయాలో 1 ౦ నుంచి 1 5% కొవ్వు పదార్ధాలు ఉన్నాయి.సోయా బీన్ సాచురేటేడ్ ఆయిల్ గా వాడతారు ఇతర కొవ్వు పదార్ధాలు అంటే బీఫ్ ఫోర్క్ పండి మాంసం, లో కొవ్వు పదార్ధాలు ఉంటాయి.అవి మనకు ఘన పదార్ధంగా మారి మీ గుండెకు తీవ్త ఇబ్బందులు కలిగిస్తాయి .మాంసాహారానికి బదులు సోయాను వాడడం ద్వారా సర్వదా శ్రేయస్కరం అంటున్నారు న్యూట్రిషియనిష్టలు. సోయాలో మంచి కొవ్వు పదార్ధాలు... చాలా రకాల కొవ్వు ఆదర్దాలు ఉండవచ్చుకాని సోయాబీన్ ఒక్కటి. సేచురేషన్ లేని డి ఒమేగా 6 ఒమేగా 3 లో కొవ్వు పదర్దాలు మనం తినే సమతౌల్య ఆహారంలో ఉంటాయి.అది మన గుండెకే కాదు ఇతర అనారోగ్య సమస్యలకు రాకుండా కాపాడే శక్తి సోయాకు ఉందని అంటున్నారు.పల్లీ లు , విత్తనాలు, చేపలు , కాయగూరలు. లో వచ్చే నూనెలలో ఎక్కువ కోలస్ట్రాల్ల్ ఉంటె ౦ % కొలస్ట్రాల్ ఉండేది కేవలం సోయాలోనే,ఇతర కాయ గూరలు , పప్పుదినుసులు, కన్నా సోయా ఆహారం సహజంగా కొలస్ట్రాల్, ఉండదు. చాలా పరిసోధనల అనంతరం సోయా ప్రోటీన్ ను చేర్చడం ద్వారా మీ శరీరం లో 4 % 6% చెడు కోలస్ట్రాల్ల్ ధరకే రాదు మీ ఆహారంలో సోయా బీన్ లో ఒక కప్పులో 1 ౦ % పీచు పదార్ధం ఉంటుంది. మాంసాహారం నుంచి వచ్చే కొవ్వు పదార్ధాల కన్నా కోడి మాంసం , చేపలు , కన్నా సోయాలో ఎక్కువపీచు పదార్ధం వల్ల కొలస్స్త్రాల్ లేని ఆహారంగా తీసుకోవచ్చు. పొటాషియం... ఒకప్పుడు సోయాబీన్ లో 8 8 6 మిల్లీ గ్రాముల పొటాషియం అంటే దాదాపు ఒక మీడియం సైజు అరటి పండు లో ఉన్నంత పోటాషియం లభిస్తుంది శరీరానికి ప్రతిరోజూ 1/3 శాతం వంతు పొటాషియం అవసరం. ఐరన్ ---- ఒకప్పుడు సోయాబీన్ నుంది 9 మిల్లీ గ్రాముల ఐరన్ ద్వారా ఆక్సిజన్ రక్తం అందించడంలో ఐరన్ దోహదం చేస్తుంది మన శరీరానికి రోజంతా 8 మిల్లీ గ్రాముల ఐరన్ ను స్త్రీలకు 1 8 గ్రాముల ఐరన్ ను అందిస్తుంది. సోయా రక్త పోటును నివారిస్తుంది.. మీ నిత్య జీవితంలో సోయాను ప్రతి రోజూ తీసుకుంటే హై బిపి ని నివారించ వచ్చు.సోయాను ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ మాత్రమే కాదు ఇందులో ఇతర పదార్ధాలను కలవడం వల్ల మీ రక్త పోటుతగ్గుతుంది . గుండె పోటును తగ్గించడంలో సోయా ఉపయోగ పడుతుంది. సోయా వల్ల మీ ఎముకలు గట్టిగా ఉంటాయి.. కొంతమంది స్త్రీలలో ఎముకలు బలహీన పడి అప్పుడప్పుడు విరిగిపోతాయి . డాక్టర్ మాత్రం మాత్రం ఈస్ట్రోజన్ తో చికిత్స చేసుకోవాలని సూచిస్తారు.సోయా ఆహారంలో సహాజంగా ఉండే మొక్క ఈస్ట్రోజన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.మెనో పాజ్ ఉన్నవాళ్ళలో ఎముకలు గట్టి పడతాయి. వాక్షోజాల క్యాన్సర్... సోయా బీన్ స్త్రీ లలో వచ్చే వక్షోజాల క్యాన్సర్ నుండి రక్స్జిస్తుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అంటే యుక్త వయస్సులో ఉన్నప్పుడు సోయా బీన్ తీసుకుంటే వక్షోజాల క్యాన్సర్ ను తగ్గించడంలో ఉపయోగ పడుతుంది. సోయా బీన్ తిన్న పెద్దవాళ్ళలో బ్రస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువే అని శాస్త్రజ్ఞ్యులు తేల్చారు సోయా బీన్ క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు సోయా.. ప్రపంచ వ్యాప్తంగా పురుషులలో వచ్చే సహజమైన క్యాన్సర్ లాలో ముఖ్యంగా ఆశియా దేశాలలో పురుషులలో ఎకువగా సోయా బీన్ తింటారో ప్రోస్టేట్ క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని సమాచారం సోయా ప్రోస్టేట్ క్యాన్సార్ కణాలను పెరగ నివ్వదు. ఏమైనా సోయావల్ల అనేక ఆరోగ్య లాభాలు ఉన్నాయని అనడంలో సందేహం లేదు
read moreఇమ్యునిటీ పెరగాలంటే...
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యునిటీ అవసరం అంటే రోగనిరోదక శక్తి... రోగనిరోదక శక్తి లేదంటే శరీరంలో అనారోగ్యం వచ్చినట్లే అంటున్నారు వైద్యులు. ఇమ్యునిటీ పెంచుకోడానికి ఎక్కడెక్కడో వెతక్కక్కర్లేదు. మనం మన ఇమ్యునిటీని సహజంగానే పెంచుకోవచ్చు. అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రకృతి మీకు చికిత్సాలయం ప్రకృతిలో మనకు లభించే సహజ సిద్ధమైన ఆహారాన్ని విడిచిపెట్టి దేనికో వెంపర్లాడు తున్నారు.అని అది సరికాదన్నది వైద్యుల వాదన.ఇది నిజం. ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో వైద్య సంబందమైన పండ్లు, కూరాగాయలు ఆకు కూరలు చాలానే ఉన్నాయని అంటున్నారు వైద్యులు.మీ నిత్య జీవితంలో వాడి చూడాలని అప్పడు మీ ఇమ్యునిటీ మిమ్మల్నిఇట్టే లేపి కూర్చో పెడుతుందని అంటున్నారు. నిపుణులు.మనకు తెలియని పడ్లలో అరుదైన పండు ఎల్దర్ బెర్రీ., ఇది గుబురుగా పెరుగు తుంది.body దీనిని కొన్ని వందల సంవత్సరాలుగా మందులలో వాడుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.ఎల్దర్ బెర్రీ కి మరో పేరు సంభూకస్ నైగ్రా అనే శాస్త్రీయ నామం చెపుతారు. బ్లాక్ ఎల్దర్ బెర్రీ అంటే పరీమ పండు అంటారు.దీని చెట్టు గుబురిగా పొదల ఉంటుందని అంటారు. బ్లాక్ ఎల్దర్ బెర్రీ పండు ను సహజంగా టానిక్ లలో సిరప్ లలో వాడతారని నిపులు పేర్కొన్నారు. ఎల్దర్ బెర్రీ యాంటీ వైరల్ గా కూడా పని చేస్తుందని బ్లాక్ బెర్రీ చక్కటి ఔషదంగా వైద్యులు పేర్కొన్నారు .పరీమా పండు ఎల్దర్లీ బెర్రీ పండు సిరప్ సహజంగా జలుబు ఫ్లూ ,సైనస్, ఇన్ఫెక్షన్ లకు యాంటీ బ్యాక్టీరియా గా పని చేస్తుంది. ఈ మొక్క ద్వారా వచ్చే ఇతర సాధనాలలో శరీరంలో వచ్చే మ్యుకస్,మేం బ్రిన్, లో వచ్చే వాపునుతగ్గిస్తుందని ఇటీవల జరిపిన పరిసోదనలో వెల్లడించారని తెలుస్తోంది.ఎల్దర్ బెర్రీ ఫ్లూ తీవ్రతను తగ్గిస్తుందని,ఫ్లూ ఇన్ఫెక్షన్ పై కూడా పని చేస్తుందని నిపులు తేల్చారు. పుట్ట గోడుగుల్లో రోగా మిరోడక శక్తి----- పుట్టగొడుగులు రోగ నిరోధక శక్తిని పెంచుతాయా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు.ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదు. పుట్ట గొడుగుల ద్వారా రోగ నిరోధక శక్తి ని పెంచు తాయని ఇటీవలి పరిశోదనలు వెలుగు చూస్తున్నాయి. పుట్ట గోడుగులలో ఎక్కు వశాతంసీరం ,విటమిన్ బి, రెబో ఫ్లోబిన్, నియోసిన్, వంటి మినరల్స్, విటమిన్స్ వంటివి రోగ నిరోధక శక్తికి దోహదం చేస్తాయి. మనం తినే ఇతర ఆహారపదార్ధాలలో కూరగాయలతో పుట్ట గొడుగులతో చేసే వంటకాలు బహు పసందుగా ఉంటాయి.అని అంటున్నారు.భోజన ప్రియులు పుట గొడుగుల బిరియాని,పుట్టగొడుగులు గుడ్డుకూర, ముక్క ముక్కలుగాకోసి వేయించినపుట్ట గొడుగుల సూపు, సలాడ్స్ చూస్తే నోరు ఊరిస్తోంది కదు. నోరూరించే పుట్ట గొడుగుల క్రీ తెచ్చుకొండి రోగ నిరోధక శక్తిని పెంచు కొండి
read moreలింఫోటిక్ ఫైలేరియాకి సత్వర చికిచ్చ!
లింఫోటిక్ ఫైలేరియా తో బాధ పడుతున్నవారికి నాణ్యతతో కూడిన సంరక్షణ అవసరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. లిం ఫోటిక్ ఫైలేరియా లేదా లింఫో ఎడిమా7 2 దేశాలలో 1 ౦ మిలియన్ల ప్రజలు ఇతర సమస్యలతో బాధ పడుతున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ స్పష్టం చేసింది. లింఫోటిక్ ఫైలేరియా సిస్ తో బాధ పడుతున్న వారిలో చాలా మంది అంగ వైకల్యం తో బాధ పడుతున్నారని ఫైలేరియాసిస్ నివారణకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలని సూచించింది.లింఫో ఎడిమా హైడ్రోసెల్ ను వివరిస్తూ ఒక ప్యాకేజీని 2 ౦ 1 3 లోనే రూపొందించి నట్లు తెలిపారు. డబ్ల్యు హెచ్ ఓ లో టో పికల్ డిసీజెస్ విభాగానికి చెందిన చికిత్స కు నాయకత్వం వహిస్తున్న డాక్టర్జోనాథన్ కింగ్ మాట్లాడుతూ ఇందుకోసం ఒక మెధ డాలజీ సాధ్యాసాధ్యాల అమలు పర్యవేక్షణ అవసరమనినాణ్యత ప్రమాణాలతో కూడుకున్న ప్యాకేజీ అవసరం అని పేర్కొంది. లింఫో టిక్ ఫైలేరియా సిస్ తో బాధపడుతున్న వారికి ఆరోగ్య సమన్వయం అవసరమని జనతాన్ వ్యాఖ్యానించారు. టోపికల్ విభాగం టోపికల్ డిసీ జెస్ పై కొంత నిర్లక్ష్యం చేసిందని డాక్టర్ జనతాన్ అభిప్రాయ పడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం తప్పనిసరిగా శస్త్ర చికిత్స,నీరు, సేని టేషన్, హైజీన్, కేర్ మేనేజ్మేంట్ అవసరమని నిపుణులు అభిప్రాయ పడ్డారు.లిం ఫోటిక్ ఫైలేరియా బారిన పడ్డ వారి సంఖ్య సర్వే జరపడం రోగులకు సరైన సేవలు అందించేవీలున్న సదుపాయాలను విధి విధి విధానాలను విజయ వంతంగా అమలు చేయాలనీ చర్మ సంరక్షణ కు అవసరమైన నిపుణుల సేవలు వారికీ అందించాలని సూచించింది. కాగా ఈ రోగులకు ఆరోగ్య పద్దతులను నిర్మించడం వీరికి ఉన్నత ప్రమాణాలతో కూడిన సేవలు సంరక్షణకుఅవసరమైన సిబ్బంది నియామకం చేయాలి రోగులు సేవకుల మధ్య సమన్వయం చేయడం అవసరం అని సూచించింది. లిం ఫోటిక్ ఫైలేరియా అవగాహనకు జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమంగా చేపట్టాలని లింఫో టిక్ ఫైలేరియా తో బాధ పడే వారు తిరగ గలగడం, అంగవైకల్య నివారణ ఆయాదేశాలు అమలు చేయాలనీ డబ్ల్యు హెచ్ ఓ సూచించిందిప్ర.పంచ ఆరోగ్య సంస్థ సమన్వయం తో అత్యవసర విభాగం అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరాని పరిగణలోకి తీసుకోవాలని అంతర్జాతీయ అభివృధి సంస్థ యునైటెడ్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డబ్ల్యు హెచ్ ఓ సమన్వయ కేంద్రం లీంఫోటిక్ ఫైలేరియాసిస్ మార్బిడిటీ మేనేజ్ మెంట్ డిసేబిలిటీ ప్రివెంక్షన్ఎట్ గవర్నమెంట్ టిడి మెడికల్ కాలేజ్ అల్పుజ్జా, ఎన్ టి డి పబ్లిక్ హెల్త్ వర్కర్స్ డబ్ల్యు హెచ్ ఓ ప్రాంతీయ సంస్థ వివిధ దేశాల సిబ్బంది స్వచ్చంద సేవాసంస్థలు దాతలు ముందుకు రావాలని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది.
read moreపార్కిన్ సన్స్‌కి చికిత్స తీసుకోవాలి
మీకు టైప్ 2డయాబెటిస్ ఉందా అయితే మీకు పార్కిన్ సన్స్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లండన్ కు చెందిన క్వీన్ మేరీ విశ్వ విద్యాలయం చేసిన పరిశోధనలో టైపు 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారికీ పార్కిన్ సన్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఈ పరిశోదన వల్ల పార్కిన్ సన్స్ త్వరగా విస్తరిస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఒక వేళ పార్కిన్ సన్స్ ఉంటే ఇంకా తీవ్రంగా ఉంటుందని వైద్యులు తమ పరిశోదనలో వివరించారు. ఈ పరిశోధనకు శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. టైపు 2 డయాబెటిస్ మందులు వాడుతుంటే వారిలో కొంచం పార్కిన్ సన్స్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని తేల్చారు. పార్కిన్ సన్స్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. చికిత్స తీసుకోవాలని సూచించారు. గతంలో జరిపిన రివ్యూ లో మెటామాలిసిస్ ఉత్పత్తి డయాబెటిస్ పార్కిన్ సన్స్ మధ్యఉన్న సంబంధం గురించి తెలుసుకోగలిగామని నూతన పరిశోదనలో మూవ్మెంట్ డిజార్దర్స్ జర్నల్ లో ఈ అంశం ప్రచురించారు. మెటా ఎనాలసిస్ దాటా ద్వారా వీటిని పరిశీలించినట్లు తెలిపారు. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పార్కిన్ సన్స్ ప్రభావం పై పూర్తిగా మూల్యాంకనం చేస్తున్నామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు . ఈ అంశం పై క్వీన్ విశ్వ విద్యాలయానికి చెందిన డాక్టర్ అల్సతార్ మాట్లాడుతూ ఈ పరిశోదనవల్ల మరిన్ని అంశాలు వెలుగు చూసాయని అన్నారు. డయాబెటిస్ కేవలం పార్కిన్ సన్స్ మాత్రమే ప్రభావం చూపదని పార్కిన్ సన్స్ వృద్ధి చెందకుండా అందుకు అవసరమైన చికిత్సలు పార్కిన్ సన్స్ నివారణ చికిత్సలు సూచించామని ఆయన అన్నారు.
read moreఅదనపు తీపి - అదనపు అనారోగ్యం
మన రోజువారీ ఆహారంలో ఉప్పుకి ఎంత ప్రాధాన్యత ఉందో తీపికీ అంతే ప్రాధాన్యత ఉంది. శరీరం తనకు కావల్సిన శక్తిని సమకూర్చుకునేందుకు తీపి పదార్థాలలో ఉండే కార్బోహైడ్రేట్లు ఉపయోగపడతాయి. కానీ అవసరానికి మించితే, అదే తీపి మనపాలిట చేదుగా మారే అవకాశం ఉంది. అదెలాగంటే... Added Sugars తీపి మనకు రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి మనం తీసుకునే ఆహారంలో అది సహజంగా ఉండవచ్చు. ఉదాహరణకు పండ్లు, బియ్యం వంటి పదార్థాలకు అదనంగా ఎవ్వరూ తీపిని చేర్చరు కదా! కానీ కృత్రిమంగా రూపొందించుకునే పదార్థాలు రుచిగా ఉండటానికి, వాటికి విపరీతమైన తీపిని జోడించాల్సి ఉంటుంది. వీటినే Added Sugars అంటారు. అది పంచదార కావచ్చు, తేనె కావచ్చు. ఇలా అదనంగా చేర్చిన తీపితోనే అసలు చిక్కంతా వస్తుంది. ఓ పరిమితి ఉంది ఇంతకుముందు వరకూ మన రోజువారీ ఆహారంలో ఈ Added Sugars పరిమితి ఎంత ఉండాలి అన్నదాని మీదే రకరకాల ఊహాగానాలు ఉండేవి. కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన ఒక పరిశోధనతో ఆ అయోమయం తొలగిపోయింది. మిరియం వాస్ అనే వైద్యుని ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో గత నివేదికలనూ, గణాంకాలనూ పరిశీలించి... 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు రోజుకి 25 గ్రాముల (ఆరు టీస్పూనులు) కంటే ఎక్కువగా Added Sugarsని తీసుకోవడం హానికరం అని తేల్చారు. కారణం! ఆహారంలో Added Sugars అధికంగా ఉండటం వల్ల పిల్లల్లో ఊబకాయం, అధిక కొలెస్టరాల్, ఫాటీ లివర్ వంటి సమస్యలు మొదలై అవి భవిష్యత్తులో గుండెజబ్బులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. అంతేకాదు, Added Sugars వల్ల మన శరీరం ఇన్సులిన్‌ను గ్రహించడంలో సమస్యలు ఏర్పడతాయనీ, దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉందనీ పేర్కొంటున్నారు. తీపి ఒక వ్యసనం Added Sugarsకు అలవాటు పడిన పిల్లల పాలిట అవి ఒక వ్యసనంలా మారిపోతాయి. అవి తింటే కానీ తృప్తిగా ఉండని పరిస్థితులు ఏర్పడతాయి. పైగా వాటి రుచికి అలవాటు పడిన పిల్లలు పండ్లు, కూరగాయలు వంటి సహజమైన ఆహారాన్ని తినేందుకు కూడా ఇష్టపడరు. అందుకనే Added Sugars అనేవి పిల్లల పాలిట మద్యపానం అంత హానికరమైన అలవాటు అంటున్నారు నిపుణులు. సాధ్యమేనా! పిల్లలు రోజుకి 25 గ్రాములకు మించకుండా Added Sugarsని తీసుకోమని చెప్పడం బాగానే ఉంది. కానీ ఆచరణలో దీనిని అమలుచేయడం ఎంతవరకూ సాధ్యం అన్నదే సమస్య! అందుకనే 2018 నుంచి ఆహారాన్ని విక్రయించేవారు, వాటిలో అదనంలో చేర్చిన తీపిని (Added Sugars) కూడా పేర్కొనేలా చట్టాలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతవరకూ పిల్లలను తీపి ఎక్కువగా ఉండే కూల్డ్రింకులు, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచడమే మనం చేయగలిగిన పని. - నిర్జర.
read moreకోకాకోలా మాత్రమే తాగితే?
కూల్ డ్రింక్స్ లో కోకాకోలా పేరు తెలియనివారు బహుశ ఉండరేమో. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా ఇది దొరుకుంది. రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ తో ఇది వరల్డ్ మొత్తం ఆక్రమించేసింది. మొట్టమొదటి కోకాకోలాను అట్లాంటాలో 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ ప్రారంభించారు. ఐదువందలకు పైగా బ్రాండ్లతో అన్ని దేశాల్లో లభిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు ఏడులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రపంచజనాభాలో అత్యధికమంది తాగే కూల్ డ్రింక్ఇదేనేమో..! సరదాగా అప్పడప్పుడు కాకుండా రోజూ కోకాకోలానే తాగితే ఏం జరుగుతుంది...! కోకాకోలా రుచికోసం, నిల్వ కోసం దాని ఎన్నో పదార్థాలను కలుపుతారు. ఇది తాగిన తర్వాత రీప్రెష్ అనిపించడానికి కారణం వాటిలో ఉండే పదార్థాలే. మరి రోజూ కోకాకోలానే జీవితాంతం తాగితే ఏం అవుతుంది. .? కోకాకోలా శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది..? దంతాలను ఏమి చేస్తుంది..? నీళ్ళకి బదులుగా కోకాకోలాను తాగితే శరీరానికి కావల్సిన పోషకాలను అది ఎలా భర్తీచేస్తుంది.? ఇలా అనేక అనుమానాలు వస్తాయి కదా....! వాటిని తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు. మోనాకోలో ఒక మహిళ 16 ఏండ్లుగా నీళ్లకు బదులుగా నేరుగా కోకాకోలానే తాగింది. మరీ ఆమె ఆరోగ్యం ఏం అయ్యింది, వాటి నుంచి సర్వైవ్ అయిందా.? ఒక వేళ మనం కూడా ఇలానే చేస్తే ఏమవుతుంది..? ... డాక్టర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పేది ఒక్కటే. శరీరజీవక్రియలు సక్రమంగాజరగాలంటే ప్రతి మనిషి రోజూ తప్పకుండా 3 నుండి నాలుగు లీటర్ల వాటర్ నుతీసుకోవాలని. కానీ దానికి బదులుగా కొకాకోలా ను మాత్రమే తీసుకుంటే... ప్రతి రోజు తీసుకునే ఒక సింగిల్ కోక్ లో 39 గ్రాముల చక్కెర ఉంటుంది. ఒక వేళ 8 కోక్ లను ప్రతి రోజు తాగితే అది 312 గ్రాముల చక్కెర తో సమానం. అది 6 చాక్కెట్ బార్లను ఒకే సారి తిన్నదానితో సమానం. సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజులో 40 గ్రాముల కంటే తక్కువ షుగర్ ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా కాకుండా ఎనిమిది కోక్ లు తాగితే దాదాపు 312 గ్రాముల చక్కెర తీసుకున్నట్టే. కేవలం కోక్ ను తీసుకోవడం వల్లనే వారానికి 8000 అదనపు కాలరీల తీసుకున్నట్లు అవుతుంది. ఇలా ఎక్కువ మొత్తంలో షుగర్ ను తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అధిక కాలరీలు తీసుకోవడం అధిక బరువు సమస్యకు దారితీస్తుంది. అలాగే దంత క్షయానికి హానిచేయడమే కాకుండా, కోక్ ను తీసుకున్న ప్రతి సారి దంతాలు, నాలుక చిగుళ్ళులపై పేరుకొనిపోయి గంటలు కొద్ది ఉంటుంది. సరిగ్గా బ్రష్ చేయకపోయే పంటి మీద ఉన్న ఎనిమల్ పోవడమే కాకుండా శాశ్వతంగా పళ్లను తీసివేయాల్సి వస్తుంది. రోజంతా ఇలానే తీసుకుంటూ ఉంటే వాష్ రూమ్ కి పదేపదే పరిగెత్తాల్సి ఉంటుంది. కోక్ లోని కెఫిన్ అనే పదార్థం అధిక మూత్ర విసర్జనకు కారణం అవుతుంది. కాబట్టి పదే పదే వాష్ రూమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. కెఫిన్ గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు కానీ అందులోని ముఖ్య ఇంగ్రీడీన్ అయిన ఫ్రక్టోస్ కార్న్ సిరప్ గురించి మాత్రం ఆందోళన చెందాలసిందే. ఎందుకంటే ఫ్యాట్లీ లీవర్ సమస్యకు దారితీస్తుంది. దాని లక్షణాలు అలసటగా ఉండటం, పై కడుపులో నొప్పి. అయినా అలాగే కోక్ తాగడం కొనసాగిస్తే ఇంకా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తరచుగా మూర్చ పోవడం, పొటాషియం నిల్వలు తగ్గిపోవడం కూడా జరుగుతుంది. అధిక మోతాదులో షుగర్, కెఫిన్ తీసుకుంటారు కాబట్టి హృదయ స్పందనలో కూడా మార్పులు వస్తుంటాయి. ఈ అనారోగ్య సమస్యలు అక్కడితో ఆగవు. టైప్ -2 డయాబెటిస్ కు గురికావడం జరుగుతుంది. శరీరానికి కావల్సిన విటమిన్ లు లోపిస్తాయి. ఫలితంగా కిడ్నీ డ్యామేజి కి దారితీస్తుంది. అయినా అలాగే కోక్ మాత్రమే తాగుతూ ఉంటే 600 పౌండ్ల వరకు బరువును పెరుగుతారు. అంతేకాదు హార్ట్ అటాక్ తో చనిపోవడం కూడా జరుగుతుంది. 16 ఏండ్లుగా కేవలంకోకాకోలా ను మాత్రమే తాగుతున్న మహిళా కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం వంటి చాలా సమస్యలు చవి చూసింది. చివరికి కోకాకోలా తాగడం ఆపేసింది. దాంతో చాలా తక్కువ సమయంలోనే ప్రాణాపాయం నుంచి బయట పడింది. వారానికో, నెలకో, ఏడాదికో ఒకసారి తీసుకుంటే ఫర్వాలేదు. కానీ, రోజూ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. అప్పుడు రీప్రెష్ ది వరల్డ్ అన్న ట్యాగ్ కాస్త రెస్ట్ ఇన్ పీస్ గా మారుతుంది. సో.. కోకా కోలా గురించి ఇంత తెలిసాక కూడా మీరు తరచుగా కోకాకోలా తాగుతారా.. అలా కావాలని అనుకుంటారా.. కాదు గా..!
read moreFive Healthy skin foods
A healthy skin signifies a healthy body and there are five foods which can add that glow and rejuvenate your skin! Lemon juices: A simple ingredient which can brighten up your skin like no other! Lemon juice tightens up the skin pores, gets rid of the oil, resulting a squeaky clean and shiny face. Eggs: Take the whole egg or simply the white, which when applied on your skin will give an enhanced moisturising effect. The white part firms up the skin. Gently rub the egg white over the skin surface and wash off. Honey: Honey can be applied daily on the face. It has a great moisturising effect and also fights infections and skin acne imparting the skin with soft and supple properties. Take some honey, mix it with few spoons of lemon juice and sandalwood powder and you can apply it for the face followed by rinse off. Strawberries: The fruit acts a very effective cleanser as it contains antioxidants, Vitamin C, and exfoliants. Crushed strawberries can be used a mask and also can be rubbed over your skin. Simply observe the glow! Bananas: The tropical fruits are a great moisturiser which also imparts a refreshed feeling to your skin.
read moreశరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం...
అమృత ఆహారంతోనే ఆరోగ్యం అన్న అంశాన్ని గతంలో ఒక వ్యాసంలో ప్రచురించాం. అందులో పచ్చి కూరగాయలు, పచ్చి ఆకు కూరలు, పళ్ళు వాటి వల్ల వచ్చే ఫలితాలు గురించి చర్చించాం. అయితే అమృత ఆహారంలో రెండవ సూత్రంలో మొలకలు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. మానవశరీరానికి నాణ్య మైన కొవ్వు పదార్ధాలు వచ్చేది మొలకల నుంచే అని అంటున్నారు నిపుణులు. అత్యధికంగా మనకు లభించే ప్రోటీన్లు బీన్స్,ఫల్లీలు,నట్స్ నుంచే అని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో విత్తనాలు, పప్పు ధాన్యాలు, ముఖ్యంగా వాటిని నీళ్ళలో నాన బెట్టిన తరువాత వచ్చే మొలకల వాటివల్ల మరింత ప్రోటీన్ వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. శరీరానికి ప్రోటీన్ల ఆవశ్యకత ఏమిటి అన్న విషయం వచ్చినప్పుడు. మనం తీసుకునే బీన్స్ శనగలు, పప్పు దినుసులలో అవసరమైన పీచు పదార్ధాలు ఉంటాయి. పీచు పదార్ధం శరీరానికి బరువును పెంచుతుంది. పూర్తి శక్తివంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. మొలకలు శరీరానికి అల్కనైజ్ చేయడం ద్వారా చాలా రకాల అనారోగ్యలను నిలువరించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొనే ఎసిడిటీ, క్యాన్సర్, వంటి సమస్యలను నిలువరించడంలో సహాయపడుతాయి. మొలకలు. శరీరానికి ప్రోటీన్లు అందించడమే కాదు. శరీరంలో మూలకణాలను వృద్ధి చేస్తుంది. ప్రోటీన్ ద్వారా డి ఎన్ ఎ పునరుత్పత్తి అవ్వడానికి దోహదం చేస్తుంది ప్రోటీన్లు రోబుస్ట్ ను ఆరోగ్యవంతమైన కణాలను ఇస్తాయి . పెసలు ముఖ్యంగా మొలకెత్తిన పెసలు, నాణ్యమైన ప్రోటీన్ తో పాటు యాంటి ఆక్సి డెంట్ ను శరీరానికి అందిస్తుంది. పెసలు, పెసర పప్పు భారతదేశంలో ఇక్కడ మాత్రమే వృద్ధి చెందింది. ఇది మంచి బలమైన ఆహారంగా పేర్కొన్నారు. పురాతన కాలంలో సాంప్రదాయ వైద్యం అయిన ఆయుర్వేదంలో దాదాపు 1500 వందల సంవత్సరాల క్రితమే మొలకలను తీసుకునే వారని శాస్త్రం చెపుతోంది.అందుకే ఆనాటి కాలం లో ఏది తిన్న అరిగిపోయేదని వైద్యులు పేర్కొన్నారు. పచ్చటి ధాన్యాలు చాలా సులభంగా అరిగి పోతాయి. ఇతర బీన్స్ తో పోలిస్తే అధిక మొత్హం లో పోషకాల తో పాటు మాంగనీస్, పొటాషియం మెగ్నీషియం,పొటాషియం కాపర్, జింక్,ఇతర విటమిన్స్ విటమిన్ బి,విటమిన్ కె, విటమిన్ సి ఐరన్, హై ప్రోటీన్, తో పాటు గంజి, అరుగుదలకు అవసరమైన పీచు పదార్ధాలు. విటమిన్ బి ద్వారా డి ఎన్ ఎ ఉత్పత్తికి నూతన కణాల వృద్ధికి ఇవి దోహదం చేస్తాయి. ఇవి మిమ్మల్నిమీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మొలకలు,ఫల్లీలు,సోయా బీన్స్, సెనగలు,వంటివి అందరికీ సరిపడవు. వారి వారి వయసులను బట్టి. శరీరతత్వాన్ని బట్టి మెటా బాలిక్ శక్తిని బట్టి కొన్నిటిని వదిలి పెట్టాలి అంటున్నారు నిపుణులు. శరీరానికి వ్యాయామం చేసేవారు ఎక్కువగా మొలకలు, సోయా బీన్స్ ఎక్కువగా తీసుకుంటారు. శరీర ఆరోగ్యానికి మొలకలు సర్వదా శ్రేయస్కరం.
read moreచెవిలో గుమిలి పేరుకుపోతే చెవుడే..
చెవిలో పేరుకుపోయిన గుమిలి అలాగే ఉంటే చెవుడు వస్తుందా ? చెవులో పేరుకుపోయిన గుమిలి తీయడానికి చిన్నప్పుడు అమ్మ చాలా తంటాలు పాడేది ఆ ప్రయత్నంలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేసారు. సహాజంగా స్త్రీలు వారు పెట్టుకునే పక్కపిన్నులు లేదా జడపిన్ను పెట్టి అప్రయత్నంగా చెవిలో పెట్టి గుమిలి తీసే ప్రయత్నం చేస్తారు. అలాగే పురుషులు అగ్గి పుల్లలు పెట్టి మరీ చెవిలో గుములు తీసేవారు. ఇంకాస్త ముందుకు వెళ్లి ఖాళీగా కూర్చుని ఊసుపోక పుల్ల పెట్టి అదేపనిగా గుబిలి తీయడానికి ప్రయత్నం చేసేవారు. ఆ క్రమంలో చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మ చెవిలో నూనె పోసి గుబిలి తీసేవారు నేను ఆ నొప్పి భరించేవాడిని కాదు. నాకు దాదాపు మూడు సంవత్సరాలు అనుకుంటా నేను ఇయర్ ఎయిడ్స్ ఇష్టపడే వాడిని కాదు. మా అమ్మ ఒకటి రెండుసార్లు ఇయర్ బడ్స్ ను పెట్టడానికి ప్రయత్నం చేసింది. అలా చేసినప్పుడు ఒచ్చిన ఆ నొప్పి ఇప్పటికి ఇంకా నాకు గుర్తుంది. ఆ విషయం అలా ఉంచితే, ఈ మధ్యలో నా చేవిని శుభ్రం చేయలేదు. గుమిలి తీయకుండా అలాగే ఉంచాను. ఇప్పుడు కాటన్ స్వప్స్ వాడడం మొదలుపెట్టాను. అదే నేను చేసిన పెద్ద తప్పు.. చెవులో పేరుకు పోయిన గుమిలి తీసే ప్రయత్నం చేసాను. ఒక చోట పెట్టబోయి మరోచోట కాటన్ స్వాప్ ను పెట్టాను. గుమిలి తీయడానికి తీవ్ర ప్రయత్నం చేసాను. అప్పటికే ఆ గుమిలి బాగా గట్టిపడిపోయింది. చెవిలో ఉన్న ఇయర్ కెనాల్ మూసుకుపోయింది. ఇప్పుడు ఊహించండి అప్పుడు ఏమయ్యిందో? ఆ అదే నిజం నా చెవిలో గుమిలి పూర్తిగా నిండిపోయింది. అప్పటికే నా వయస్సు 50 సంవత్సారాలు దీని నుండి బయటపడలేకపోయాను. చివరికి శుభ్రం చేయాలని ప్రయత్నం చేస్తే తీవ్ర మైన సమస్యలు ఎదురయ్యాయి. అది ఒక్కటే కాదు. నేనే చాలా భయపడ్డాను. వెంటనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే ఆ విషయం తెలిసింది. నా చెవి నాళం పూర్తిగా మూసుకుపోయిందని. చెవిలో గుమిలి పేరుకు పోవడాన్ని పరిశోధనలు చేశారు. చెవిలో గుమిలి పేరుకు పోవడం వల్ల దిమ్నీషియా వస్తుందని తెలిసింది. చెవిలో పేరుకు పోయిన గుమిలి వల్ల చెవిలో హోరు వస్తుంది అది మీ చెవి సమస్యకు గురైందని మొదటి హెచ్చరికగా వైద్యులు పేర్కొన్నారు. దేనివల్ల భవిష్యత్తులో చెవిలో వినికిడి లోపం వస్తుందని అనడానికి ఇది అప్రమత్తం చేస్తుందని వైద్యులు పేర్కొన్నారు. అయితే దీర్ఘకాలంగా చెవుడు సమస్య రావచ్చని అయితే చిన్న నిర్లక్ష్యం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని. సమాజంలో పూర్తిగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సమాజంలో అందరికంటే వెనకబడిపోయమన్న భావన, వినికిడి లోపం వల్ల త్వరగా స్పందించలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోక తప్పని స్థితి వస్తుంది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న పాటి ఇయర్ ఇంప్లాంట్స్ వచ్చిన నేపథ్యంలో కక్లర్ ఇంప్లాంట్స్ వచ్చాక వినికిడి సమస్యకు పరిష్కారం వచ్చిందని నిపుణులు అంటున్నారు.
read moreకిడ్నీ సమస్యలతో జీవించడం అసాధ్యమా ?
సాధ్యమా అన్న సందేహం కిడ్నీ రోగులను వేదిస్తోన్న ప్రశ్న ? అయితే ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నిజాం ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి చెందిన ప్రొఫెసర్, హెచ్ ఓ డి డిపార్ట్ మెంట్ అఫ్ నేఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీభూషణ్ రాజు వన్ హెల్త్ తో మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న నేఫ్రాలజిస్ట్లులు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు. కిడ్నీ ఫేయిల్యూర్ తరువాత చాలా మంది రోగులు ఇక జీవించడం ఎందుకని అసంతృప్తి నిరుత్సాహంతో ఉంటారు. కిడ్నీ సమస్య ఒకప్పుడు మరణసశానమే అని అన్నారు. అయితే కిడ్నీ సమస్య ఉన్నవారు జీవించడం సాధ్యమే అని, రోగులకు భరోసా కల్పించారు.డాక్టర్ శ్రీభూషణ్ రాజు 40 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఆయన వన్ హెల్త్ చానల్ కు వివరించారు. అయితే డయాలసిస్ తో అందరూ బాగుపడవచ్చని ఆయన అన్నారు. డయాలసిస్ తరువాత తిగి వెనక్కు చూడలేదని అన్నారు. డయాలసిస్ చేసుకుని సాధారణ జీవితం గడుపుతున్న లక్షలాది మంది ఇప్పటికీ జీవిస్తున్నారని శ్రీభూషణ్ రాజు అన్నారు. కిడ్నీ ఫేయిల్యూర్ వస్తే చింతించాల్సిన అవసరం లేదని 30 ఏళ్లుగా డయాలసిస్ చేసుకుంటున్నవారు ఉన్నారని అన్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు,లివర్ పాడైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని ఇలాంటి మల్టిపుల్ సమస్యలు ఉంటే కిడ్నీ ని సహజంగా డయాలసిస్ చేసిన కొన్నిసార్లు కష్టమౌతుందని అన్నారు.కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళు 100 % పాడైపోయిన వారే ఎక్కువగా వస్తు ఉంటారని శ్రీభూషణ్ రాజు అన్నారు. డయాలసిస్ అనగానే భయపడేవారు ఎక్కువ అని వివరించారు. కిడ్నీ పాడైతే డయాలసిస్స్ నా?అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కొంత మందికి తీవ్రతను బట్టి తక్కువ రోజులు లేదా కిడ్నీ డ్యామేజ్ తో పాటు ఇన్ఫెక్షన్ లేదా చీము వచ్చిన వారికీ పూర్తిగా కోలుకునే వరకు చికిత్స ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. కొంత మంది వ్యాధి తీవ్రతను గుర్తించకుండా తాము ఎక్కువ రోజులు అసుపత్రిలో ఉండలేమని ఇంటికి వెళ్లిపోతామని ఒత్తిడి చేస్తారు. అలాంటాప్పుడు కుటుంబ సభ్యులు స్నేహితులు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలనీ అన్నారు. కిడ్నీ వంద శాతం పాడైనా ఇప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతికత వల్ల పరీక్షలు చేయించుకుంటూ ముందుగానే కనుక్కుని జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటనలు చూసామని వన్ హెల్త్ కు చెప్పారు. కిడ్నీ పాడైతే శరీరం పాడై పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిడ్నీ పాడైతే బిపి పెరుగుతుందని,దీర్ఘకాలికంగా కిడ్నీ పాడై కండరాలు పాడై పోతాయని అయితే దీర్ఘకాలంగా మందులు వాడితే జీవించగలమన్న ఆశ పెరుగుతోందని శ్రీ భూషణ్ రాజు అన్నారు. క్రానిక్ కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రెండు పద్దతులలో డయాలసిస్ చేసుకోవచ్చని అన్నారు. ఒకటి కడుపులో వేసుకునేది. ఇంట్లోనే డాయలసిస్ చేసుకోవచ్చు. కిడ్నీ డయాలసిస్ చేసుకుంటేనే ఆనందంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రక్త హీనతతో ఉండడం వల్ల నీరసంగా ఆయాసం గా ఉంటారని అన్నారు. బిపి వల్ల కిడ్నీ సమస్య ముదరకుండా చూడవచ్చు అని విశ్లేషించారు. దీనికి త్వరగా మందులు వేసుకుంటే బయటపడవచ్చునని సూచించారు..రెట్రోహార్మోన్ వల్ల మామూలుగానే జీవించవచ్చని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్ వల్ల కిడ్నీపాడైపోతుందని ఈవిషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సాత్విక ఆహరం తీసుకోవాలని సూచించారు.. ఇక డయాలసిస్ తో కిడ్నీమెరుగు కాకుంటే కిడ్నీ ఫెయిల్ అయితే నిరుత్సహపడవదని కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే లక్షలాది మంది కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశాక ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. సరైన సమయంలో సరైన చికిత్సమందులు డాక్టర్ సూచన పాటిస్తే కిడ్నీ వ్యాదుల నుండి బయటపడి ఆనందంగా జీవించవచని. అది సాధ్యమే అని డాక్టర్ శ్రీభూషణ్ రాజు విశ్వాసం కల్పించారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం రోజున మన మందరం కిడ్నీ రోగులకు వారు తిరిగికోలుకునే విధంగా వారికి అవగాహన కల్పించి ఆరోగ్యంగా ఉండేవిధంగా చూడాల్సిన బాధ్యత మనదే అని అన్నారు.
read moreతొక్కలతో దోమలకు చెక్
దోమలతో యుద్దానికి ప్రపంచ దేశాలు సన్నద్ధం అవుతున్నాయి అని ఈ మధ్య రోజు వార్తలలో వింటున్నాం కదా. జికా దోమను ఎదుర్కోవటం ఎలా అన్న విషయం లో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి కూడా . అయితే ఈ జాతి దోమ మాత్రమే కాదు మనకు వచ్చే ఎన్నో ఎలర్జిలకు,జ్వరాలకు కారణం అవుతున్న ఎన్నో రకాల దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు. మనం తరచూ దోమలు పోవటానికి వాడే లిక్విడ్ రీఫుల్స్ ,కోఇల్స్,ఇంకా మస్కిటో మాట్స్ వీటివల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. నమ్మకం కుదరకపోతే ఈ సారి ఏదైనా లిక్విడ్ రీఫుల్ ఇంటికి తెచ్చాక దానిలో ఉండే leaflet చదవండి, ప్రికాషన్ అని కనికనిపించని అక్షరాలతో రాసిన దగ్గర కొంతమందికి స్కిన్ ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు,దురదలు,నరాల బలహీనత మొదలైనవి వస్తే వెంటనే డాక్టర్నిసంప్రదించండి అని ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ద నివారణా మార్గాలు ని పాటిస్తే సరి. * మనం తినే కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు దూరం. * పుదినా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. * దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేసి పెడితే చాలు. దోమల ఉదృతి తగ్గుతుంది. * అరటి తొక్కలు కాల్చినా చాలు దోమలు మాయం అవుతాయి. * వేపాకుల్ని ఎండబెట్టి కాల్చి ఆ పొగ పెట్టినా దోమలు రావు. * వేసవి కలం లో అయితే మనకి ఈజీగా దొరికే మామిడిపండు తొక్కల్ని కాలిస్తే దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దోమలకి సులువుగా చెక్ చెప్పచ్చు . .. ----కళ్యాణి
read moreతల తిరగం తగ్గాలంటే.. ఆయుర్వేద ఔషధం..
తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం సమస్యకు ఆయుర్వేదంలో చక్కని పరిష్కారం ఉందని అంటున్నారు ఒజెస్ ఆసుపత్రికి చెందిన ఆయుర్వేద వైద్యులు డాక్టర్ టి వేణుగోపాల్. తల తిరగడం అంటే భ్రమ అని వాత పిత్త దోషం వల్ల భ్రమ వస్తుందని ఆయన అన్నారు. ఈ లక్షణాలలో భాగంగా ఒళ్ళు తిరగడం గిడ్డినేస్స్ కు కారణాలుగా పేర్కొన్నారు. బిపి, షుగర్ లెవెల్స్ ఎక్కువయినప్పుడు తల తిరగడం లేదా ఒళ్ళు తిరగడం వంటి లక్షణాలు గమనించవచ్చని తెలిపారు. సర్వైకల్ స్పొండోలసిస్, డిస్క్ బల్జ్, డిస్క్ డీజనరేషన్, వల్ల సర్వైకల్ నర్వ్ ఒత్తిడికి గురై బిగుసుకు పోతాయని వేణుగోపాల్ వివరించారు. దీనికి కారణం రక్త ప్రసారం చేసే నరాలు కుంచించుకుపోయి గిడ్డి నెస్ వస్తుందని అన్నారు గిడ్డినేస్ వల్ల ఎక్కువసేపు పడుకోవాలని అనిపిస్తుంది, చీకట్లు కమ్ము కుంటాయి. అంత కళ్ళముందు చీకట్లు కమ్ముకుని ఉన్నట్లు అనిపిస్తుంది. గిడ్డి నెస్ వల్ల నిద్ర సరిగ్గా లేక పోవడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం నడుస్తూనే గిడ్డినెస్ తో కింద పడిపోవడం గమనించవచ్చని వేణుగోపాల్ అన్నారు. ఒక్కోసారి పడుకున్న తగ్గదు. ఆయుర్వేదం లో ఈ సమస్య పరిష్కారం కోసం కృష్ణాది చూర్ణం అంటే నాలుగు మూలికలు వేసి తాయారు చేసిన గుళికలు చేసుకుని 9 వారాలులు తీసుకుంటే గిడ్డి నెస్ పోయి ఆరోగ్యంగా ఉంటారు. అందుకు పెద్దగా ఖర్చు కూడా ఏమి లేదు. పిప్పలి -- అంటే పిప్పళ్ళు, సత పుష్ప బద్దసోంపు, కరక్కాయ -హరీతగి తీసుకోవాలి. ఇప్పడు ఈ మందును ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కరక్కాయల్ని నీళ్ళలో వేస్తే పాడై పోయిన కరక్కాయలు అడుగుకి చేరి పోతాయి ఆ తరువాత కరక్కాయ పెచ్చును తీసుకోవాలి. శొంఠి అంటే బాగా ఎండ బెట్టిన అల్లం, సమ పాళ్ళలో తీసుకోవాలి. పిప్పళ్ళను మూకుట్లో వేయించాలి. కొంచం తెల్లగా వచ్చిన వెంటనే పొడి చేయాలి. ఆ తరువాత శొంఠి బాగా దంచ్చుకోవాలి. శత పుష్ప ను లైట్ గా వేయించుకోవాలి. శొంఠి, కరక్కాయ, పిప్పళ్ళు, విడివిడిగా పోడి చేసుకోవాలి.యాభై గ్రాముల పిప్పళ్ల పొడి , యాభై గ్రాముల సత పుష్ప, యాభై గ్రాముల యాభై గ్రాముల కరక్కాయ పొడి యాభై గ్రాముల శొంఠి పొడియాభై గ్రాముల బద్ధ సోంపు పొడి ఇలా సమ పాళ్ళలో కలుపుకొని అనీ కలిపి 400 గ్రాములు తయారు చేసిన మిశ్రమాన్ని,400 గ్రాముల బెల్లం కలిపి బాగా కలలిపి గుండ్రని మాత్రలు తయారు చేసుకోవాలి. ప్రతి రోజూ మొహం కడుక్కోగానే మాతర వేసుకుని ఆవు పాలు తాగాలి. అలా తొమ్మిది వరాలు తీసుకుంటే గిడ్డినేస్స్ పోయి హాయిగా ఆరోగ్యంగా ఉంటారు.
read moreథైరాయిడ్ కి చికిత్స వచ్చేసింది..
మెటబాలిజం సమస్యకు పరిష్కారం దొరికింది అంటున్నారు వైద్యులు .. థైరాయిడ్ వల్ల వచ్చే ఊబకాయం ,హైపో థైరాయిడ్, డయాబెటీస్ వంటి సమస్యలకు . యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్ వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు శాస్త్రజ్ఞులు పరిష్కారం కనుగొన్నారు. శరీరంలో థైరాయిడ్ గ్రంధి ఎలా నియంత్రిస్తుందో అందరికీ తెలుసు. మెటబాలిజం సమస్యల వల్ల శరీరంలో వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు థైరాయిడ్ హార్మోన్ సెల్స్ ఎలా పని చేస్తాయో ఇప్పటికీ ఎవరికీ పూర్తిగా అవగాహన లేదనే చెప్పాలి. ఈ అంశం పై పరిశోధనలు చేస్తున్న ప్రేల్ మాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వ విద్యాలయం థైరాయిడ్ మిస్టరీని ఛేదించింది . ఇది కేవలం ఆన్ ఆఫ్ డి మ్మర్ గా మాత్రమే పని చేస్తుందని నిపుణులు వివరించారు .థైరాయిడ్ వల్ల వచ్చే మెటాబాలిజం ఎలా ఉంటుంది.. ఎందుకు తగ్గుతోంది. సాంకేతికంగా జీన్స్ పై స్టడి చేయడం కొంత ఇబ్బందితో కూడిన వ్యవహారం. జీన్స్ ను వృద్ధి చేసాక మరిన్ని సమస్యలు అధిగమించ వచ్చని శాస్త్రజ్ఞులు ధీమా వ్యక్తం చేశారు. థైరాయిడ్ వల్ల వచ్చే సాంకేతిక సమస్యలు పై సమగ్ర విశ్లేషణ పూర్తి పరిశోధన అవసరమన మరిన్ని మోడల్స్ పరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే కాదని రి ప్రేషన్ ఆన్ ఎన్ హన్స్ మెంట్ అఫ్ జీన్ యాక్టివిటీ అన్న అంశంపై పరిశోదన చేస్తున్న మితచెల్ లాజెర్ డయాబెటిక్, మెటబాలిక్ ప్రొ ఫెసర్ గా పని చేస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ లేకుంటే వచ్చే సమస్యలు హైపో ధైరాయిడిజం గురించి వివరించారు. మాలిక్యుల్ ధైరాక్సిన్ ఉత్పత్తి చేస్తుందని దీనిని 1914 లోనే కనుగోన్నట్లు చెప్పారు. శరీరంలో మెటాబాలిజంకు కారణం ధైరాయిడ్ అన్న విషయం ఎన్ డ్రో క్ర నాల జిస్ట్ లు కనుగోన్నారు. దీని వల్ల వచ్చే సమస్యలు హై కొలస్ట్రాల్ డయాబెటీస్ ఫ్యాటీ లివర్ సమస్యలు ఈ సమస్యకు ఎక్కువ మొతాదులో మందులు వాడాల్సిఉంటుంది. హార్మోన్ అని తీరుపై 4 ౦ సంవత్సరాలుగా పని చేస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ రీసేప్టర్ పని చేసే తీరు ను పరిశోదన కష్ట సాధ్యమని అయితే డి ఎన్ ఎ ద్వారా ధైరాయిడ్ హార్మోన్లు ఎలా వస్తాయో గుర్తించారు. డాక్టర్ ఎహుదా లాజర్ ల్యాబ్ లో అమర్చిన ఒక బ్యాగ్ ను అమర్చారు . మేటాబాలిక్ హార్మోన్ ప్రభావం ఎక్కువగా లేదని తేల్చారు. టి ఆర్ బి ద్వారా ధైరాయిడ్ పని తీరును తెలుసు కోవాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పూర్తి పరీక్షల అనంతరం దీని వినియోగిస్తామని క్లినికల్ ట్రైల్స్ వచ్చిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.
read moreగర్భానికి కాలుష్యం దెబ్బ
వాయు కాలుష్యం వల్లే దక్షిణ ఆశియలో గర్భం కోల్పోతున్నారని పరిసోదనలు వేల్లదిస్తునాయి. దక్షిణ ఆశియలో 3 ౦ % మహిళలు గర్భం కోల్పోతున్నారని అందుకు కారణం కేవలం కలుషిత వాతావరణమే అని నిపుణులు తేల్చారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారత్ దేశాలలో వాయు కాలుష్యం నాణ్యత గణనీయంగా పడి పోయిందని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మొగిస్తోందని ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకో వలసిన అవసరం ఉందని నిపుణులు తమ పరిశీలనలో పేర్కొన్నారు. దక్షిణా ఆశియాలో గర్భిణీలు ప్రపంచం లోనే అత్యంత ప్రమాద కరమైన దరిద్రమైన వాయుకాలుష్యం వాతావరణం లో మగ్గి పోతున్నారని ఇది దుర దృష్ట కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. డబ్ల్యు హెచ్ ఓ చెప్పిన ప్రమాణాల కన్నా అత్యధిక వాయు కాలుష్యం ఉన్నదన్న విషయాన్ని గమనించి నట్లు నిపుణులు ఈ ప్రభావం వల్లే 3 ౦ % మహిళలు గర్భం కోల్పోవడం బాధాకరమని నిపుణులు ఆవేదన వ్యక్తం చేసారు. ల్యన్సర్ ఫ్లా నెట్ హెల్త్ లో ఈ అంశాన్ని ప్రచురించారు. 2 ౦ ౦ ౦ - 2 ౦ 1 6 లో ఈ పరిశీలన చేసినట్లుతెలుస్తోంది.ఎపిడమాలజీ విధానం ద్వారా పి ఎం లెవెల్స్ పరిశీలించారు. వాయు కాలుష్యం తీవ్రత 2 .5 మైక్రాన్లు గా ఉందని కనుగొన్నారు. వాయుకాలుష్యం వల్ల గర్భ విచ్చిన్నం కావడం, గర్భం దాల్చక పోవడానికి 2 ౦వారాలు పడు తోంది. ఇరవై రోజుల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం జరిగి పోడానికి కారణం పుతిన వెంటనే చని పోవడం జరగడం పట్ల నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. పుట్టిన పిల్లలు వారంలోనే చని పోవడాన్ని తీవ్ర పరిణామంగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్, భారత్, పాకిస్తాన్,లలో సంవత్సరానికి 2 9 . 7% గర్భం దాలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కన్నా 2 . 5 % మైక్రాన్ లెవెల్స్ పెరిగి పోయిందని. దీని వల్ల 3 5 % గర్భ నిరోధం జరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ పరిశోధన డెమోగ్రాఫిక్ హెల్త్ సర్వ్ ప్రకారం పరిశీలించి నట్లు నిపుణులు పేర్కొన్నారు. taoxueపోస్ట్ డాక్టర్ రీసెర్చర్ గా పని చేసారు. ఇన్స్టిట్యుట్ ఆఫ్ రిప్రోడక్టివ్ చైల్డ్ హెల్త్ హెల్త్ కీల్యాబో రెట్రీ రేప్రోదక్టివ్ హెల్త్ పికింగ్ యునివర్సిటీ టోన్ హెల్త్ ప్రతి నిధి తో మాట్లద్దరు' వాతా వరణ కాలుష్యం నియంత్రణ కు నూతన విధానం రూపకల్పన చెయడ పెద్ద సవాల్ అని టావో పేర్కొన్నారు. గర్భం కోల్పోడానికి లెక్క పెట్ట లేనన్ని కారణాలు కొన్ని వాస్తవాలు వెలుగు చూసాయని అన్నారు. కుటుంబ నియంత్రణ పద్దతులు అవసరం లేకుండానే నియంత్రణ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని కొంత మందిలో సాధారణం గానే జన్మ నివ్వ డం గమనించామని తెలిపారు. వాయు కాలుష్యం 2. 5 % మైక్రాన్లు అంతకు మించి ఎక్కువగా పెరిగితే గర్భ విచ్చిత్తి, అబార్షన్ లు వంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణం లో కాలుష్యం కీలక అంశం గా పేర్కొన్నారు. గర్భిని స్త్రీలు ఎదుర్కొంటున్న గర్భ విచ్చిత్తి మరణాలు నియంత్రణ కావాలంటే వాతావరణ వృద్ధి విధానాన్ని అమలు చేయాలని దీని వల్ల ఒత్తిడికి గురికావడం గర్భం తోనే మరణించడం వంటి సమస్యల నుండి బయట పడాలంటే దీని కోసం అయ్యే ఖ ర్చు పెర్గి పోవడం స్త్రీలకు ఇచ్చే మెటర్నటీ హెల్త్ సెలవులు ఇవ్వడం అత్యవసరమని నిపుణులు సూచించారు. ఒచ్చే ఆదాయం అంతంత మాత్రం కావడం వల్ల పెరు గు తున్న కాలుష్య ప్రమాదం పొంచి ఉందని వీటి పై సత్వర చర్యలు చెప్పడడం అవసరమని భారత్ కు చెందిన లలిత్ ధన్ దోనా పరిసోదనలు పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాకు ప్రభుత్వ ప్రైవేటు భాగ స్వామ్యంలో నడుస్తున్న సంస్థ కాలుష్యం ప్రజా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యాక్తం చేసారు. కాలుష్యం పెరిగితే ఇతర అనారోగ్య సమస్యలు పెరిగి మరణాలు సంభావించ వచ్చని నిపుణులు ఆభి ప్రయ పడ్డారు. సో మనుషులు కలుషిత మైనా సమాజానికి ముప్పు, వాతావరణం కలుషిత మైన ప్రజలకు ముప్పు. సచిన్ టి ఫిక్ గా ఆలోచించకండి కాస్త ప్రజా ఆరోగ్యం పట్ల ఆలోచించండి.
read moreచర్మ క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్..!
ఎండలో ఎక్కువసేపు ఉంటున్నారా.. చర్మం పై ఎర్రని దద్దుర్లు, మంట పుడుతుందా.. అయితే కాస్త జాగ్రత అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ క్యాన్సర్ తో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండేలాని సూచిస్తున్నారు. అంతే కాదు చర్మ సమస్యలతో బాధ పడుతున్న వారు విటమిన్ బి3 ఎక్కువగా తీసుకోవడంతో చర్మ క్యాన్సర్ ను అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం... సూర్యకాంతి ఆరోగ్యానికి మంచిదే. అలాగని ఎక్కువ సేపు ఎండలో ఉండటం మాత్రం అంత సురక్షితం కాదు. ఎందుకంటే.. సూర్యుడి నుంచి వెలువడే అతి భయానక అల్ట్రా వయోలెట్ (UV) కిరణాల వల్ల చర్మంలోని కణాలు దెబ్బతింటాయి. ఇది కొందరిలో చర్మ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అయితే, తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇటలీకి చెందిన పరిశోధకులు నాన్-మెలనోమా స్కిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగుల నుంచి సేకరించిన కొన్ని కణాలు (కెరాటినోసైట్స్) ఐసోలేట్ చేశారు. ఈ కణాలకు మూడు రకాల సాంద్రతలతో ట్రీట్మెంట్ చేశారు. నికోటినామైడ్ (NAM), విటమిన్-B3లను అందించి 18 నుంచి 48 గంటలు యూవీబీ కిరణాల ముందు ఉంచారు. ఫలితాల్లో.. యూవీ వికిరణీకరణానికి ముందు 25 మైక్రోన్ల NAMతో ప్రీట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల యూవీ ప్రేరిత ఆక్సీకరణ వల్ల కలిగే ఒత్తిడి, డీఏయే డ్యామేజ్ నుంచి చర్మ కణాలకు రక్షణ లభించింది. ఈ సందర్భంగా రీసెర్చ్ స్టూడెంట్ లారా క్యామిల్లో మాట్లాడుతూ.. విటమిన్ బీ3 వినియోగం పెంచినకొద్ది చర్మం యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు తగ్గు ముఖం పట్టాయి. అయితే, విటమిన్-బీ3 రక్షణ ప్రభావం తక్కువ. కాబట్టి.. సూర్యరశ్మి సోకడానికి 24 లేదా 48 గంటల ముందు తీసుకోకూడదు అని తెలిపారు. ఈ పరిశోధన భవిష్యత్తులో యూవీ క్యాన్సర్‌కు గురయ్యే బాధితులకు ఊరటనిస్తోంది.
read moreగుండెల్లో మంట.. అది కాన్సర్ కావచ్చు!
మీరు దీర్ఘ కాలంగా గుండెల్లోమంటతో బాధ పడుతున్నారా... అయితే అది ఎసొఫెగల్ లారెక్ష్స్ కాన్సర్ కావచ్చు అంటున్నారు నిపుణులు. దీర్ఘ కాలంలో గుండెల్లో మంటగా ఉంటె అది క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. యు ఎస్ ప్రభుత్వం నిర్వ హించిన పరిశీలనలో ఈ విషయం బయట పడింది. 50 సంవత్సరాలు పై బడినవారిలో నిర్వహించిన సర్వేలో ఎసోఫెగల్ రిఫ్లెక్స్ సమస్య ఉంటె వారిలో రెండు ఇంతలు క్యాసర్ వచ్చే అవకాశం ఉందని దీనీని ఎసోఫేగస్, లేదా లారీ ఎన్ ఎక్ష్ వాయిస్ బాక్స్ పోయేందుకు దోహద పడుతుంది. ఎప్పుడైతే పొట్టలో ఉండే యాసిడ్లు మాయమై ఎసోఫెగస్ కు చేరుతాయో మాస్క్యులర్ ట్యూబ్ ద్వారా గొంతుకు కనక్ట్ కావడం వల్ల గుండెల్లో మంటరావడం సహజం. అది సాధారణం కంటే ఎక్కువగా ఉంటె వారిలో 20% అమెరికన్ ప్రజలలో ఉన్నట్లు గుర్తించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ దీనిని ఎడినా కాసినోమా లేదా ల్యారీన్ జీల్ కాన్సర్ గా నిర్ధారించారు. ఇది వాయిస్ బాక్స్ లో వస్తుంది. అయితే దీని వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయి నప్పటికీ ఇది క్యాన్సర్ గా మారదని జి ఆర్ డి పై పరిశోదన కేవలం ప్రజలను అప్రమత్తం చేసేందుకే అని అన్నారు. క్రి స్టాన్ అబ్ నెట్ యు ఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ చెందిన ఈ బృందానికి నేతృత్వం వహించారు. సెల్ కార్సినోమా సహజంగా ఉండేదే అని ఎసోఫెగల్ క్యాన్సర్ కు దానికి గల సంబంధం తెలుసుకోవాలని అన్నారు.
read moreఆరోగ్యం దుమ్ముకొట్టుకుపోతోంది
మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి. పరిశోధన గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట. వేటి నుంచి? ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్‌స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్ కెమికల్స్... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది. తీవ్రమైన హాని ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్‌ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం. దుమ్ము దులుపుకోవడమే! మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.
read more









.jpg)
.jpg)


.jpg)







